Rice Skip For 1 Month : నెల రోజులు అన్నం తినకుంటే శరీరానికి ఏం జరుగుతుంది?-what happen to body when you skip rice for 1 month ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Rice Skip For 1 Month : నెల రోజులు అన్నం తినకుంటే శరీరానికి ఏం జరుగుతుంది?

Rice Skip For 1 Month : నెల రోజులు అన్నం తినకుంటే శరీరానికి ఏం జరుగుతుంది?

Anand Sai HT Telugu
Dec 22, 2023 04:00 PM IST

Rice Skip For 1 Month In Telugu : అన్నం లేకుండా ఉండలేం. ఎంత మంచి ఫుడ్ తీసుకున్నా.. కొందరికి అన్నం తింటేనే తృప్తి లేకుంటే నిద్ర కూడా సరిగా పట్టదు. ఒకవేళ నెలరోజులపాటు అన్నం తినకుంటే శరీరానికి ఏమవుతుందో ఎప్పుడైనా ఆలోచించారా?

రైస్
రైస్

భారతీయ ప్రజల ప్రధాన ఆహారం బియ్యం. రోజుకు కనీసం కొంచెం అన్నం తినడం చాలా మందికి సంతృప్తిని ఇస్తుంది. చాలా మందికి ఒక ముద్ద అయినా అన్నం తినకుంటే నిద్ర కూడా రాదు. ఎన్ని పోషకాలు ఉన్నా ఆహారం తిన్నా.. అన్నం కచ్చితంగా కావాలని అంటారు. కానీ అన్నం ఎక్కువగా తింటే శరీర ఆరోగ్యానికి చేటు అని కూడా చాలా మంది నిపుణులు చెబుతారు. ఎందుకంటే బియ్యంలో కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉంటాయి.

రైస్ ఫుడ్ ఎక్కువగా తినేవారిలో బ్లడ్ షుగర్ లెవెల్స్ ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. అందుకే అన్నం మితంగా తినాలని వైద్యులు సూచిస్తున్నారు. కేవలం అన్నం మాత్రమే తినడం కూడా మంచిది కాదు. అయితే కొందరు రోజులకు రోజులు అన్నం తినకుండా ఉంటారు. రైస్ ఫుడ్ రెగ్యులర్ గా తినకపోతే మన శరీరంలో ఎలాంటి మార్పులు వస్తాయో చూద్దాం..

ఒక నెల పాటు నిరంతరం అన్నం తినడం మానేస్తే, శరీరంలో కేలరీలు గణనీయంగా తగ్గుతాయి. బరువు తగ్గే అవకాశం ఉంది. మనం కార్బోహైడ్రేట్స్ తినకపోవడం వల్ల బ్లడ్ షుగర్ లెవల్స్ కూడా కంట్రోల్‌లో ఉంటాయి. కానీ ఈ బరువు తగ్గించే ప్రయత్నంలో మనం అన్నం కంటే ఇతర ధాన్యాలు లేదా అదే మొత్తంలో కేలరీలను అందించే ఇతర కార్బోహైడ్రేట్ ఆహారాలను తినడం మానుకోవాలి.

రైస్ ఫుడ్ కు దూరంగా ఉంటే రక్తంలో గ్లూకోజ్ స్థాయి కచ్చితంగా సమతుల్యంగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. కానీ మళ్లీ అన్నం తింటే రక్తంలో గ్లూకోజ్ స్థాయి పెరుగుతుందని అంటున్నారు. కొంచెం అన్నం తింటే శరీరానికి హాని ఉండదు. మనం పూర్తిగా అన్నం తినడం మానేస్తే, మనకు కార్బోహైడ్రేట్లు, విటమిన్ బి, కొన్ని ఖనిజాలు లభించకపోవచ్చు.

మధుమేహం అదుపులో ఉండాలంటే, బరువు తగ్గాలంటే నెల రోజుల పాటు అన్నం పూర్తిగా మానేయాలని నిర్బంధం లేదు. రోజూ కొద్ది మొత్తంలో తీసుకోవచ్చు. ఇది మితంగా ఉండాలి. మనం బియ్యం ఆహారాన్ని నివారించినట్లయితే, మన రోజువారీ ఆహార జాబితాలో పోషకమైన ఆహార పదార్థాలు ఉండేలా చూసుకోవాలి.

ఒకేసారి అన్నం తినకుండా ఉండడం మంచిది కాదు. అన్నం భోజనంలో ప్రొటీన్లు అధికంగా ఉండే ఆహారాలు, పచ్చి కూరగాయలను జోడించడం వల్ల అది పోషకమైన భోజనంగా తయారవుతుంది.

బియ్యంలో లభించే కార్బోహైడ్రేట్లు మన శరీరానికి శక్తినివ్వడానికి అవసరం. దాన్ని పక్కన పెడితే మనల్ని బలహీనపరుస్తుంది. దీనివల్ల కండరాలు బలహీనపడతాయి. శరీరంలో పోషకాలు, ఖనిజాల లోపం సంభవించవచ్చు. శరీరంలోని కొవ్వును తగ్గించడమే లక్ష్యం కావాలి. కండరాలను బలహీనపరచవద్దు. కాబట్టి రైస్ ఫుడ్ ను ఎప్పటికప్పుడు మితంగా తీసుకుంటూ, పూర్తిగా దూరంగా ఉండకూడదని నిపుణులు సూచిస్తున్నారు. అతిగా తినకుండా ఉండాలి. నెలరోజులపాటు రైస్ ముట్టుకోను అని శపథాలు మాత్రం చేయెుద్దు. మితంగా తీసుకోవాలి. కానీ అందులోకి పోషకాలు ఉండేలా చూసుకోవాలి.

WhatsApp channel