Tomato cooking: కూర వండేటప్పుడు కూరగాయలతో సమానంగా టమోటోలు సరిగా ఉడకడం లేదా? ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అవ్వండి
Tomato cooking: టమోటోలు సరిగా ఉడకడానికి ఇష్టపడవు. ముఖ్యంగా కొన్ని కూరగాయలతో కలిపి వండితే అవి త్వరగా ఉడకవు. కూరగాయలతో పాటు టమాటోలు మెత్తగా ఉడకాలంటే చిన్న చిట్కాలు ఉన్నాయి. వాటిని పాటించండి.
Tomato cooking: ప్రస్తుతం టమోటో ధరలు తక్కువగానే ఉన్నాయి. వీటిని వాడే వారి సంఖ్య ఎక్కువగానే ఉంది. అయితే టమోటోలతో ఒక సమస్య ఉంది. కూరల్లో టమాటోలు వాడడం వల్ల ఇగురు బాగా వస్తుంది. కానీ కొన్ని కూరగాయల్లో టమాటోను వేసినప్పుడు అది సరిగా ఉడకడానికి ఇష్టపడదు. పచ్చిగానే ఉంటుంది. దీనివల్ల కూర రుచి కూడా చెడిపోతుంది. కాబట్టి టమోటోలు కూరగాయలతో సమానంగా మెత్తగా ఉడకాలంటే చిన్న చిన్న చిట్కాలు ఉన్నాయి. వాటిని పాటించండి.
1. కూరలో టమాటాలు వేసి వండాలి అనుకుంటే ఆ టమాటోలను ప్యూరీల రూపంలో మార్చి కలపండి. లేదా చాలా సన్నగా తరిగి అప్పుడు కూరల్లో వేయండి.
2. టమోటోలను కూరల్లో వేసి కలిపిన తర్వాత కచ్చితంగా మూత పెట్టండి. మూత పెట్టకపోతే టమోటాలు ఒకంతట ఉడకవు. ఆవిరి వల్ల టమోటాలు మెత్తగా ఉడుకుతాయి.
3. టమోటోలను కూరలో వేశాక ఉప్పును వేయడం మర్చిపోవద్దు. ఇలా ఉప్పు వేయడం వల్ల టమోటోలు త్వరగా ఉడికి మెత్తగా మారుతాయి.
4. టమోటోలు కూరల్లో సరిగా ఉడకడం లేదనిపిస్తే ముందుగానే కొంచెం నీటిలో టమాటా ముక్కలను వేసి చిన్న మంట మీద మెత్తగా ఉడికించుకోండి. అవి మెత్తగా ఉడికాక ఉడుకుతున్న కూరలో వాటిని వేసి కలపండి. ఇది టేస్టీ ఇగురుగా మారిపోతుంది.
5. మీరు ఏ కూర వండాలనుకుంటున్నా.. ముందుగా టమోటోలను బాగా మెత్తగా మగ్గించాకే కూరగాయలు వేస్తే ఎలాంటి సమస్య ఉండదు. టమాటాలు ముందే మెత్తగా మారిపోతాయి. కాబట్టి కూరగాయలు కూడా సులువుగానే ఉడికిపోతాయి.
6. టమోటోలను ఫ్రిజ్లో భద్రపరిచాక బయటికి తీసిన వెంటనే వండకండి. వాటిని గది ఉష్ణోగ్రత వద్దకు వచ్చేవరకు ఉంచండి. లేదా సాధారణ నీటిలో వేసి ఉంచినా చాలు. ఆ టమోటోలు త్వరగా ఉడికిపోయే అవకాశం ఉంది.
టమోటాలు లేని కూరను ఊహించుకోవడమే కష్టం. ఇగురు కావాలంటే కచ్చితంగా టమోటాలు ఉండాల్సిందే. పైన చెప్పిన పద్ధతుల్లో టమోటాలను ఉడికిస్తే అవి మెత్తగా మృదువుగా ఉడికిపోతాయి.