Cucumber For Weight Loss : ఈ రెండింటితో వెళ్లాడే పొట్ట అయినా.. తగ్గాల్సిందే-weight loss drink cucumber and ginger for weight loss here s how to make weight loss drink ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Cucumber For Weight Loss : ఈ రెండింటితో వెళ్లాడే పొట్ట అయినా.. తగ్గాల్సిందే

Cucumber For Weight Loss : ఈ రెండింటితో వెళ్లాడే పొట్ట అయినా.. తగ్గాల్సిందే

Anand Sai HT Telugu
Apr 25, 2023 03:10 PM IST

Cucumber For Weight Loss : ఈ కాలంలో చాలా మందిని వేధిస్తున్న సమస్య అధిక బరువు. తగ్గించేందుకు చాలా కష్టపడుతుంటారు. కానీ ఫలితం కనిపించదు. ఇంట్లో నుంచే బరువు తగ్గించుకునేందుకు కొన్ని చిట్కాలు ఉన్నాయి.

బరువు తగ్గే చిట్కాలు
బరువు తగ్గే చిట్కాలు

వయసుతో సంబంధం లేకుండా.. అధిక బరువు(Overweight) సమస్య చాలా మందిని వేధిస్తోంది. మారిన జీవన విధానం, ఆహార‌పు అలవాట్ల(Food Habits)తో ఈ సమస్య వస్తుంది. అధిక బరువుతో ఇతర ఆరోగ్య సమస్యలు కూడా వస్తాయి. గుండె పోటు, బీపీ, షుగర్, కీళ్ల నొప్పులు, మోకాళ్ల నొప్పులు వంటి ఇతర అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటారు. వీలైనంత త్వరగా అధిక బరువు నుంచి బయటపడేందుకు ప్రయత్నించాలి. బరువు తగ్గేందుకు(weight loss) బయట దొరికే ఉత్పత్తులను వాడుతుంటారు. కానీ కొన్నిసార్లు ఫలితం కనిపించదు. అది మీ శరీరానికి పడకపోతే.. సైడ్ ఎఫెక్ట్స్ కూడా రావొచ్చు.

అయితే మీరు అధిక బరువుతో బాధపడుతుంటే.. కేవలం రెండు పదార్థాలను ఉపయోగించి.. సులభంగా బరువు తగ్గేయోచ్చు. వీటితో ఎలాంటి దుష్ర్పభావాలు ఉండవు. వీటని ఉపయోగిస్తే.. ఇతర ప్రయోజనాలు కూడా ఉంటాయి. అవేంటో అని ఆలోచిస్తున్నారా? కీరదోస, అల్లం. అవును ఇంట్లోనే ఉండే ఈ రెండింటితోనూ బరువు తగ్గేయోచ్చు. బరువు తగ్గేందుకు కీరదోస, అల్లం ఎంతగానో(Cucumber and Ginger) ఉపయోగపడతాయి. ఇవి ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తాయి. అల్లంలో ఎన్నో పోష‌కాలు, ఔష‌ధ గుణాలు ఉంటాయి.

అల్లం, కీరదోసతో జ్యూస్(Cucumber and Ginger Juice) తయారు చేసుకుని.. తాగితే.. మనం చాలా సులభంగా బరువు తగ్గవచ్చు. ముందుగా కీరదోసపై ఉండే చెక్కును తీసేయాలి. ముక్కలుగా చేసుకుని జార్ లోకి వేసుకోవాలి. తర్వాత ఒకటిన్నర ఇంచుల అల్లం తీసుకుని శుభ్రం చేసి ముక్కలుగా చేయాలి. ఇప్పుడు జార్ లోకి వేసుకోవాలి. తర్వాత ఇందులో అర గ్లాస్ నీళ్లు పోసి.. మెత్తగా మిక్సీ పట్టాలి.

ఆ తర్వాత దీనిని వడకట్టుకుని ఒక గ్లాసులోకి తీసుకోవాలి. రుచి కోసం నిమ్మరసం(Lemon) కూడా వేసుకోవచ్చు. ఇలా చేసుకున్న జ్యూస్ రోజూ ఉదయం పరగడుపున తాగాలి. అల్పాహారానికి అరగంట ముందు అయినా తీసుకోండి. ఇలా క్రమం తప్పకుండా తీసుకోవడం వలన చాలా సులభంగా బరువు తగ్గొచ్చు. ఈ జ్యూస్ తో మలబద్ధకం(Constipation) సమస్య తగ్గుతుంది. రోగనిరోధక శక్తి(Immuity) పెరుగుతుంది.

శరీరం డీహైడ్రేషన్(Dehydration) బారిన పడకుండా ఉంటుంది. అల్లం ఉపయోగించడం కారణంగా శరీరంలో పేరుకుపోయిన కొవ్వు సులభంగా తగ్గుతుంది. జీర్ణశక్తి మెరుగుపడుతుంది. తల తిరగడం వంటి సమస్యల నుంచి బయటపడొచ్చు. కీర‌దోస సైతం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. దీనితో ఎక్కువ సేపు ఆక‌లి కాకుండా ఉంటుంది. క్యాల‌రీలు కూడా చాలా త‌క్కువగా ఉంటాయి. గుండె ఆరోగ్యాన్ని మెరుగుప‌ర‌చ‌డంలో, జీర్ణశక్తి మెరుగుప‌ర‌చ‌డంలో సహాయపడుతుంది.

WhatsApp channel

సంబంధిత కథనం