Sweat Hide Shirts : ఈ రంగు చొక్కాలు వేసుకుంటే చెమట కనిపించదు.. ట్రై చేయండి!
Sweat In Summer : వేసవిలో అందరూ ఎదుర్కొనే సాధారణ సమస్య చెమట. అయితే ఇది బయటకు కనిపిస్తే కాస్త చిరాకుగా ఉంటుంది. కొన్ని రకాల చొక్కాలు వేసుకుంటే చెమడ ఎక్కువగా కనిపించదు.
వేసవిలో మిమ్మల్ని ఎక్కువగా బాధించేది చెమట. చాలా మంది చెమట వాసన, దాని వల్ల కలిగే మరకల వల్ల ఇబ్బంది పడుతున్నారు. ఈ వేసవిలో కాసేపు బయటకు వెళ్లినా వెంటనే చెమటతో తడిసి ముద్దవుతున్నాం. చెమటలు పట్టడం సహజం. అయితే చాలా మందికి విపరీతంగా చెమట పడుతుంది. దీంతో వారు వేసుకున్న చొక్కా కూడా తడిసిపోతుంది.
చాలా చెమటలు పడితే అది చొక్కా వెలుపల కనిపిస్తుంది. ఇలా చెమట పట్టినా, చెమట బయటికి కనిపించకుండా చొక్కాలు వేసుకోవడానికే చాలా మంది ఇష్టపడతారు. మీకు దీని గురించి అవగాహన లేకపోతే కొన్ని రకాల షర్ట్స్ గురించి చెబుతున్నాం.. ఫాలో అవ్వండి. చెమట పట్టినా ఎక్కువగా కనిపించని చొక్కాల రంగుల గురించి తెలుసుకుందాం.
నలుపు రంగు దుస్తులు
మీ చెమట కనిపించకూడదనుకుంటే నలుపు రంగు దుస్తులు ఉత్తమ ఎంపిక. అయితే కొంతమంది ఈ రంగు వేసుకోవడానికి ఇష్టపడరు. అయితే మీ శరీరంలోని చెమటను దాచుకోవడానికి ఈ కలర్ డ్రెస్‌ని ఒకసారి ప్రయత్నించండి. అయితే వేసవిలో నలుపు రంగు దుస్తులు వేసుకుంటే వేడి ఎక్కువగా ఉంటుందని కూడా గుర్తుంచుకోవాలి
తెలుపు రంగు దుస్తులు
తెలుపు రంగు దుస్తులు కూడా బయట చెమటను ఎక్కువగా చూపించవు. ఇతర రంగుల దుస్తులపై చెమట ఎక్కువగా కనిపిస్తుంది. తెలుపు రంగు కచ్చితంగా మీ చెమటను దాచడానికి సహాయం చేస్తుంది.
ఈ కలర్ కూడా ఓకే
నీలం, నలుపు కలయిక చొక్కాలు కూడా చెమటను చూపించవు. మీరు ఈ రంగును ధరిస్తే, మీ శరీరంపై చెమట తక్కువగా కనిపిస్తుంది.
లేత గులాబీ
లేత గులాబీ రంగు దుస్తులు ఇతర రంగుల దుస్తుల కంటే తక్కువ చెమటను చూపుతాయి.
నేవీ బ్లూ రంగు దుస్తులు
నేవీ బ్లూ రంగు దుస్తులు మీ చెమటను బయటి నుండి దాచిపెడతాయి. వేడి సీజన్‌లో మీ చెమట కనిపించకుండా ఉండాలని మీరు కోరుకుంటే నేవీ బ్లూ ఉత్తమ ఎంపిక.
చెమటలు పట్టకుండా ఇలా చేయండి
అలాగే వేసవిలో చెమటలు పట్టడం, చర్మ సమస్యలు వంటి అనేక సమస్యలు తలెత్తుతాయి. చెమటలు పట్టడం వల్ల చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. వేసవిలో చెమట పట్టడం చాలా ఎక్కువ కాబట్టి.. కొన్ని చిట్కాలు పాటించాలి. మీకు చెమట పట్టకుండా ఉంటాయి.
వేసవిలో చెమటను పీల్చుకునే కాటన్ దుస్తులనే ఎంచుకోవాలి. బాగా వెంటిలేషన్ ఉన్న దుస్తులు ఎక్కువగా చెమట పట్టకుండా నిరోధిస్తాయి. కాటన్ లోదుస్తులను ఎంచుకుని ధరించడం ముఖ్యం. అలాగే బిగుతుగా ఉండే లోదుస్తులకు దూరంగా ఉండి, చర్మం గాలి పీల్చుకోవడానికి వీలు కల్పించే లోదుస్తులను ఎంచుకోండి.
మీరు తీసుకునే ఆహారాలు కూడా అధిక చెమటను కలిగించడంలో చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. చెమట పట్టే అవకాశం ఉన్నవారు స్పైసీ ఫుడ్స్, కెఫిన్ మొదలైన వాటికి దూరంగా ఉండాలి. ఆల్కహాల్ తీసుకోవడం వల్ల చెమట పట్టవచ్చు. ఎందుకంటే ఆల్కహాల్ ఎసిటిక్ యాసిడ్‌గా మారుతుంది. దీని వల్ల చెమట వాసన వస్తుంది. వేసవిలో మద్యానికి దూరంగా ఉండటం మంచిది.
మిమ్మల్ని మీరు ఎల్లప్పుడూ హైడ్రేటెడ్‌గా ఉంచుకోవడం చాలా ముఖ్యం. మీ శరీరాన్ని చల్లగా, హైడ్రేటెడ్ గా ఉంచడానికి పుష్కలంగా నీరు తాగండి. ఎందుకంటే చెమట మిమ్మల్ని డీహైడ్రేట్ చేస్తుంది. వేసవిలో ప్రతిరోజూ 9 గ్లాసుల వరకు నీరు తాగాలి.
విపరీతంగా చెమటలు పడితే మార్చుకునే బట్టలను మీ దగ్గర ఉంచుకోండి. మీరు అవసరమైనప్పుడు ఈ ప్రత్యామ్నాయ దుస్తులను ధరించవచ్చు. టిష్యూ పేపర్ లేదా వైప్స్‌తో మీ ముఖాన్ని తరచుగా శుభ్రం చేసుకోండి. ఇది చెమట నుండి మిమ్మల్ని రిఫ్రెష్ చేయడానికి ఉపయోగపడుతుంది.