Charcoal Ice-cream | నల్లనల్లగా.. చల్లచల్లగా.. చార్‌కోల్ ఐస్ క్రీమ్‌!-know all about charcoal ice cream and find its recipe here ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Charcoal Ice-cream | నల్లనల్లగా.. చల్లచల్లగా.. చార్‌కోల్ ఐస్ క్రీమ్‌!

Charcoal Ice-cream | నల్లనల్లగా.. చల్లచల్లగా.. చార్‌కోల్ ఐస్ క్రీమ్‌!

HT Telugu Desk HT Telugu
Jun 01, 2022 07:49 PM IST

Charcoal Ice-cream Recipe - ఐస్ క్రీమ్ ఫ్లేవర్లన్నింటిలో చార్‌కోల్ ఐస్ క్రీమ్ డిఫరెంట్ ఫ్లేవర్, డిఫరెంట్ కలర్. మీరు ఎప్పుడైనా తిన్నారా? ఒకవేళ తినాలనిపిస్తే, మీరు ఇప్పటికిప్పుడు ఈ చార్‌కోల్ ఐస్ క్రీమ్ చేసుకునేలా రెసిపీ అందించాం. ఇక అంతా మీ ఇష్టం.

<p>Charcoal Ice cream</p>
Charcoal Ice cream (Unsplash)

వేసవి ఇంకా ముగిసిపోలేదు, ఐస్ క్రీమ్‌ల సీజన్ ఇంకా అయిపోలేదు. ఈ ఎండాకాలంలో మీలో చాలా మంది ఎర్రని ఎండలకు మాడి, చల్లని ఐస్ క్రీమ్‌లతో చల్లబడి ఉండవచ్చు. అయితే మీరు ఎన్నో రకాల ఐస్ క్రీమ్ ఫ్లేవర్స్ రుచి చూసినప్పటికీ నల్లనల్లని చార్‌కోల్ ఐస్ క్రీమ్ రుచి చూశారా? చార్‌కోల్‌ను శరీరాన్ని డీటాక్స్ చేసే సమ్మేళనంగా చెప్తారు. మరి అలాంటి సమ్మేళనాలు కలిగిన ఐస్ క్రీమ్ తింటే ఎలా ఉంటుందో కదా. అయితే చార్‌కోల్ ఐస్ క్రీమ్ అంటే ఏదో ఒక బొగ్గును దంచి దానితో ఐస్ క్రీమ్ చేస్తారేమో అని భయపడకండి. ఈ చార్‌కోల్ ఐస్ క్రీమ్‌లో యాక్టివేటెడ్ చార్‌కోల్ ఉపయోగిస్తారు. సాధారణంగా కొబ్బరిని ఎక్కువ ఉష్ణోగ్రతల వద్ద మండించి, దీని నుంచి కార్బన్ వేడి చేసి, ఆ పొడి ద్వారా యాక్టివేటెడ్ చార్‌కోల్ తయారు చేస్తారు.

మరి విభిన్నమైన రుచి ఉండే చార్‌కోల్ ఐస్ క్రీమ్‌ను మీకు మీరుగా ఇంట్లో కూడా తయారుచేసుకోవచ్చు. అది ఎలాగో ఇక్కడ రెసిపీ ఇచ్చాం. తినాలనిపిస్తే మీరు ఒక ట్రయల్ వేసి చూడండి.

చార్‌కోల్ ఐస్ క్రీమ్ కోసం కావాల్సిన పదార్థాలు

  • 2 కప్పుల హెవీ క్రీమ్ (480 mL)
  • 2 కప్పులు హాఫ్ & హాఫ్ మిక్స్ (480 mL)
  • ½ కప్పు చక్కెర (100 గ్రా)
  • 2 టేబుల్ స్పూన్లు పుదీనా ఎసెన్స్
  • 4 టేబుల్ స్పూన్లు బ్లాక్ ఫుడ్ కలరింగ్
  • ¼ కప్ యాక్టివేటెడ్ చార్ కోల్ (10 గ్రా)
  • పొడి మంచు (ఇది ద్రవరూపంలోకి మారదు)

తయారీ విధానం

  1. ముందుగా ఒక ఫ్రీజర్ బ్యాగులో పొడి మంచు ముక్క ఉంచండి. బ్యాగ్‌ని మూసివేయండి, అయితే బ్యాగ్‌లో గ్యాస్‌ నిండకుండా ఒక అంగుళం మేర తెరిచి ఉంచండి. అనంతరం బ్యాగ్‌ను కిచెన్ టవల్‌తో కప్పి ఉంచండి.
  2. ఒక పెద్ద గిన్నెలో హెవీ క్రీమ్, హాఫ్ & హాఫ్ మిక్స్, చక్కెర, యాక్టివేట్ చార్‌కోల్, 2 టేబుల్ స్పూన్ల పుదీనా ఎసెన్స్ అలాగే 4 టేబుల్ స్పూన్ల బ్లాక్ ఫుడ్ కలరింగ్ వేసి అన్నింటిని నురుగు వచ్చేవరకు కలపండి.
  3. నెమ్మదిగా ఈ మిశ్రమంలో ఒక చెంచా డ్రై ఐస్ వేసి కలపాలి. మిశ్రమం ఘనంగా మారేంత వరకు డ్రై ఐస్ వేసుకుంటూ కలపాలి.
  4. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని అలాగే కొద్దిసేపు ఉంచితే అందులోని డ్రై ఐస్ ఆవిరైపోతుంది, క్రీమ్ మిగిలుతుంది. ఇదే చార్‌కోల్ ఐస్ క్రీమ్.

ఈ చార్‌కోల్ ఐస్ క్రీమ్‌ను తయారు చేసిన 24 గంటల్లోపు తినేయాలి.

గమనిక: కొన్నిరకాల ఔషధాలు వాడితే చార్‌కోల్ ప్రతికూల చర్యలను జరుపుతుంది. కాబట్టి మెడికేషన్ తీసుకునేవారు వైద్యులను సంప్రదించిన తర్వాతే ఐస్ క్రీమ్ తినాలని సిఫారసు చేస్తున్నారు.

Whats_app_banner

సంబంధిత కథనం