Surya Namaskar For Weight Loss : బరువు తగ్గేందుకు సూర్య నమస్కారాలు ఎన్నిసార్లు చేస్తే మంచిది?-weight loss tips how many surya namaskar can reduce fat ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Surya Namaskar For Weight Loss : బరువు తగ్గేందుకు సూర్య నమస్కారాలు ఎన్నిసార్లు చేస్తే మంచిది?

Surya Namaskar For Weight Loss : బరువు తగ్గేందుకు సూర్య నమస్కారాలు ఎన్నిసార్లు చేస్తే మంచిది?

Anand Sai HT Telugu
Apr 21, 2024 05:30 AM IST

Surya Namaskar For Weight Loss : సూర్య నమస్కారాలతో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. వీటిని చేస్తే మీ ఆరోగ్యం బాగుంటుంది. అంతేకాదు బరువు తగ్గడంలోనూ సాయపడుతుంది.

సూర్య నమస్కారాలు ఎన్నిసార్లు చేయాలి
సూర్య నమస్కారాలు ఎన్నిసార్లు చేయాలి

సూర్య నమస్కారం బరువు నియంత్రణతోపాటుగా అనేక వ్యాధులను నియంత్రించడంలో చాలా ప్రభావవంతంగా ఉంటుంది. సూర్య నమస్కారం ఇష్టానుసారం చేయకూడదు, దానికి ఒక నియమం ఉంది. దానిని తప్పనిసరిగా పాటించాలి. అప్పుడే మీరు ప్రయోజనాలను పొందగలరు. సూర్య నమస్కారంలో 12 భంగిమలు ఉన్నాయి. బరువు తగ్గడానికి సూర్య నమస్కారం ఎంత చేయాలో చూద్దాం.. ఒక వ్యక్తి సాధారణంగా ఎన్ని సూర్య నమస్కారాలు చేయవచ్చో తెలుసుకుందాం..

సూర్య నమస్కారం అనేది కనిపించేంత సులభం కాదు. ప్రారంభంలో సూర్య నమస్కారం 2 రౌండ్లు సూర్య నమస్కారం చేయడం పెద్ద విషయం. మీరు సాధన చేయడం ద్వారా సూర్య నమస్కారం రౌండ్‌ను క్రమంగా పెంచుకోవచ్చు.

ఇలా చేస్తే బరువు తగ్గవచ్చు

సూర్య నమస్కారం చేసే ముందు మీరు వేడెక్కాలి. ఆపై సూర్య నమస్కారాన్ని ప్రారంభించండి. రోజూ 12 రౌండ్లు లేదా వీలైతే 21 రౌండ్లు సూర్య నమస్కారం చేయడం వల్ల బరువును అదుపులో ఉంచుకోవచ్చు. శరీరం కూడా చాలా ఫ్లెక్సిబుల్‌గా ఉంటుంది.

అలసిపోతే చేయకూడదు

అయితే ఎలాంటి వ్యాయామం చేసినా మీ శరీరం చెప్పేది కూడా వినాలి. ఎక్కువగా శరీరాన్ని ఇబ్బంది పెట్టకూడదు. మీరు త్వరగా బరువు తగ్గాలని కోరుకుంటారు.. అలా అని ఎక్కువ వ్యాయామం చేయవద్దు. సూర్య నమస్కారం కూడా క్రమం తప్పకుండా చేయాలి. మీ శరీరం చాలా అలసిపోయినట్లు అనిపిస్తే.. శవాసనాలో విశ్రాంతి తీసుకోండి.

చాలా మంది యోగా నిపుణులు 108 సూర్య నమస్కారాలు చేస్తారు. కానీ దీన్ని చేయడానికి చాలా కష్టపడాలి. దీన్ని చేయడానికి ముందు నిపుణులను సంప్రదించండి. సూర్య నమస్కారం కండరాలను నిర్మించడంలో మీకు సహాయపడదు. కానీ సూర్య నమస్కారం శరీరంలోని నరాలను బలోపేతం చేయడంలో చాలా ఉపయోగకరంగా ఉంటుంది. సూర్య నమస్కారం మధుమేహం, రక్తపోటు నియంత్రణలో ఉంచుతుంది.

రక్తప్రసరణకు మంచిది

రోజూ సూర్య నమస్కారం చేయడం కారణంగా రక్త ప్రసరణ సక్రమంగా మెరుగుపడుతుంది. చర్మం కాంతివంతంగా తయారవుతుంది. సూర్య నమస్కారం వృద్ధాప్య ముడతలను రాకుండా చేస్తుంది. రోజువారీ సూర్య నమస్కారం జీర్ణవ్యవస్థ సజావుగా పనిచేయడానికి ఉపయోగపడుతుంది. జీర్ణవ్యవస్థలో రక్త ప్రసరణను పెంచుతుంది. ఇది పేగు పనితీరును కూడా బాగా చేస్తుంది. ముందుకు వంగడం వల్ల పొట్ట ఆరోగ్యంగా ఉంటుంది. గ్యాస్ సమస్య, మలబద్ధకం సమస్య ఉంటే క్రమం తప్పకుండా చేయండి. సమస్య నుంచి బయపడతారు.

మానసిక ఆరోగ్యం

మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవాలనుకుంటే క్రమం తప్పకుండా సూర్య నమస్కారం చేయాలి. ఇది మీ శరీరాన్ని మంచి ఆకృతిలో ఉంచడమే కాదు.. మానసిక ఆరోగ్యాన్ని కూడా బాగుచేస్తుంది. ఆందోళన నుండి ఉపశమనం పొందడంలో సహయం చేస్తుంది. ఒత్తిడి జీవనశైలిలో సూర్య నమస్కారాలు మీకు చాలా ఉపశమనం కలిగిస్తాయి.

Whats_app_banner