Drumstick Water Benefits : మునగాకు నీరు తాగండి.. ఊహించని ప్రయోజనాలు పొందండి-weight loss to blood sugar level control and heart health amazing benefits with drumstick water ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Drumstick Water Benefits : మునగాకు నీరు తాగండి.. ఊహించని ప్రయోజనాలు పొందండి

Drumstick Water Benefits : మునగాకు నీరు తాగండి.. ఊహించని ప్రయోజనాలు పొందండి

Anand Sai HT Telugu
Feb 02, 2024 04:30 PM IST

Drumstick Water For Health : మునగాకు నీటిని రోజూ తాగితే శరీరంలో అద్భుతాలు జరుగుతాయి. మునగాకు మీకు ఎన్నో ప్రయోజనాలను అందిస్తుంది.

మునగాకు నీటితో ప్రయోజనాలు
మునగాకు నీటితో ప్రయోజనాలు (Unsplash)

మునగాకుతో ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. అంతేకాదు మునగాకు నీరు ఆరోగ్యానికి ఎంతో ఉపయోగపడుతుంది. నిజానికి మునగ చెట్టులో ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయి. మునగాకు కూడా మంచి ఆరోగ్యాన్ని అందిస్తుంది. రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడం నుండి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడం, బరువు నిర్వహణలో సహాయం చేయడం వరకు మునగాకు నీరు ఎన్నో అద్భుతాలు చేస్తుంది. మునగను పోషకాహార శక్తి కేంద్రంగా చెబుతారు.

మునగ చెట్టును శాస్త్రీయంగా moringa oleifera అని కూడా పిలుస్తారు. ఇది సాంప్రదాయ ఔషధ పద్ధతులలో శతాబ్దాలుగా వాడుతున్నారు. మునగ చెట్టు ఆకులు, కాయలు, విత్తనాలలో విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. మునగాకును నీటిలో నానబెట్టడం ద్వారా ఎన్నో ప్రయోజనాలను పొందవచ్చు.

పోషక శక్తి కేంద్రం మునగాకు

మునగాకు నీరు పోషక శక్తి కేంద్రంగా చెప్పవచ్చు. ఇది అవసరమైన విటమిన్లు, ఖనిజాలను అందిస్తుంది. ఇందులో విటమిన్ సి, విటమిన్ ఎ, పొటాషియం, కాల్షియం, ఐరన్ పుష్కలంగా ఉన్నాయి. ఈ నీటిలో క్వెర్సెటిన్, క్లోరోజెనిక్ యాసిడ్, బీటా కెరోటిన్ వంటి యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా దొరుకుతాయి. ఈ సమ్మేళనాలు ఆక్సీకరణ ఒత్తిడితో పోరాడుతాయి. శరీరంలోని ఫ్రీ రాడికల్స్‌ను తటస్థీకరిస్తాయి. మొత్తం సెల్యులార్ ఆరోగ్యానికి మద్దతు ఇస్తాయి. యాంటీఆక్సిడెంట్లు మంటను తగ్గించడంలో, దీర్ఘకాలిక వ్యాధులను నివారించడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి.

మునగాకు నీటితో చాలా ప్రయోజనాలు

మునగాకు నీటిలోని అధిక విటమిన్ సి కంటెంట్‌తో రోగనిరోధక శక్తిని పెంచుతుంది. విటమిన్ సి తెల్ల రక్త కణాల ఉత్పత్తిని పెంచుతుంది. రోగనిరోధక వ్యవస్థను బలపరుస్తుంది. శరీరం ఇన్ఫెక్షన్లతో పోరాడటానికి సహాయపడుతుంది. మునగాకు చెట్టు సాంప్రదాయకంగా జీర్ణ సమస్యల నుండి ఉపశమనం పొందేందుకు ఉపయోగిస్తారు. ఫైబర్ అధికంగా ఉండే మునగాకు నీరు మలబద్ధకాన్ని నివారిస్తుంది. సాధారణ పేగు కదలికలకు మద్దతు ఇవ్వడం ద్వారా ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థను ప్రోత్సహిస్తుంది.

మునగాకుకు రక్తంలో చక్కెర స్థాయిలపై సానుకూల ప్రభావాన్ని చూపుతాయని కొన్ని అధ్యయనాలు సూచిస్తున్నాయి. క్లోరోజెనిక్ యాసిడ్, ఐసోథియోసైనేట్స్ వంటి మునగాకుల్లో ఉండే సమ్మేళనాలు రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను నియంత్రించడంలో సహాయపడతాయి.

కొలెస్ట్రాల్ స్థాయిలు, రక్తపోటు వంటి వాటిని కంట్రోల్ చేసే గుణం మునగాకు నీటిలో ఉంది. ఇది గుండె ఆరోగ్యానికి ఉపయోగపడుతుంది. మునగాకులోని యాంటీఆక్సిడెంట్లు, బయోయాక్టివ్ సమ్మేళనాలు ఆరోగ్యకరమైన రక్త నాళాలను ప్రోత్సహించడం, లిపిడ్ ప్రొఫైల్‌లను నిర్వహించడం ద్వారా హృదయ సంబంధ వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి.

బరువు తగ్గేవారికి మునగాకు నీరు

బరువు తగ్గించుకోవాలనుకునేవారు.. మునగాకు నీటిని తాగొచ్చు. పోషకాలు, ఫైబర్ కలయిక కడుపు నిండిన అనుభూతిని కలిగిస్తుంది. ఇది మొత్తం కేలరీల తీసుకోవడం తగ్గిస్తుంది. జీవక్రియ పెంచడం లక్షణాల కారణంగా బరువు నిర్వహణలో సహాయపడుతుంది.

కొన్ని అధ్యయనాలు మునగాకులో క్యాన్సర్ నిరోధక లక్షణాలు ఉన్నాయని సూచిస్తున్నాయి. ఇందులోని క్వెర్సెటిన్, క్లోరోజెనిక్ యాసిడ్ వంటి కొన్ని సమ్మేళనాలు క్యాన్సర్ కణాల పెరుగుదలను నిరోధిస్తాయి. తద్వారా క్యాన్సర్ వ్యతిరేక ప్రభావాలను ప్రదర్శిస్తాయి.

ఎన్నో అద్భుతమైన గుణాలు ఉన్న మునగాకు నీటిని మీ దినచర్యలో చేర్చుకోవాలి. లేదా ఒక కప్పు టీని తయారు తాగండి. రెండుమూడు గంటలు మునగాకును నీటిలో నానబెట్టి ఆ నీటిని తాగాలి.

Whats_app_banner