Peacock Curry: నెమలి కూర వండి తినేసిన యూట్యూబర్, ఇలా నెమలిని తినడం వల్ల ఏం జరుగుతుందో తెలుసా?-the youtuber who cooked and ate peacock curry do you know what happens when you eat peacock like this ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Peacock Curry: నెమలి కూర వండి తినేసిన యూట్యూబర్, ఇలా నెమలిని తినడం వల్ల ఏం జరుగుతుందో తెలుసా?

Peacock Curry: నెమలి కూర వండి తినేసిన యూట్యూబర్, ఇలా నెమలిని తినడం వల్ల ఏం జరుగుతుందో తెలుసా?

Haritha Chappa HT Telugu
Aug 13, 2024 10:43 AM IST

Peacock Curry: సోషల్ మీడియా మాయలో పడి కొంతమంది తాము ఏం చేస్తున్నామన్న స్పృహ కోల్పోతున్నారు. ఒక యూట్యూబర్ నెమలి కూరను వండుకొని తిని ఇబ్బందుల్లో పడ్డాడు.

నెమలిని ఎందుకు తినకూడదు?
నెమలిని ఎందుకు తినకూడదు? (Pexels)

Peacock Curry: ఇప్పుడు యూట్యూబ్లో వీడియోలు చేయడం సెన్సేషన్‌గా మారింది. ముఖ్యంగా రెసిపీల వీడియోలు అధికంగా వ్యూస్‌ను సంపాదిస్తున్నాయి. ముఖ్యంగా తినే ఫుడ్ వీడియోలు మాత్రం వైరల్ అవుతున్నాయి. అలా తెలంగాణలోని సిరిసిల్లకు చెందిన ఒక యూట్యూబర్ నెమలి కూరను ఎలా వండాలో చూపించి కటకటాల పాలయ్యాడు. ఒక వీడియో చేస్తున్నప్పుడు ఆ వీడియో చేయడం ఎంత అవసరమో, అది సామాజికంగా ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తుందో వంటి స్పృహతో వీడియోలు చేయాల్సిన అవసరం ఉంది. మన దేశంలో కొన్ని జీవులను చంపి తినడం పూర్తిగా నిషిద్ధం. అందమైన నెమలిని చంపి తిన్న ఒక తెలుగు యూట్యూబర్ ఇప్పుడు ఇబ్బందుల్లో పడ్డాడు.

జాతీయ పక్షిని ఎలా తింటారు?

భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరికీ మన జాతీయ పక్షి నెమలి అని తెలుసు. నెమలిని భారత జాతీయ పక్షిగా ఎందుకు ఎంపిక చేశారో ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. వన్యప్రాణుల రక్షణ చట్టం ప్రకారం కాపాడుకోవాల్సిన జాతుల్లో నెమలి ఒకటి. నెమలి చూసేందుకు ఎంతో అందంగా ఉంటుంది. అది పురివిప్పి నాట్యం ఆడుతున్నప్పుడు ప్రత్యక్షంగా చూడాలని ఎంతోమంది కోరుకుంటారు. అందుకే మన భారతదేశ జాతీయ పక్షిగా మారింది నెమలి. అలాంటిది నెమలిని చంపి కూర వండుకొని తింటున్న వీడియోను పోస్ట్ చేశాడంటే అతనికి ఏ మాత్రం సామాజిక స్పృహ, చట్టాలపై అవగాహన లేదని అర్థమవుతోంది. నెమలి కూరను వండుకొని తినడం ద్వారా ఆయన మన జాతీయ చిహ్నాన్ని అగౌరవపరిచాడు. దానికి తగిన శిక్షను అనుభవిస్తున్నాడు.

నెమలి కూరను తింటున్నట్టు వీడియో పోస్ట్ చేయడంతో ఆ వీడియో చూసిన కొంతమంది అధికారులకు కంప్లైంట్ చేశారు. వెంటనే అధికారులు స్పందించి అతని గ్రామానికి వెళ్లి ఇంటిపై దాడి చేశారు. అతని ఇంట్లో ఇంకా కూర మిగిలి ఉండడం గమనార్హం. ఆ కూర నెమలికి చెందిందో కాదో నిర్ధారించడానికి ఫోరెన్సిక్ నిపుణులు నమూనాలను సేకరించారు. ఈలోపే యూట్యూబ్ ఛానల్ నుండి ఆయన వీడియోను తీసివేశారు. వీడియోను తీసివేసినా కూడా అతనికి జరగాల్సిన శాస్తి అప్పటికే జరిగిపోయింది. పోలీసులు అతనిపై కేసు నమోదు చేశారు.

