Period Pain: నెలసరి నొప్పిని టమాటాలు తగ్గించగలవా? వివరాలివే
Period Pain - Tomatoes: నెలసరి సమయంలో మహిళలు తీసుకునే ఆహారం కూడా చాలా ముఖ్యం. నొప్పి తగ్గేందుకు ఉపయోగపడేవి డైట్‍లో తీసుకోవాలి. అయితే, టమాటాలు ఈ నొప్పి తగ్గించేందుకు ఉపయోగపడతాయా అనే సందేహం చాలా మందిలో ఉంటుంది. ఆ వివరాలను ఇక్కడ చూడండి.
నెలసరి (పీరియడ్స్) సమయంలో చాలా మంది మహిళలను నొప్పి వేధిస్తుంది. పొత్తి కడుపులో విపరీతమైన నొప్పి వస్తుంది. కాళ్లు, తొడలు, వీపు సహా ఇతర భాగాలకు కూడా ఈ నొప్పి వ్యాపించే అవకాశాలు ఉంటాయి. దీంతో పీరియడ్స్ టైమ్‍లో మహిళలకు ఇది చాలా ఇబ్బందిగా ఉంటుంది. అయితే, కూరగాయాలు, పండ్లు, తృణ ధాన్యాలు లాంటి పోషకాలు ఉన్న ఆహారం తింటే హర్మోన్ల సమతుల్యత పెరిగి నొప్పి తగ్గేందుకు సహకరిస్తాయి. టమాటాలు కూడా మంటను తగ్గించగలవు. పీరియడ్స్ నొప్పి నుంచి ఉపశమనం కలిగేందుకు తోడ్పడతాయి. ఆ వివరాలివే..
వాపు, మంట తగ్గేలా..
నెలసరి సమయంలో వచ్చే వాపు, మంటను టమాటాలు తగ్గించగలవు. లోకోపెన్ అనే యాంటీఆక్సిడెంట్ టమాటాలో ఉంటుంది. శరీర కణాలను ఆక్సిడేటివ్ డ్యామేజ్ నుంచి ఇది కాపాడగలదు. వాపుకు కారణయ్యే సిటోకైన్స్ ఉత్పత్తిని కూడా టమాటా తగ్గించగలదు. దీంతో పెల్విక్ వద్ద నెలసరి నొప్పి తగ్గేందుకు సహకరిస్తుంది. టమాటాల్లోని విటమిన్-ఈ కూడా నొప్పి తగ్గేందుకు ఉపయోగపడుతుంది.
పొటాషియం వల్ల..
టమాటాల్లో పొటాషియం పుష్కలంగా ఉంటుంది. కండరాలు సంకోచించడాన్ని నియంత్రించేందుకు, కండరాల పనితీరుకు పొటాషియం ఉపయోగపడుతుంది. పీరియడ్స్ సమయంలో మహిళల గర్భాశయ కండరాలు ఎక్కువగా సంకోచిస్తాయి. అయితే, టమాటాలు అది తగ్గేందుకు తోడ్పడి నొప్పి తీవ్రతను తగ్గిస్తాయి. అలాగే, శరీరంలో ఎలక్ట్రోలైట్ సమతుల్యతకు పొటాషియం సహకరిస్తుంది. ఇది కూడా నొప్పి నుంచి ఉపశమనం తగ్గేందుకు తోడ్పడుతుంది.
విటమిన్ సీ వల్ల..
టమాటాల్లో విటమిన్ సీ ఎక్కువగా లభిస్తుంది. పీరియడ్స్ సమయంలో వాటర్ సోలబుల్ విటమిన్లు మహిళల శరీరానికి ఎక్కువగా అవసరం అవుతాయి. ఎందుకంటే శరీరం నుంచి ఐరన్ కోల్పోవడం ఎక్కువగా ఉంటుంది. అందుకే నెలసరి సమయంలో ఐరన్ ఎక్కువగా ఉండే ఫుడ్స్ తినాలి. అలాగే, ఐరన్‍ను శరీరం బాగా శోషించుకునేలా చేసేవి తీసుకోవాలి. టమాటాల్లోని విటమన్ సీ వల్ల ఇది ఐరన్ శోషణను మెరుగుపరుస్తుంది. కడుపు కూడా ఇది మేలు చేస్తుంది. టమాటాల్లోని యాంటీఆక్సిడెంట్లు వాపును కూడా తగ్గించగలవు.
పేగుల ఆరోగ్యానికి..
నెలసరి సమయంలో హార్మోనల్ మార్పులు ఎక్కువగా ఉంటాయి. పొత్తికడుపులో ఒత్తిడి తీవ్రం అవడం, మలబద్ధకం లాంటి సమస్యలను మహిళలు ఎదుర్కొంటారు. వీటివల్ల నొప్పి మరింత తీవ్రం అవుతుంది. టమాటాల్లోని ఫైబర్ పేగుల కదలికను మెరుగుపరిచి ఆ సమస్యల నుంచి ఉపశమనం దక్కేలా చేయగలదు. మైక్రోబయల్‍పై టమాటాలు సానుకూల ప్రభావం చూపిస్తాయి. హార్మోన్ల సమతుల్యతకు కూడా టమాటాలు ఉపకరిస్తాయి.
రోజులో ఎన్ని..
నెలసరి సమయంలో మహిళలు రోజులో 2 నుంచి 3 టమాటాలను తమ ఆహారంలో తినవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. ఇందులోని విటమిన్లు, యాంటీఆక్సిడెంట్లు, ఫైబర్ లాంటివి నొప్పి, మంట, వాపు తగ్గేందుకు సహకరిస్తాయి.