Morning Anxiety । విపరీతమైన ఆలోచనలు, భయాలతో నిద్రలేస్తున్నారా? దానికి కారణం ఇదే!-waking up with racing thoughts and anxiety this is called morning anxiety know all about it ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Morning Anxiety । విపరీతమైన ఆలోచనలు, భయాలతో నిద్రలేస్తున్నారా? దానికి కారణం ఇదే!

Morning Anxiety । విపరీతమైన ఆలోచనలు, భయాలతో నిద్రలేస్తున్నారా? దానికి కారణం ఇదే!

HT Telugu Desk HT Telugu
Mar 02, 2023 08:53 AM IST

Morning Anxiety: ఉదయం నిద్రలేచిన నుంచి ఒత్తిడి, ఆందోళనను కలిగి ఉంటున్నారంటే అది మార్నింగ్ యాంగ్జయిటీని సూచిస్తుంది. దీని గురించి తెలుసుకోండి.

Morning Anxiety
Morning Anxiety (Getty Images)

మీరు ఉదయం నిద్రలేస్తూనే విపరీతమైన ఆలోచనలు, ఆందోళనను ఎప్పుడైనా అనుభవించారా? అప్పుడప్పుడు ఇలా జరగటం సాధారణం. అయితే తరచుగా ఇలా జరుగుతుందంటే దీనిని 'ఉదయపు ఆందోళన' (Morning Anxiety) గా పేర్కొంటున్నారు.

జీవితంలోని ఒత్తిడిని కలిగించే కొన్ని సంఘటనలు, అనారోగ్య సమస్యలు సాధారణంగా ఆందోళన కలిగిస్తాయి. ఇవి కాకుండా రోజూవారీగా చేసుకునే చిన్నచిన్న పనుల గురించి కూడా ఆందోళన చెందటం, ఇతరుల గురించి ఎక్కువగా చింతించడం, జరగని దాని గురించి ఊహించుకోవడం మొదలైన ఆందోళనలతో సరిగ్గా నిద్రపోరు. అలారం పెట్టుకుని అది మోగక ముందే ఆందోళన చెందుతూ నిద్రలేస్తారు. ఇది మార్నింగ్ యాంగ్జైటీని సూచిస్తుంది. అమెరికన్ సూపర్ మోడల్ బెల్లా హాడిడ్ తనకు మార్నింగ్ యాంగ్జయిటీ ఉందని ఇటీవల చెప్పడంతో ఇప్పుడు దీని గురించి చర్చ జరుగుతుంది.

What is Morning Anxiety - ఉదయపు ఆందోళన ఏమిటి?

మానసిక ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం, తీవ్రమైన ఒత్తిళ్ళ కారణంగా ప్రతిరోజూ ఉదయం భయంభయంగా, ఆందోళనగా మేల్కొనడాన్ని మార్నింగ్ యాంగ్జయిటీ అంటారు. ఇది ఒక మానసిక అనారోగ్య సమస్య. దీనిని సాధారణీకరించిన ఆందోళన రుగ్మతగా (GAD- Generalized Anxiety Disorder) వర్గీకరించారు. ఎవరికైతే ప్రతీదానికి ఆందోళన చెందే మెంటల్ డిజార్డర్ ఉంటుందో, వారికి ఈ మార్నింగ్ యాంగ్జయిటీ కూడా ఉంటుంది. ఇది కనీసం ఆరు నెలల పాటు నిరంతరంగా సంభవిస్తుంది. GAD కలిగి ఉన్న వ్యక్తులు నిరంతరంగా తమ ఉద్యోగం, డబ్బు సంపాదన, కుటుంబ పోషణ, ఆరోగ్యం వంటి విషయాలపై ప్రతిరోజూ ఆందోళన చెందుతారు.