భారతీయ నెమలిని పావో క్రిస్టాటస్ అంటారు. మగ నెమలి అందం గురించి ఎంత చెప్పినా తక్కువే. నీలం, ఆకుపచ్చ రంగు కలిసిన నెమలీకలతో ప్రతి ఒక్కరికి నచ్చే పక్షి ఇది. దీని అద్భుతమైన అందం, సాంస్కృతిక ప్రాముఖ్యత, తరిగిపోతున్న సంఖ్య... ఇవన్నీ కూడా భారతదేశ జాతీయ పక్షి హోదాను దానికి అందించింది. వన్యప్రాణులకు రక్షణ చట్టం ప్రకారం నెమలిని వేటాడడం, పట్టుకోవడం, వాటికి హాని చేయడం వంటివన్నీ కూడా నేరపూరిత చర్యలే. వీటి సహజ వారసత్వాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా మనకుంది. అలాంటిది ఒక యూట్యూబర్ కేవలం న్యూస్ కోసం నెమలిని చంపి కూరగా వండి తిన్నట్టు వీడియో చేశాడు. అయితే అతను తిన్నది నిజంగా నెమలి మాంసమో కాదో తెలుసుకునేందుకు ఫోరెన్సిక్ నిపుణులు ప్రయత్నిస్తున్నారు.

ఈ చట్టం చేశాక నెమళ్లను వేటాడే వారి సంఖ్య తగ్గిపోయింది. కానీ ఒకప్పుడు ఈ పక్షిని విపరీతంగా వేటాడి తినేవారు. మధ్యయుగంలో విందులలో, వినోదాలలో నెమలి మాంసం ఉండాల్సిందే. వాటి ఈ కలను తీసి తమ దుస్తులకు అందంగా అలంకరించుకునేవారు.

చైనాలో తెగ తింటారు

చైనాలో ప్రస్తుతం పెద్ద నెమలి మార్కెట్ నడుస్తోంది. అక్కడ నెమలి మాంసానికి గిరాకీ ఎక్కువ. చైనాలో ముఖ్యంగా రెండు రకాల నెమళ్లను పెంచుతారు. ఒకటి గ్రీన్ పీకాక్, ఇక రెండోవి ఇండియన్ పీకాక్. గ్రీన్ పీకాక్‌ను తమ అటవీ పక్షులుగా చైనా వాళ్లు రక్షించుకుంటూ ఉంటారు. కానీ ఇండియన్ పీకాక్‌ను మాత్రం కోళ్ల ఫారాలలో పెంచినట్టు, నెమళ్ల ఫారాల్లో పెంచి తినడానికి ఉపయోగించుకుంటారు. చైనాలో కూడా గ్రీన్ పీకాక్‌ను జాతీయస్థాయిలో తినడాన్ని పూర్తిగా నిషేధించారు. కానీ ఇండియన్ పీకాక్‌ను తినడం మాత్రం అక్కడ చట్టపరంగా న్యాయమే. నెమళ్లను అమెరికాలో కోళ్ల మాదిరిగానే పెంచి వాటిని కూరగా వండుకొని తినేస్తారు. బ్రిటన్ లో కూడా నెమలి మాంసాన్ని తినే ఆచారం ఉంది.

నెమళ్లను తినడం మానేయాలని అంతర్జాతీయ స్థాయిలో ఆందోళనలు జరుగుతున్నాయి. ఇవి అంతరించిపోతున్న జాతుల జాబితాలోకి చేరిపోతున్నాయని, అందుకే నెమలిని బట్టి తినడం మానుకోవాలని వన్యప్రాణుల రక్షణ సంస్థలు ఆందోళనలను చేస్తున్నాయి. అడవులు నిర్మూలించడం వల్ల, నెమలి గ్రామాల్లోకి వచ్చి మనుషులకు దొరికిపోతున్నాయి. దీనివల్ల అవి ప్రాణాలు కోల్పోతున్నాయి. చాలా చోట్ల నెమళ్లను గుట్టు చప్పుడు కాకుండా తినేవారి సంఖ్య కూడా ఉంది.

నెమలి మాంసంలో పోషక విలువలు అధికంగా ఉంటాయి అన్న భావన పురాతన కాలం నుంచి ఉంది. అయితే చట్టాలను గౌరవించకుండా నచ్చింది తినేస్తామంటే కోరి ప్రమాదం తెచ్చుకున్నట్టేనన్న సంగతి మరవొద్దు.

టాపిక్