Phool makhana : వెయిట్ లాస్ విత్ 'ఫూల్ మఖానా'- నోరూరించే ఈ సింపుల్ రెసిపీని ట్రై చేయండి..
Phool makhana : ఫూల్ మఖానాతో వెయిట్ లాస్‌తో పాటు అనేక ప్రయోజనాలు ఉన్నాయి. వాటితో పాటు టేస్టీగా ఉండే ఫూల్ మఖానా స్నాక్ రెసిపీని ఇక్కడ తెలుసుకుందాము..
Phool makhana recipe : బరువు తగ్గాలంటే.. వ్యాయామాల కన్నా ముఖ్యమైన విషయం ఒకటి ఉంది. అదే 'డైట్'. ఆహారపు అలవాట్లను మార్చుకుంటేనే వేగంగా బరువు తగ్గుతాం. అందుకే.. చాలా మంది డైట్‌పై ఫోకస్ చేస్తారు. అలా అని రుచి లేని ఫుడ్ తినాలంటే చాలా మందికి బాధ! వీరిలో మీరూ ఒకరా? మీరు కూడా వెయిట్ లాస్ కోసం ప్లాన్ చేస్తున్నారా? అయితే మీరు 'ఫూల్ మఖానా' గురించి తెలుసుకోవాల్సిందే. ఫూల్ మఖానాతో కలిగే ప్రయోజనాలతో పాటు ఓ సింపుల్ రెసిపీతో టేస్టీ స్నాక్‌ను ఎలా చేసుకోవాలో ఇక్కడ చూద్దాము..
ఫూల్ మఖానాతో లాభాలెన్నో..
- కిడ్నీ ఆరోగ్యంగా ఉంటుంది
- గుండె ఆరోగ్యంగా ఉంటుంది
- లివర్ డీటాక్సిఫై అవుతుంది
- Phool makhana benefits : డయాబెటిక్ రోగులకు చాలా మంచిది
- ఎముకల దృఢత్వం మెరుగుపడుతుంది
- వెయిట్ లాస్‌కు ఉపయోగపడుతుంది
- హార్మోనల్ బ్యాలెన్స్ జరగుతుంది
- జీర్ణ వ్యవస్థ సరిగ్గా ఉంటుంది.
ఇదీ చూడండి :- High protein low carb diet : వేగంగా బరువు తగ్గాలా? ఇవి ట్రై చేయండి..!
ఫూల్ మఖానా స్నాక్ రెసిపీ..
ఇప్పుడు మనం ఫూల్ మఖానాతో 5 నిమిషాల్లో రెడీ అయ్యే సింపుల్ అండ్ టేస్టీ స్నాక్ గురించి తెలుసుకుందాము..
కావాల్సిన పదార్థాలు..
- ఫూల్ మఖానా
- కారం
- Phool makhana recipe : ఉప్పు
- నూనె
- ఆంచూర్ పౌడర్, జీరా పౌడర్ (ఆప్షనల్)
ఇలా చేసుకోండి..
ముందుగా.. బాండీలో 1 స్పూన్ నూనె వేసుకోండి. కొద్దిగా వేడి ఎక్కిన తర్వాత ఫూల్ మఖానా అందులో వేసుకోండి. కొంచెం కొంచెం ఫ్రై చేసుకోండి. ఫూల్ మఖానా తెల్ల రంగులో నుంచి కాస్త ఎరుపు రంగులోకి మారాలి. ఆ తర్వాత దానిని వేరే బౌల్లోకి మార్చుకోండి. ఫూల్ మఖానా మరీ ఎక్కువగా వేగకూడదన్న విషయం గుర్తుపెట్టుకోండి.
Phool makhana recipe in Telugu : ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేయండి. బాండీలో ఇంకాస్త నూనె (ఎంత వీలైతే అంత తక్కువ) పోసి.. ఉప్పు, కారం వేసుకోండి. ఆంచూర్ పౌడర్, జీరా పౌడర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. స్పూన్‌తో కలపండి. బాగా మిక్స్ అయిన తర్వాత.. ఫుల్ మఖానాను ఆ బాండీలో వేయండి. కారం, ఉప్పు అంతా ఫూల్ మఖానాకు పట్టేంత వరకు కలపండి. కొద్దిసేపటి తర్వాత బౌల్లో వేసుకుని ఆరగించేయండి. స్టవ్ ఆపకుండా ఇవన్నీ చేస్తే.. కారం, ఉప్పు మిశ్రమం మాడిపోతుంది. టేస్ట్ పూర్తిగా మారిపోతుంది. ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి.
ఈ స్నాక్‌ను కొంచెం తిన్నా కూడా కడుపు నిండుగా అనిపిస్తుంది. మరి ఇంకెందుకు ఆలస్యం.. వెయిట్ లాస్లో ఉన్నప్పుడు నోరూరించే ఈ ఫుల్ మఖానాను చేసుకుని ఆరగించేయండి..
సంబంధిత కథనం