Morning Anxiety Symptoms- ఉదయపు ఆందోళన లక్షణాలు

  • ఉదయపు ఆందోళన ఉన్నప్పుడు ఉదయం వేళ ఆలోచనలు ఎక్కువగా వస్తాయి.
  • మనసు చంచలంగా ఉంటుంది, భయాందోళనలు కలుగుతాయి
  • చిరాకుగా, నీరసంగా, అలసటగా అనిపిస్తుంది
  • ఛాతీలో బిగుతుగా అనిపించడం, ఛాతీ కండరాలు బిగుసుకుపోవడం, అధిక హృదయ స్పందన రేటు, శ్వాస ఆడకపోవడం
  • ఏకాగ్రత లోపించడం, సరిగా నిర్ణయాలు తీసుకోలేకపోవడం, గందరగోళానికి గురవడం

Morning Anxiety Reasons- కారణాలు ఏమిటి?

తరచుగా ఒత్తిడికి గురకావటం, ఉద్రిక్తతలకు లోనవడం వలన దీనికి ప్రతిస్పందనగా శరీరంలోని అడ్రినల్ గ్రంధులు కార్టిసాల్ అనే హార్మోన్ స్రవిస్తాయి. కార్టిసాల్ అనేది ఒత్తిడి హార్మోన్. ఇది మార్నింగ్ యాంగ్జయిటీ కలిగి వ్యక్తుల్లో నిద్రలేచిన మొదటి గంటలో అత్యధికంగా ఉత్పత్తి జరుగుతుంది.

మీరు తీసుకునే ఆహారాలు కూడా మీలో ఒత్తిడిని పెంచుతాయి. కాఫీ,టీలు అధికంగా తీసుకోవడం, కెఫిన్, చక్కెర స్థాయిలు పెరగటం GADకి దోహదం చేస్తాయి.

నిద్రలేమి, క్రమరహిత నిద్ర విధానాలు సహా చాలా ఆరోగ్య సమస్యలతో పాటు మానసిక అనారోగ్యాన్ని దెబ్బతీస్తాయి. మీరు ప్రతిరోజూ కనీసం 6-8 గంటలపాటు నిద్రపోలేకపోతే, మీకు GAD వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది.

Morning Anxiety Remedies- ఎలా నివారించవచ్చు

- మానసిక ఆరోగ్య నిపుణుల ప్రకారం, ఉదయపు ఆందోళన నుండి బయటపడటానికి జీవనశైలి మార్పులు చేసుకోవాలి.

- క్రమబద్ధమైన నిద్ర కలిగి ఉండాలి, రోజుకి 7 గంటల రాత్రి నిద్ర కలిగి ఉండాలి.

- మద్యపానాన్ని పరిమితం చేయండి, ముఖ్యంగా అర్థరాత్రి వరకు అతిగా మద్యపానం చేయకూడదు

- కెఫిన్, చక్కెర తీసుకోవడాన్ని భారీగా తగ్గించండి. నిద్ర లేచిన తర్వాత లేదా పడుకునే ముందు కనీసం 3-4 గంటల ముందు కాఫీ తాగవద్దు.

- అతిగా శుద్ధి చేసిన ఆహారం తీసుకోవద్దు. ఆరోగ్యకరమైన, సమతుల్యమైన ఆహారం తీసుకోవాలి.

- వృత్తి జీవితానికి, వ్యక్తిగత జీవితానికి సమతుల్యత కలిగి ఉండండి.

- ఒత్తిడిని తగ్గించుకోండి. స్మార్ట్‌ఫోన్ వ్యసనం తగ్గించండి, వ్యాయామం, ధ్యానం, యోగా వంటివి ఆచరించండి.

రేపటి గురించి ఆలోచించకుండా ఈరోజు జీవితాన్ని ఆస్వాదిస్తూ. వేళకు తింటూ, హాయిగా నిద్రపోతూ, ఏ చింత లేకుండా జీవించగలిగితే ఎలాంటి అనారోగ్య సమస్యలు దరిచేరవు.

Whats_app_banner

సంబంధిత కథనం