Cashew Tomato Gravy : టొమాటో జీడిపప్పు గ్రేవీ తయారు చేయండి.. ఎంజాయ్ చేస్తూ తింటారు
Cashew Tomato Recipe In Telugu : టొమాటో జీడిపప్పు ఆరోగ్యానికి మంచివి. వీటిని కలిపి గ్రేవీ చేస్తే ఎంతో రుచికరంగా ఉంటుంది.
ఎప్పుడూ రెసిపీలు ఒకేలాగా చేసుకుంటే మీకు బోర్ కొడుతుంది. అందుకే అప్పుడప్పుడు కొత్తగా ట్రై చేయాలి. కొత్తగా ట్రై చేసే రెసిపీలు పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. అందులో భాగంగా టొమాటో జీడిపప్పు రెసిపీ తయారు చేయండి. చాలా రుచిగా ఉంటుంది. మీరు తప్పకుండా ఎంజాయ్ చేస్తూ తింటారు.
టొమటో జీడిపప్పు గ్రేవీ రెసిపీ కింది ఉంది. మీరు ఈ గ్రేవీకి పనీర్, బఠానీలను జోడించవచ్చు. ఇక్కడ జీడిపప్పుతో కూడిన టొమాటో గ్రేవీని ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకోవచ్చు. ఈ రుచికరమైన గ్రేవీ తయారు చేయడానికి సమయం ఎక్కువగా పట్టదు. ఈజీగా తయారు చేయవచ్చు. పిల్లలు, పెద్దలు ఇష్టంగా తింటారు.
టొమటో జీడిపప్పు గ్రేవీకి కావాల్సిన పదార్థాలు
3-4 చెంచాల నెయ్యి, 1 కప్పు జీడిపప్పు, 1 చెంచా నూనె, 1 అంగుళం లవంగం, టొమాటలు 4, చెంచా జీలకర్ర, ఒకటిన్నర చెంచా కారం, 5 వెల్లుల్లి, కరివేపాకు, ఉల్లిపాయలు 2, కొద్దిగా అల్లం, పెరుగు 2-3 స్పూన్లు, కొద్దిగా యాలకుల పొడి, మెంతి పొడి.
టొమటో జీడిపప్పు గ్రేవీ తయారీ విధానం
పాన్ వేడి చేసి అందులో 2 స్పూన్ల నెయ్యి వేయాలి. తరవాత కప్పు జీడిపప్పు వేసి కాసేపు వేయించాలి.
తర్వాత తీసి ప్లేట్‌లో వేసి ఇప్పుడు అదే బాణలిలో 1 టేబుల్ స్పూన్ నెయ్యి, 1 టేబుల్ స్పూన్ నూనె వేసి, నూనె వేడి కాగానే, కరివేపాకు వేయాలి.
తర్వాత లవంగాలు, జీలకర్ర గింజలు వేసుకోవాలి. కాసేపటికి కారం పొడి వేసి 10-15 నిమిషాలు వేయించాలి.
సన్నగా తరిగిన ఉల్లిపాయ వేసి ఉల్లిపాయ మెత్తబడే వరకు వేయించాలి. ