Kohli diet Plan: కోహ్లీ డైట్ ప్లాన్ చూస్తే షాక్ అవ్వాల్సిందే.. నో మసాలా, నో ఆయిల్ లేకుండా ఏముంటే అది తింటాడు-virat kohli reveals his diet plan eat onle steamed or boiled food with no spices ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Kohli Diet Plan: కోహ్లీ డైట్ ప్లాన్ చూస్తే షాక్ అవ్వాల్సిందే.. నో మసాలా, నో ఆయిల్ లేకుండా ఏముంటే అది తింటాడు

Kohli diet Plan: కోహ్లీ డైట్ ప్లాన్ చూస్తే షాక్ అవ్వాల్సిందే.. నో మసాలా, నో ఆయిల్ లేకుండా ఏముంటే అది తింటాడు

Maragani Govardhan HT Telugu
Apr 28, 2023 07:43 PM IST

Kohli diet Plan: టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ ఫిట్నెస్‌పై అత్యంత శ్రద్ధ పెడతాడనే విషయం తెలిసిందే. అంతగా అతడు ఫిట్‌గా ఉండటానికి డైట్‌ ప్లాన్ కూడా అంతే కఠినంగా ఉంటుంది. మసాలాలు లేని ఉడికించిన పదార్థాలను మాత్రమే అతడు తింటాడట.

విరాట్ కోహ్లీ
విరాట్ కోహ్లీ (PTI)

Kohli diet Plan: రన్ మెషిన్ విరాట్ కోహ్లీ ప్రపంచంలోనే అత్యంత ఫిట్‌గా ఉండే ఆటగాళ్లలో ఒకడు. అతడి ఫిట్‌నెస్‌క, అథ్లెటిక్ నైపుణ్యానికి ఎంతో మంది అభిమానులున్నారు. భారత క్రికెట్‌లో ఫిట్‌నెస్ రివల్యూషన్ తీసుకొచ్చింది కోహ్లీనే అంటే అతిశయోక్తి కాదు. మైదానంలో ఎలాంటి శ్రమ లేకుండా పరుగులు తీస్తుంటే ఆశ్చర్యపోవాల్సిందే. ఇటీవలే ఈ స్టార్ క్రికెటర్ తన ఫిట్నెస్ సీక్రెట్‌తో పాటు అత్యుత్తమ ప్రదర్శన చేయడానికి సహాయపడే డైట్ ప్లాన్ గురించి వెల్లడించాడు.

విరాట్ కోహ్లీ తన రోజూ వారీ ఆహారంలో ఎక్కువగా ఉడికించిన ఆహారాన్ని ఎక్కువగా తీసుకుంటాడట. అందులోనూ మసాలాలు లేను ఫుడ్‌ను తింటానని ఇటీవల ఓ వీడియోలో చెప్పాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తను తీసుకుంటున్న ఈ ఆహారం రుచి ఏమాత్రం బాధించిదని కూడా విరాట్ చెప్పాడు.

కోహ్లీ డైట్ ప్లాన్..

"90 శాతం వరకు నా ఆహారం ఆవిరితో ఉడికించిందే ఉంటుంది. సాల్ట్, పెప్పర్, నిమ్మకాయ మాత్రమే నేను తింటాను. మసాలాల జోలికి అస్సలు పోను. ఫుడ్ టేస్ట్‌గా ఉండాలని నేను అనుకోను. అసలు రుచి గురించి పట్టించుకోను. సలాడ్లను ఎక్కువగా ఇష్టపడతాను. కొద్దిగా ఆలివ్ ఆయిల్‌తో లేదా మరేదైనా పాన్ గ్రిల్ చేసిన ఆహారాన్ని తింటాను. కూరలు తీసుకోను. పప్పులు మాత్రమే తింటాను. రాజ్మా, లోభియా తింటాను. పంజాబీ ఫుడ్‌‍ను అసలు వదలిపెట్టను. మసాల కూరల జోలికి పోను." అని విరాట్ కోహ్లీ తన డైట్ ప్లాన్ గురించి తెలిపాడు.

విరాట్ కోహ్లీ గాయ పడటం చాలా అరుదుగా మాత్రమే చూసుంటాం. గత కొన్నేళ్లుగా గాయం కారణంగా మ్యాచ్‌కు దూరమైన దాఖాలాలే లేవు. దీన్ని బట్టి చూస్తే ఫిట్నెస్‌పై అతడికున్న డేడికేషన్ అలాంటిది. ఫిట్‌నెస్‌కు అధిక శ్రద్ధ చూపే కోహ్లీ.. కెరీర్ ప్రారంభం నుంచి క్రమబద్ధమైన ఆహారాన్ని తీసుకుంటున్నాడు. కెరీర్ ప్రారంభంలో ఒకరోజు తనను తాను అద్దంలో చూసుకున్నప్పుడు తనకు తాను అస్సలు నచ్చలేదట. అప్పటి నుంచి తన ఆహారపు అలవాట్లన్నీ పూర్తిగా మార్చుకున్నాడు.

మైదానంలో మరింత చురుకుగా కదులుతూ అద్భుతాలు చేయడం ప్రారంభించాడు. అప్పటి నుంచి కోహ్లీ వెనక్కి తిరిగి చూసుకోలేదు. అతడిని చూసి ఇతర ఆటగాళ్లు సైతం అనుసరించేలా ఉన్నత ప్రమాణాలను నెలకొల్పాడు.

ప్రస్తుతం విరాట్ కోహ్లీ ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో బెంగళూరు తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఇప్పటికే ఈ టోర్నీలో 8 మ్యాచ్‌ల్లో 333 పరుగులు చేశాడు. 47.57 సగటుతో 142.30 స్ట్రైక్ రేటుతో బ్యాటింగ్ చేశాడు. ఇందులో ఐదు అర్ధశతకాలు ఉన్నాయి.

Whats_app_banner