Vankaya Masala: నోరూరించే వంకాయ మసాలా గ్రేవీ, ఇలా చిటికెలో చేసేయచ్చు, రెసిపీ తెలుసుకోండి-vankaya masala gravy recipe in telugu know how to make this curry ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Vankaya Masala: నోరూరించే వంకాయ మసాలా గ్రేవీ, ఇలా చిటికెలో చేసేయచ్చు, రెసిపీ తెలుసుకోండి

Vankaya Masala: నోరూరించే వంకాయ మసాలా గ్రేవీ, ఇలా చిటికెలో చేసేయచ్చు, రెసిపీ తెలుసుకోండి

Haritha Chappa HT Telugu
Sep 25, 2024 07:14 PM IST

Vankaya Masala: వంకాయ మసాలా కూరను స్పైసీగా, టేస్టీగా ఎలా వండాలా అని ఆలోచిస్తున్నారా? ఇక్కడ మేము సింపుల్ రెసీపీ ఇచ్చాము. ఇలా వండితే ఇగురు కూడా ఎక్కువ వస్తుంది.

వంకాయ మసాలా గ్రేవీ రెసిపీ
వంకాయ మసాలా గ్రేవీ రెసిపీ (Hebbars Kitchen)

Vankaya Masala: గుత్తి వంకాయ కూర పేరు వింటేనే ఎంతో మందికి నోరూరిపోతుంది. ఇది చాలా రుచిగా ఉంటుంది. ఇక్కడ వంకాయ మసాలా గ్రేవీ రెసిపీ ఇచ్చాము. ఇది సింపుల్ గా అరగంటలో వండేయచ్చు. దీన్ని కేవలం వైట్ రైస్ తోనే కాదు, జీర రైస్ తో తిన్నా చాలా రుచిగా ఉంటుంది. దీన్ని ఎదురుగా పెడితే ఎవరికైనా నోరూరిపోవడం ఖాయం.

వంకాయ మసాలా గ్రేవీకి కావాల్సిన పదార్థాలు

వంకాయలు - అర కిలో

పచ్చిమిర్చి - ఆరు

టమోటాలు - ఆరు

ఉప్పు - రుచికి సరిపడా

కారం - ఒక స్పూను

గరం మసాలా - అర స్పూను

ధనియాల పొడి - ఒక స్పూను

ఉల్లిపాయ - ఒకటి

అల్లం వెల్లుల్లి పేస్ట్ - ఒక స్పూను

లవంగాలు - నాలుగు

యాలకులు - మూడు

అనాస పువ్వు - ఒకటి

దాల్చిన చెక్క - చిన్న ముక్క

బిర్యానీ ఆకులు - రెండు

వంకాయ మసాలా కర్రీకి రెసిపీ

1. ముందుగా ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, టమోటాలు మిక్సీలో మెత్తగా రుబ్బుకోవాలి.

2. అందులోనే నువ్వులు, వేరు శెనగపలుకులు, ఎండు కొబ్బరి కూడా వేసి మెత్తగా పేస్టు చేయండి. ఈ మసాలా పేస్టును పక్కన పెట్టుకోండి.

3. వంకాయను నాలుగు ముక్కలుగా కట్ చేసి ఉప్పు నీటిలో వేసి ఉంచండి.

4. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి నూనె వేయండి.

5. అందులో వంకాయలను వేసి కొద్దిగా ఉప్పు వేసి వేయించండి. వంకాయలు మెత్తగా అయ్యేవరకు ఉంచండి.

6. వంకాయ మెత్తగా ఉడికాక తీసి పక్కన పెట్టండి.

7. తరవాత రెండు స్పూన్లు నూనె వేసి వేడయ్యాక ముందుగా చేసి పెటు్టుకున్న మసాలా పేస్టును వేసి వేయించాలి.

8. రుచికి సరిపడా కారం, ఉప్పు వేసి, చిటికెడు గరం-మసాలా వేసి కలుపుకోవాలి.

9. అదంతా ఇగురులాగా ఉడికాక వంకాయలను వేసి ఉడికించండి.

10. ఒక గ్లాసు నీళ్లను కూడా వేసి పావు గంటసేపు చిన్న మంటపై ఉడికించాలి.

11. ఇగురుపై నూనె తేలే వరకు ఉంచి స్టవ్ ఆఫ్ చేసేయాలి.

12. దీన్నీ జీరా రైస్, వైట్ రైస్, ప్లెయిన్ బిర్యానీతో తింటే రుచి అదిరిపోతుంది. ఒక్కసారి చేసుకుని చూడండి.

వంకాయల రెసిపీలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వంకాయల్లో ఫైబర్, పొటాషియం అధికంగా ఉంటాయి. వంకాయలో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. కాబట్టి వంకాయ తినడం వల్ల గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. అలాగే అధికరక్తపోటు ఉన్న వారు వంకాయను తినడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. కాబట్టి గుండె కోసం వంకాయలను కచ్చితంగా ఆహారంలో భాగం చేసుకోండి.

రచయిత: హోమ్ చెఫ్ సింధు