Preventing White Hair Juice : తెల్ల జుట్టు సమస్య రాకుండా ఉండేందుకు ఈ జ్యూస్‌లు తాగాలి-white hair preventing juice make it easy and drink it daily ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Preventing White Hair Juice : తెల్ల జుట్టు సమస్య రాకుండా ఉండేందుకు ఈ జ్యూస్‌లు తాగాలి

Preventing White Hair Juice : తెల్ల జుట్టు సమస్య రాకుండా ఉండేందుకు ఈ జ్యూస్‌లు తాగాలి

Anand Sai HT Telugu
Mar 26, 2024 12:30 PM IST

Preventing White Hair Juice : ప్రస్తుతం చాలా మంది ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య తెల్ల జుట్టు. దీని నుంచి బయటపడేందుకు మార్కెట్లో దొరికే ఉత్పత్తులను ఉపయోగిస్తారు. కానీ కొన్ని రకాల జ్యూస్‌లు తాగితే మీ జుట్టు సమస్యల నుంచి బయటపడొచ్చు.

తెల్లజుట్టు పోయేందుకు చిట్కాలు
తెల్లజుట్టు పోయేందుకు చిట్కాలు (Unsplash)

ప్రస్తుతం అనేక మంది ఎదుర్కొంటున్న సమస్యలలో అకాల జుట్టు నెరసిపోవడం కూడా ఒక ప్రధాన సమస్య. హార్మోన్ల మార్పులు, జీవనశైలి వంటి వివిధ కారణాలతో ఇది ప్రభావితమవుతుంది. ఈ విధంగా జుట్టు అకాలంగా తెల్లబడటాన్ని నివారించడానికి ఎటువంటి చికిత్స లేనప్పటికీ, కొంతకాలం పాటు దీనిని వాయిదా వేయవచ్చు. కొన్ని రకాల రసాలు తాగాలి.

పాలకూర రసం

ఐరన్, విటమిన్ ఎ, సి సమృద్ధిగా ఉండే పాలకూర ఆరోగ్యకరమైన జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. జుట్టు నెరసిపోకుండా చేస్తుంది. ఐరన్ లోపం లేకుండా ఉంటే మీ జుట్టు అందంగా ఉంటుంది. కాబట్టి పాలకూరలోని ఐరన్ కంటెంట్ జుట్టు నెరసిపోకుండా చేస్తుంది.

క్యారెట్

క్యారెట్‌లో బీటా కెరోటిన్ పుష్కలంగా ఉంటుంది. ఇది శరీరంలో విటమిన్ ఎగా మారుతుంది. చర్మంలో నూనె ఉత్పత్తికి విటమిన్ ఎ ముఖ్యమైనది. స్కాల్ప్ ఆరోగ్యాన్ని కాపాడుతుంది. పొడిబారకుండా చేస్తుంది. ఇది అకాల పిగ్మెంటేషన్‌ను నిరోధించడంలో సహాయపడుతుంది.

ఉసిరి

ఉసిరి జ్యూస్ విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్ల యొక్క అద్భుతమైన మూలం. జుట్టు ఆరోగ్యాన్ని పెంపొందించడం, జుట్టు తెల్లబడటాన్ని నివారించడానికి సాయపడుతుంది. ఇది ఆయుర్వేద వైద్యంలో ప్రధానమైనది. ఇందులోని యాసిడ్ జుట్టు నెరసిపోవడాన్ని నివారిస్తుంది. హెయిర్ రూట్ గట్టిగా మారేలా చేస్తుంది.

అల్లం

అల్లంలో స్కాల్ప్ ఆరోగ్యానికి మేలు చేసే యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఉన్నాయి. స్కాల్ప్ ఆరోగ్యాన్ని పెంపొందించడం వల్ల హెల్తీ హెయిర్‌కి దోహదపడుతుంది. గ్రేయింగ్ ప్రక్రియను నెమ్మదిస్తుంది. దీని జ్యూస్ చేసుకుని తాగితే ఇంకా చాలా ప్రయోజనాలు పొందవచ్చు.

బీట్‌రూట్

బీట్‌రూట్‌లో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి. ముఖ్యంగా విటమిన్ సి, కొల్లాజెన్ ఉత్పత్తికి సహాయపడుతుంది. కొల్లాజెన్ జుట్టు దృఢత్వానికి, నల్లబడటానికి అవసరం. బూడిద రంగును నివారిస్తుంది. బీట్ రూట్ జ్యూస్ మంచి ఫలితాలను ఇస్తుంది.

నిమ్మకాయ

నిమ్మకాయలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది, నిమ్మకాయ కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచుతుంది. ఐరన్ శోషణను మెరుగుపరుస్తుంది. నిమ్మకాయ నీరు తాగితే మీ మెుత్తం శరీరానికి మంచిది.

పుదీనా

పుదీనా రసంలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. పుదీనాతో తయారు చేసిన సబ్బులు, షాంపూలను మనం మార్కెట్‌లో చూడవచ్చు. ఇది జుట్టు నెరసిపోవడం, చిట్లడం, చుండ్రును పోగొట్టడంలో కూడా సహాయపడుతుంది. పుదీనా టీ చేసుకుని మీరు తాగవచ్చు.

కొబ్బరి నూనె

జుట్టు మీద కొబ్బరి నూనెను రెగ్యులర్ గా అప్లై చేయడం వల్ల గ్రే హెయిర్ నివారించవచ్చు. దీనితో పాటు కొబ్బరి నూనెలో కొల్లాజెన్‌ను నిర్మించే సామర్థ్యం ఉంది. ఇది జుట్టు నల్లగా కనిపించేలా చేస్తుంది. కొబ్బరి నూనె మీ జుట్టును అందంగా మారేలా చేస్తుంది.

జుట్టు తెల్లగా మారడానికి అనేక కారణాలు ఉన్నాయి. మార్కెట్‌లో లభించే వివిధ రకాల జెల్‌లను జుట్టుకు అప్లై చేయడం. హెయిర్ కలరింగ్ జుట్టుకు రసాయనాలను జోడిస్తుంది. జుట్టు తెల్లపడే అవకాశాన్ని పెంచుతుంది. జుట్టుకు సరిగ్గా నూనె రాసుకోకుంటే కూడా సమస్యలు వస్తాయి. జుట్టు కోసం వివిధ రకాల షాంపూలను ఉపయోగించడం మానేయాలి. సాధారణ జుట్టు సంరక్షణ లేకపోవడం కూడా తెల్లజుట్టుకు ప్రధాన కారణం.

Whats_app_banner