Spicy Chutney: వేడివేడి అన్నంలోకి ఇలా స్పైసీగా పుదీనా టమోటో చట్నీ చేసుకోండి, ఎంత అన్నమైనా తినేస్తారు-spicy mint tomato chutney recipe in telugu know how to make this pachadi ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Spicy Chutney: వేడివేడి అన్నంలోకి ఇలా స్పైసీగా పుదీనా టమోటో చట్నీ చేసుకోండి, ఎంత అన్నమైనా తినేస్తారు

Spicy Chutney: వేడివేడి అన్నంలోకి ఇలా స్పైసీగా పుదీనా టమోటో చట్నీ చేసుకోండి, ఎంత అన్నమైనా తినేస్తారు

Haritha Chappa HT Telugu
May 07, 2024 11:30 AM IST

Spicy Chutney: చట్నీలు అనగానే టమోటో చట్నీ, ఆవకాయలు, ఊరగాయలే గుర్తొస్తాయి. ఒకసారి పుదీనా టమోటో చట్నీ స్పైసీగా చేసుకుని చూడండి. వేడివేడి అన్నంలో ఇది అదిరిపోతుంది.

పుదీనా టమోటా చట్నీ రెసిపీ
పుదీనా టమోటా చట్నీ రెసిపీ

Spicy Chutney: వేడి వేడి అన్నంలో కారంగా ఉండే పుదీనా, టమోటా చట్నీ వేసుకుని ఆ రుచి అదిరిపోతుంది. దీన్ని కేవలం అన్నంలోనే కాదు, దోశె, ఇడ్లీలోకి కూడా ఇది అదిరిపోతుంది. దీన్ని ఒకసారి చేసి చూడండి, మిగతా పచ్చడితో పోలిస్తే ఇది కొత్త రుచిని అందిస్తుంది. దీన్ని చేయడం చాలా సులువు. రెసిపీ ఇక్కడ ఇచ్చాము. ఇలా ఫాలో అయిపోండి.

పుదీనా టమోటో చట్నీ రెసిపీకి కావలసిన పదార్థాలు

పుదీనా తరుగు - ఒక కప్పు

టమోటోలు - మూడు

ఉల్లిపాయ - రెండు

చింతపండు - నిమ్మకాయ సైజులో

ఉప్పు - రుచికి సరిపడా

నూనె - రెండు స్పూన్లు

పచ్చిమిర్చి - ఆరు

ఆవాలు - అర స్పూను

పచ్చిశనగపప్పు - అర స్పూను

కరివేపాకు - ఒక రెమ్మ

ఎండుమిర్చి - రెండు

మినప్పప్పు - అర స్పూను

పుదీనా టమోటో చట్నీ రెసిపీ

1. స్టవ్ మీద కళాయి పెట్టి నూనె వేయాలి.

2.నూనె వేడెక్కాక పచ్చిమిర్చి వేసి వేయించాలి.

3. ఆ తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయలను వేసి వేయించుకోవాలి.

4. అలాగే టమోటాలను కూడా వేసి మెత్తగా అయ్యేవరకు వేయించుకోవాలి.

5. ఆ తర్వాత పుదీనాను కూడా వేసి 20 సెకన్ల పాటు వేయించి స్టవ్ ఆపేయాలి.

6. ఈ మొత్తం మిశ్రమాన్ని మిక్సీలో వేసి చింతపండు రుచికి సరిపడా ఉప్పును కూడా వేసి బాగా రుబ్బుకోవాలి.

7. అవసరమైతేనే నీరు వేయాలి. దాదాపు ఈ పచ్చడి కి నీరు అవసరం ఉండదు.

8. బాగా రుబ్బుకున్నాక ఒక గిన్నెలోకి చట్నీని తీసుకోవాలి.

9. చట్నీకి పోపు పెట్టేందుకు స్టవ్ మీద చిన్న కళాయి పెట్టాలి.

10. అందులో నూనె వేసి శనగపప్పు, ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, కరివేపాకులు, ఎండుమిర్చి వేసి వేయించి మొత్తం మిశ్రమాన్ని టమాటో చట్నీ పై వేయాలి.

11. అంతే స్పైసి పుదీనా టమోటో చట్నీ రెడీ అయినట్టే

ఇందులో ఉండే పుదీనా, టమోటాలు రెండూ కూడా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. పుదీనా ఆకుల్లో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. ముఖ్యంగా మన శరీరానికి అవసరమైన పొటాషియం, ఐరన్, కాల్షియం, యాంటీ మైక్రోబయోల్ లక్షణాలు, యాంటీ వైరల్ లక్షణాలు, యాంటీ ఆక్సిడెంట్లు లక్షణాలు, విటమిన్ సి వంటివన్నీ ఉంటాయి. కాబట్టి పుదీనాతో చేసిన ఆహారాన్ని ప్రతిరోజూ తినడం అవసరం.

మహిళలకు పుదీనా ఆకులు ఎంతో మేలు చేస్తాయి. పీరియడ్స్ సమయంలో వచ్చే నొప్పిని రాకుండా అడ్డుకుంటాయి. ఇక టమాటో లో ఉండే లైకోపీన్ కొన్ని రకాల క్యాన్సర్లు రాకుండా అడ్డుకుంటుంది. పుదీనా టమోటా ఈ రెండూ కూడా మన ఆరోగ్యానికి మేలు చేసేదే. కాబట్టి అప్పుడప్పుడు ఈ పుదీనా టమాటో చట్నీ ట్రై చేయండి. స్పైసీగా కావాలనుకునేవారు పచ్చిమిర్చి ఎక్కువ వేసుకుంటే సరిపోతుంది. కారాన్ని మాత్రం వినియోగించవద్దు.

టాపిక్