Munagaku Pappu: ప్రోటీన్ నిండిన మునగాకు పప్పు రెసిపీ, రోగనిరోధక శక్తిని పెంచుతుంది
Munagaku Pappu: పప్పులో ప్రోటీన్స్ పుష్కలంగా ఉంటాయి. అలాగే మునగాకులో కూడా మన శరీరానికి అవసరమైన ఎన్నో పోషకాలు ఉంటాయి. ఈ రెండింటినీ కలిపి చేసే మునగాకు పప్పు రెసిపీ ఎంతో ఆరోగ్యకరం.
Munagaku Pappu: పప్పు అందరూ ఇంట్లో చేసుకుని తినేదే. కొంతమంది మెంతికూర, మరి కొంతమంది పాలకూర వేసుకొని పప్పును చేసుకుంటారు. కానీ మునగాకు కలిపి చేసుకునే వారు చాలా తక్కువ. తమిళనాడులో మునగాకు పప్పు రెసిపీ చాలా స్పెషల్. ఇది అన్నంలోకి, చపాతీ లోకి చాలా టేస్టీగా ఉంటుంది. మునగాకుల్లో ఎన్నో పోషకాలు ఉంటాయి. అలాగే పప్పులో కూడా ప్రోటీన్లు అధికంగా ఉంటాయి. కాబట్టి ఈ రెండింటిని కలిపి చేసే రెసిపీ ఆరోగ్యానికి ఎంతో ముఖ్యమైనది. మునగాకు పప్పు రెసిపీ ఎలాగో చూద్దాం
మునగాకు పప్పు రెసిపీకి కావలసిన పదార్థాలు
పెసరపప్పు - ఒక కప్పు
ఉల్లిపాయ - ఒకటి
పచ్చిమిర్చి - నాలుగు
టమాటా - ఒకటి
పసుపు - చిటికెడు
నీళ్లు - సరిపడినంత
పచ్చి సెనగపప్పు- మూడు స్పూన్లు
కాబూలీ సెనగలు - పావు కప్పు
నూనె - తగినంత
పచ్చి కొబ్బరి తురుము - పావు కప్పు
వెల్లుల్లి - ఐదు రెబ్బలు
ఎండుమిర్చి - మూడు
జీలకర్ర- ఒక స్పూను
నూనె - తగినంత
మునగాకులు - 100 గ్రాములు
కొత్తిమీర తరుగు - రెండు స్పూన్లు
ఉప్పు - రుచికి సరిపడా
మునగాకు పప్పు రెసిపీ
1. పెసరపప్పు, శనగపప్పు, కాబూలీ సెనగలు అన్నిటిని శుభ్రంగా కడిగి కుక్కర్లో వేయాలి.
2. అందులోనే తరిగిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, టమోటాలు, పసుపు వేసి ఉడికించుకోవాలి.
3. కనీసం మూడు విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకోవాలి.
4. తర్వాత స్టవ్ మీద కళాయి పెట్టి నూనె వేయాలి.
5. ఆ నూనెలో ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలు, ఎండు మిర్చి వేసి వేయించాలి.
6. ఆ తర్వాత మునగాకులను బాగా కడిగి వేయాలి.
7. అది పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి.
8. ఇప్పుడు మునగాకులో ఉడికించుకున్న పప్పును వేసి బాగా కలపాలి. రుచికి సరిపడా ఉప్పును వేసుకోవాలి.
9. పచ్చి కొబ్బరి తురుమును వేసి బాగా కలపాలి.
10. అవసరం అయితే పావు గ్లాసు నీళ్లు వేసి మూత పెట్టాలి.
11. చిన్న మంట మీద ఉడికించుకోవాలి. తర్వాత స్టవ్ కట్టేయాలి. అంతే మునగాకు పప్పు రెడీ అయినట్.టే ఇది చాలా టేస్టీగా ఉంటుంది.
పెసరపప్పు, శనగపప్పు, కాబూలీ సెనగలు, మునగాకులు ఇవన్నీ కూడా పోషకాలు నిండినవి. కాబట్టి వీటిని పిల్లలకు తినిపించడం చాలా ముఖ్.యం సాధారణ పప్పులతో పోలిస్తే ఈ మునగాకు పప్పు రుచిగా ఉంటుంది. కాబట్టి ఓసారి మునగాకు పప్పు రెసిపీని ప్రయత్నించండి.
టాపిక్