Weight loss tips : రోజు.. ఐస్​క్రీమ్​ తింటు కూడా బరువు తగ్గొచ్చు! ఎలా అంటే..-weight loss tips in telugu know this important thing before planning you diet ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  Lifestyle  /  Weight Loss Tips In Telugu Know This Important Thing Before Planning You Diet

Weight loss tips : రోజు.. ఐస్​క్రీమ్​ తింటు కూడా బరువు తగ్గొచ్చు! ఎలా అంటే..

Sharath Chitturi HT Telugu
May 21, 2023 10:55 AM IST

Weight loss tips in Telugu : మీరు బరువు తగ్గాలని భావిస్తున్నారా? ఐస్​క్రీమ్​ తింటూ కూడా బరువు తగ్గొచ్చని మీకు తెలుసా? నిజమే. అది ఎలా అంటే..!

రోజు.. ఐస్​క్రీమ్​ తింటు కూడా బరువు తగ్గొచ్చు! ఎలా అంటే..
రోజు.. ఐస్​క్రీమ్​ తింటు కూడా బరువు తగ్గొచ్చు! ఎలా అంటే.. (Unsplash)

Weight loss tips in Telugu : వెయిట్​ లాస్​.. ఇది చాలా మంది కల! బరువు తగ్గాలని చాలా కలలు కంటుంటారు. వ్యాయామాలు అని, డైట్​ అని చాలా చేస్తూ ఉంటారు. అయితే.. వెయిట్​ లాస్​కు ఒక సింపుల్​ లాజిక్​/ ట్రిక్​ ఉంది. ఇది పాటిస్తే సులభంగా బరువు తగ్గొచ్చు. ఇంకా చెప్పాలంటే.. రోజు ఐస్​క్రీమ్​ తిని కూడా బరువు తగ్గొచ్చు. అదేంటంటే..

కేలరీలు కౌంట్​ చేయాల్సిందే..!

బరువు తగ్గడంలో వ్యాయామాల కన్నా 'డైట్​' అనేదే ఎక్కువ పాత్ర పోషిస్తుంది. ఇది అందరికి తెలిసిందే. కానీ చాలా మంది ఫుడ్​ను కంట్రోల్​ చేసుకోలేకపోతుంటారు. తిన్నది తిని.. వ్యాయామాలు చేస్తే సరిపోతుందని అని అనుకుంటారు. చివరికి.. ' నేను ఎంత చేసినా బరువు తగ్గను,' అని అంటుంటారు.

Weight loss diet plan : అయితే.. వెయిట్​ లాస్​లో కేలరీలు కౌంట్​ చేయడం చాలా ముఖ్యం. కేలరీలు అనేవి మనిషికి అత్యావశ్యం. ప్రోటీన్​, ఫ్యాట్​, కార్బోహైడ్రేట్స్​ నుంచి వచ్చే కేలరీలతో శరీరం పనిచేస్తుంది. శరీరంలో ఎనర్జీ జనరేట్​ అవ్వాలంటే ఈ కేలరీలే కీలకం. అయితే.. శరీరానికి ఎన్ని కేలరీలు కావాలో అన్నే తీసుకుంటుంది. మిగిలినవి కొవ్వుగా ఉండిపోతాయి.

కేలరీ కౌంటింగ్​కి ముందు.. అసలు ఎన్ని కేలరీలు కావాలి? అన్నది తెలుసుకోవాలి. సాధారణంగా ఒక పురుషుడికి రోజులో 2,500 వరకు కేలరీలు కావాల్సి ఉంటుంది. అదే మహిళకు అయితే రోజుకు 2000 కేలరీలు అవసరం పడుతుంది.

ఇదీ చూడండి:- Cucumber For Weight Loss : ఈ రెండింటితో వెళ్లాడే పొట్ట అయినా.. తగ్గాల్సిందే

Weight loss tips for men : ఇక్కడే ఒక సింపుల్​ లాజిక్​ దాగి ఉంది. బరువు తగ్గే యోచనలో లేని పురుషుడు 2,500 కేలరీల వరకు తీసుకోవచ్చు. అదే.. బరువు తగ్గాలంటే 2,500 కన్నా తక్కువ కేలరీలు తీసుకోవాలి. దీన్నే కేలరీ డెఫిసిట్​ అంటారు. సాధారణంగా బరువు తగ్గాలంటే.. ఒక పురుషుడు 2000 కేలరీలు, మహిళ అయితే 1,500 కేలరీలు తీసుకోవాలని నిపుణులు చెబుతుంటారు. కొద్ది కొద్దిగా తగ్గించుకుంటూ వెళితే.. తక్కువ కాలంలో మంచి ఫలితాల్ని చూడవచ్చు. ఈ కేలరీలను ఫైబర్​, మినరల్స్​, విటమిన్స్​తో రిప్లేస్​ చేస్తే.. ఆరోగ్యం కూడా మెరుగ్గా ఉంటుంది.

ఐస్​క్రీమ్​ కూడా తినొచ్చు..!

రోజు ఐస్​క్రీమ్​ తింటూ కూడా బరువు తగ్గొచ్చు! ఒక ఉదాహరణ తీసుకుందాము. 100 గ్రాముల వెనీలా ఐస్​క్రీమ్​లో దాదాపు 210 కేలరీలు ఉంటాయి. అంటే మీ డైలీ కేలరీ డోస్​లో 210 కేలరీలు వచ్చేశాయి. ఇప్పుడు.. బరువు తగ్గాలంటే.. పైన చెప్పిన కేలరీ డెఫిసిట్​ను చూసుకుని, మిగిలిన డైట్​ను పాటించాలి.

Weight loss tips for women : బరువు తగ్గాలని చాలా మంది ఉత్సాహంతో తొలినాళ్లల్లో అన్ని మితిమీరి చేసేస్తూ ఉంటారు. కేలరీ డెఫిసిట్​ మాట వినగానే.. తక్కువ తిని, తక్కువ రోజుల్లోనే బరువు తగ్గాలని భావిస్తుంటారు. ఇలా వెంటనే తక్కువగా తినడం మొదలుపెడితే.. కొన్ని రోజులకు శరీరం పని చేసేందుకు కావాల్సిన శక్తి ఉండదు. అనారోగ్యం వచ్చే అవకాశం ఉంది. అందుకే ఏదైనా చేసే ముందు.. కన్సిస్టెన్సీ ముఖ్యం!

WhatsApp channel

సంబంధిత కథనం