High protein low carb diet : వేగంగా బరువు తగ్గాలా? ఇవి ట్రై చేయండి..!-4 foods to eat if you re attempting to lose weight high protein low carb diet ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  Lifestyle  /  4 Foods To Eat If You're Attempting To Lose Weight, High Protein Low Carb Diet

High protein low carb diet : వేగంగా బరువు తగ్గాలా? ఇవి ట్రై చేయండి..!

Chitturi Eswara Karthikeya Sharath HT Telugu
Nov 20, 2022 12:55 PM IST

High protein low carb diet : వేగంగా బరువు తగ్గాలని చూస్తున్నారా? అయితే.. ఈ హై ప్రోటీన్​, లో కార్బ్​ డైట్​ను ఓసారి చూడండి.

వేగంగా బరువు తగ్గాలా? ఇవి ట్రై చేయండి..!
వేగంగా బరువు తగ్గాలా? ఇవి ట్రై చేయండి..! (file)

High protein low carb diet : వెయిట్ ​లాస్​ కోసం రకరకాల డైట్​ల​ను పాటిస్తూ ఉంటాము. కొన్ని మంచి చేస్తే.. మరికొన్ని బెడిసి కొడతాయి. అయితే ఎన్ని ట్రై చేసినా.. లో-కార్బ్​, హై ప్రోటీన్​ డైట్​ అనేది వెయిట్​లాస్​, ఫిట్​నెస్​కు మంచిదని నిపుణులు చెబుతూ ఉంటారు. ఈ రకం డైట్​తో షుగర్​ లెవల్స్​ కూడా నియంత్రణలో ఉంటాయి. కార్బోహైడ్రేట్​ని తక్కువ తీసుకుంటే.. శరీరంలో గ్లూకోజెన్​ తక్కువ ఉత్పత్తి అవుతుంది. ఫలితంగా ఫ్యాట్​ బర్నింగ్​ అనేది వేగంగా జరుగుతుంది. రెగ్యులర్​గా ఈ డైట్​ ఫాలో అయితే.. వెయిట్​లాస్​లో మంచి ఫలితాలను చూడవచచు. హై ప్రోటీన్​ డైట్​తో ఎక్సర్​సైజ్​లు చేస్తే.. వెయిట్​లాస్​ కావడంతో పాటు లీన్​ మజిల్​ మాస్​ కూడా పెరుగుతుందని రీసెర్చ్​లు చెబుతున్నాయి.

4 రకాల లో- కార్బ్​, హై ప్రోటీన్​ ఆహారాల గురించి ఇప్పుడు తెలుసుకుందాము..

గ్రీక్​ యోగర్ట్​:- కొన్నిసార్లు ఆకలి వేయకపోయినా.. ఏదైనా తినాలనిపిస్తుంది. టెంప్ట్​ య్యి తినేస్తే.. వెయిట్​లాస్​ ప్రోగ్రాం దెబ్బతింటుంది. ఈ సమయంలో గ్రీక్​ యోగర్ట్​ చాలా ఉపయోగపడుతుంది. సాధారణ పెరుగు కన్నా ఇది ఇంకాస్త గట్టిగా ఉంటుంది. ఈ రిచ్​ ప్రోటీన్​ సోర్స్​తో క్రేవింగ్స్​ని నియంత్రించుకోవచ్చు. పొట్ట ఉబ్బడాన్ని కూడా ఇది తగ్గిస్తుంది. ఇందులో కాల్షియం, ప్రోటీన్​, ప్రోబయోటిక్స్​తో పాటు ఎన్నో అవసరమైన పోషకాలు ఉన్నాయి.

Weight loss diet : సన్​ఫ్లవర్​ సీడ్స్​:- వీటిని పొద్దుతిరుగుడు గింజలు అని అంటారు. ఆరోగ్యకరంగా బరువు తగ్గాలంటే.. ఈ సీడ్స్​ మంచి ఆప్షన్​. ఇందులో ప్రోటీన్​, ఫైబర్​తో పాటు విటమిన్​ ఈ, కాపర్​ వంటి మినరల్స్​ కూడా ఉంటాయి. సలాడ్​లు, క్రీమ్స్​, పచ్చి కూరగాయలపై టాపింగ్స్​గా కూడా వేసుకుని వీటిని తినొచ్చు. ఈ సీడ్స్​ని తరచూ తింటే.. డైమెన్షియా వచ్చే అవకాశాలు తగ్గుతాయని రీసెర్చ్​లో తేలింది. మొత్తం మీద ఆరోగ్యం కూడా పెరుగుతుంది.

సాల్మన్​:- ఇందులో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్​, గుడ్​ ఫ్యాట్స్​, ప్రోటీన్​ కంటెంట్​ ఎక్కువగా ఉంటాయి. ఇది తింటే ఆరోగ్యానికి ఆరోగ్యం.. వెయిట్​ లాస్​కి వెయిట్​ లాస్​! ఇది మీ ఆకలిని తగ్గిస్తుంది. మెటబాలిజాన్ని పెంచుతుంది. పొత్తికడుపులోని కొవ్వును తగ్గిస్తుంది. లీన్​ మజిల్​ టిష్యూ ఎదుగుదలకు.. ఇది ఎంతో ముఖ్యమైన మాక్రోన్యూట్రీషియన్​గా ఉంటుంది. మూడు ఔన్స్​ల సాల్మన్​ని తీసుకుంటే.. 108 క్యాలరీలు, 0 గ్రాముల కార్బ్స్​, 17 గ్రాముల ప్రోటీన్​ లభిస్తుంది. వెయిట్​ లాస్​కు ఫార్ములా ఇదే కదా!

Roasted chickpeas : రోస్టెడ్​ చిక్​పీస్​:- వేయించిన శెనగలను రోస్టెడ్​ చిక్​పీస్​ అంటారు. ఇందులో పోషకాలు దండిగా ఉన్నాయి. ఇదొక హై ప్రోటీన్​, ఫైబర్​ పదార్థం. వెయిట్​లాస్​లో ఉన్న వారు కచ్చితంగా ట్రై చేయాల్సిన ఆహార పదార్థం ఇది. వీటిని ఎందులోనైనా కలుపుకుని తినేయవచ్చు. అంత సింపుల్​గా ఉంటాయి.

ఏది ఏమైనా.. బరువు తగ్గాలంటే.. హై ప్రోటీన్​ డైట్​ను ఎంచుకోవడం అత్యంత కీలకమైన విషయం. భారీగా ఖండలు పెంచి వారందరు.. ప్రోటీన్​ గురించే ఎక్కువగా మాట్లాడుకుంటారు!

WhatsApp channel

సంబంధిత కథనం