Ice cream Headache । మీకు ఐస్ క్రీం తలనొప్పి అంటే తెలుసా? దీనికి కారణాలు, నివారణలు చూడండి!
Ice cream Headache: ఐస్ క్రీమ్ తలనొప్పి అంటే ఏమిటి? ఐస్ క్రీమ్ తలనొప్పిని తగ్గించడానికి డాక్టర్లు సూచించిన కొన్ని నివారణ చర్యలను ఇక్కడ తెలుసుకోండి.
Ice cream Headache: మండుటెండలో తిరిగి వచ్చాక ఒక కప్పు చల్లటి ఐస్ క్రీమ్ తింటుంటే ఎంత సమ్మగా ఉంటుందో ఆ అనుభూతిని మాటల్లో వర్ణించలేం. ఒక స్కూప్ ఐస్ క్రీం ఎల్లప్పుడూ మ్యాజిక్ ట్రిక్ చేస్తుంది, మీ హృదయాన్ని ఆనందంతో నింపుతుంది. అయినప్పటికీ, చాలా మందికి చల్లని పదార్థాలు తలనొప్పిని కలిగిస్తాయి అంటే నమ్ముతారా? ఐస్ క్రీంను ఒక్కసారిగా అకస్మాత్తుగా తినడం వలన నరాలు జివ్వుమంటాయి, ఇది వెంటనే తలకు పాకి తలనొప్పిని కలిగిస్తుంది. ఈ రకమైన తలనొప్పిని బ్రెయిన్ ఫ్రీజ్ అని పిలుస్తారు.
ఐస్ క్రీం తినడం ద్వారా కలిగే తలనొప్పి తాత్కాలికం, కొన్ని సెకన్లలో దానంతటదే అదృశ్యమవుతుంది. సాధారణంగా 20 సెకన్ల నుంచి 2 నిమిషాల్లో ఈ తలనొప్పి పోయి మళ్లీ మామూలు స్థితికి వస్తారు. అయినప్పటికీ ఈరకమైన తలనొప్పి కొందరికి ఒక గంట లేదా అంతకంటే ఎక్కువసేపు కొనసాగుతుంది అని మణిపాల్ హాస్పిటల్ లోని న్యూరాలజీ కన్సల్టెంట్ డాక్టర్ నిట్టి కపూర్ కౌశల్ చెప్పారు.చల్లని ఐస్‌క్రీం తిన్నప్పుడు కొద్దిసేపు మెదడు స్తంభించిపోయేలా అవడానికి గల కారణాలను ఆయన వివరించారు.
డా. నిట్టి కౌశల్ మాట్లాడుతూ.. "అకస్మాత్తుగా ఎక్కువ మొత్తంలో చల్లటి ఐస్ క్రీంను నోట్లో వేసుకున్నప్పుడు నోటి పైకప్పులోని రక్తనాళాలు కుంచించుకుపోయి తిమ్మిరిగా అనిపిస్తుంది. ఇది తల బ్లాక్ అయిన అనుభూతితో పాటు పదునైన నొప్పిగా అనిపించవచ్చు. ఈ రకమైన తలనొప్పి ప్రమాదకరం కానప్పటికీ, చాలా సమయం పాటు కొనసాగుతూ, తరచూ అలాంటి అసౌకర్యం కలిగితే వైద్యులను సంప్రదించాలి" అని అన్నారు.
ఐస్ క్రీం తలనొప్పిని ఎలా నివారించాలి
ఐస్ క్రీం తలనొప్పిని ఎదుర్కోవడానికి లేదా దాని తీవ్రతను తగ్గించడానికి డాక్టర్ ఉస్మాన్ కొన్ని నివారణ చర్యలను సూచించారు, అవేమిటో ఈ కింద చూడండి.
శీతల పదార్థాలను నెమ్మదిగా తినండి: చాలా త్వరగా చల్లని ఆహారాలు లేదా పానీయాలు తీసుకోకూడదు. చిన్నగా తీసుకోవడం లేదా చిన్న సిప్స్ తాగడం చేయాలి. ఐస్ క్రీంను నేరుగా మింగేయకుండా మీ నోటిలో కొద్దిగా చప్పరిస్తూ వేడెక్కేలా చేయాలి..
వెచ్చని ఉద్దీపన: మీకు ఐస్ క్రీం తలనొప్పి వస్తున్నట్లు అనిపిస్తే, మీ నాలుకతో మీ నోటి పైకప్పును తాకండి. లేదా మీ నాలుకను నోట్లో తిప్పుతూ వెచ్చదనం కలిగించండి. తద్వార రక్తనాళాలు సంకోచం చెందకుండా నిరోధించడంలో సహాయపడుతుంది, నొప్పిని తగ్గిస్తుంది.
వెచ్చదనాన్ని వర్తింపజేయండి: వెచ్చని కంప్రెస్‌ను వర్తింపజేయడం లేదా వెచ్చని పానీయం తాగడం వల్ల ప్రభావిత ప్రాంతం క్రమంగా వేడెక్కడం, రక్త నాళాల వ్యాకోచం జరిగి ఉపశమనం పొందవచ్చు.
స్ట్రా ఉపయోగించండి: శీతల పానీయాలు తాగేటప్పుడు, స్ట్రాని ఉపయోగించడం బ్రెయిన్ ఫ్రీజింగ్ ను నిరోధించవచ్చు.
రిలాక్సేషన్ టెక్నిక్స్: లోతైన శ్వాస, ధ్యానం లేదా మైండ్‌ఫుల్‌నెస్ వ్యాయామాలు వంటి సడలింపు పద్ధతులను ఉపయోగించడం ద్వారా ఐస్ క్రీం తలనొప్పికి సంబంధించిన అసౌకర్యాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది.
కారణాలను గుర్తించండి: మీకు ఐస్ క్రీం తలనొప్పి ఎటువంటి సందర్భాల్లో వస్తుందో గమనించండి. అలా జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోండి.
సంబంధిత కథనం