Diabetes Patch: ఆ హీరోయిన్ చేతికున్న నల్లటి ప్యాచ్ ఏంటి? షుగర్ పేషెంట్లు దీన్ని వాడొచ్చా?-why katrin kaif seen wearing diabetes patch know its usage ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Diabetes Patch: ఆ హీరోయిన్ చేతికున్న నల్లటి ప్యాచ్ ఏంటి? షుగర్ పేషెంట్లు దీన్ని వాడొచ్చా?

Diabetes Patch: ఆ హీరోయిన్ చేతికున్న నల్లటి ప్యాచ్ ఏంటి? షుగర్ పేషెంట్లు దీన్ని వాడొచ్చా?

Koutik Pranaya Sree HT Telugu
Oct 05, 2024 04:30 PM IST

Diabetes Patch: చీరకట్టులో మెరిసిన కత్రినా కైఫ్ చేతికున్న నల్లటి ప్యాచ్ ఒకటి ప్రత్యేక టాపిక్ అయ్యింది. సాధారణంగా డయాబెటిస్ ఉన్నవాళ్లు వాడే ఈ ప్యాచ్ గురించి, దాని లాభాలు, వాడకం గురించి తెల్సుకోండి.

డయాబెటిస్ ప్యాచ్
డయాబెటిస్ ప్యాచ్

ముంబైలోని కలినా ఎయిర్ పోర్టులో కత్రినా కైఫ్ ఫెస్టివల్ లుక్ లో అదరగొట్టింది. అందమైన చీరకట్టులో మెరిసిపోయింది. విక్కీ కౌషల్ ఏ దేవుడికి మొక్కితే తనకింత అందమైన భార్య దొరికిందంటూ కామెంట్లూ పెట్టేస్తున్నారు ఈ ఫొటోలకు. నవరాత్రి ఉత్సవాల కోసం కత్రినా ఈ లుక్ లో అలరించింది. అయితే ఈ లుక్‌లో అందరి దృష్టిని ఆకర్షించింది మరోటి ఉంది. అదే కత్రినా చేతికున్న నల్లటి ప్యాచ్.

కత్రినా కైఫ్ చేతికి బ్లాక్ ప్యాచ్:

కత్రినా చేతికున్న ప్యాచ్ చూసి కొందరైతే ఇది కొత్త ఫ్యాషనా ఏంటంటూ ప్రశ్నిస్తున్నారు. నిజానికి తన చేతికుంది డయాబెటిస్ ప్యాచ్. దాన్నే బ్లడ్ షుగర్ మానిటర్ ప్యాచ్ అని కూడా అంటారు. డయాబెటిస్ ఉన్నవాళ్లు రక్తంలో చక్కెర స్థాయులు నియంత్రించుకోవడం సవాలుతో కూడుకున్న పని. నిరంతరం ఆహారం మీద ఓ లెక్కతో ఉండాల్సిందే. ఈ డయాబెటిస్ ప్యాచెస్ పెట్టుకుంటే అవి నిరంతరం రక్తంలో చక్కెర స్థాయుల్ని ట్రాక్ చేస్తూ ఉంటాయి.

డయాబెటిస్ ప్యాచెస్ ఎలా పనిచేస్తాయి?

డయాబెటిస్ ప్యాచెస్ కంటిన్యూయస్ గ్లూకోజ్ మానిటర్ (సిజిఎం డివైస్) లో భాగం. వీటిని చర్మంపై అతికిస్తారు. ఇవి రోజంతా శరీరంలో రక్తంలో చక్కెర స్థాయిలను ట్రాక్ చేస్తాయి. వాటి తాళూకు రీడింగులు వేరబుల్ పరికరం లేదా ఫోన్‌కు పంపుతాయి. ఈ సెన్సార్ డివైస్ లేదా ప్యాచ్ చర్మానికి అంటుకునేలా డిజైన్ చేస్తారు. డయాబెటిస్ ప్యాచ్ మార్చాల్సి వస్తే, దానిని బ్యాండ్-ఎయిడ్ లాగా స్టిక్కర్ లాగా సులభంగా తీసేసి మరో ప్యాచ్ పెట్టుకోవాలి.

డయాబెటిస్ ప్యాచ్ ఎవరికి అవసరం?

టైప్ -1 డయాబెటిస్, టైప్ -2 డయాబెటిస్ ఉన్నవారు వారి రక్తంలో చక్కెర స్థాయిలను నిరంతరం చెక్ చేసుకోవాలి. దానికోసం వైద్యుల సలహాతో ఇన్సులిన్ షాట్స్ కూడా తీసుకోవాలి. ఇలా మధుమేం ఉన్నవారు వారి చక్కెర స్థాయిలను నిరంతరం పర్యవేక్షించడానికి డయాబెటిస్ పాచెస్ ధరించాలని సలహా ఇస్తారు.

Whats_app_banner