Over Weight : 2035 నాటికి ప్రపంచంలో సగం మంది అధిక బరువుతో ఉంటారు
World Obesity Day : అధిక బరువుతో చాలా మంది ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీంతో అనేక ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి. ప్రపంచ జనాభాలో 2035నాటికి సగం మంది అధిక బరువుతో ఉంటారని నివేదికలు చెబుతున్నాయి.
వరల్డ్ ఒబేసిటీ ఫెడరేషన్ నివేదిక ప్రకారం 2035 నాటికి ప్రపంచ జనాభాలో సగానికి పైగా అధిక బరువు(Over Weight) లేదా ఊబకాయంతో ఉంటారు. రాబోయే 12 సంవత్సరాలలో సుమారు 4 బిలియన్ల మంది ప్రజలు అధిక బరువు కలిగి ఉంటారని నివేదిక పేర్కొంది.
ట్రెండింగ్ వార్తలు
ఈ తరం వారికి ఊబకాయం(obesity) ఒక తీవ్రమైన సమస్యగా మారింది. ప్రపంచ జనాభాలో 38 శాతం కంటే ఎక్కువ మంది ఇప్పుడు అధిక బరువుతో ఉన్నారు. భవిష్యత్ సంవత్సరాల్లో ఈ శాతం పెరుగుతుందని భావిస్తున్నారు. ఇది తక్కువ ఆదాయ దేశాల్లోని యువకులలో ప్రబలంగా ఉంటుంది.
గ్లోబల్ ఒబేసిటీ ఫెడరేషన్ ప్రెసిడెంట్, లూయిస్ బౌర్, ఇది స్పష్టమైన హెచ్చరిక అని తెలిపారు. సమస్య తీవ్రం కాకుండా నివారించడానికి త్వరగా చర్య తీసుకోవాలని కోరారు. పిల్లలు, కౌమారదశలో ఉన్నవారిలో ఊబకాయం వేగంగా పెరుగుతుందన్నారు. నివేదిక ప్రకారం, ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న ఊబకాయం రేట్లు ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ప్రధాన ప్రభావాన్ని చూపుతాయి.
ప్రపంచ ఆరోగ్య సంస్థ(world health organization) సిఫార్సుల ప్రకారం, బాడీ మాస్ ఇండెక్స్ (BMI)ని ఉపయోగిస్తుంది. ఇది ఒక వ్యక్తి యొక్క బరువును కిలోగ్రాములలో వారి ఎత్తుతో మీటర్ల స్క్వేర్‌లో విభజించడం ద్వారా లెక్కిస్తారు. BMI 25 కంటే ఎక్కువ ఉంటే అధిక బరువుగా పరిగణించబడుతుంది. BMI 30 కంటే ఎక్కువ ఉంటే ఊబకాయంగా పరిగణిస్తారు.
జన్యుపరమైన కారణాలతో భారతీయులలో నడుము చూట్టూ పెద్ద మెుత్తంలో కొవ్వు పెరిగి ఊబకాయం ఏర్పాడు అవకాశాలు ఉంటాయి. అంతేకాదు.. జీవనశైలి(Lifestyle)కి సంబంధించిన కొన్ని అంశాలు కూడా శరీరం బరువును పెంచుతున్నాయి. అవసరానికి మించి కేలరీలను సమకూర్చే.. ఆహారం తీసుకోవడం, శారీరక శ్రమ లేకపోవడం, ఎండోక్రైన్ డిజార్డర్స్, మనో వ్యాధులు, కొన్ని రకాల ఔషధాలు కారణంగా ఉంటాయి. ఆహారం అలవాట్లు, నిద్రలేమి, వాహనాల మీదనే ఎక్కువగా ఆధారపడటం లాంటివి కూడా శరీర బరువు పెరిగేందుకు కారణంగా ఉన్నాయి.
టాపిక్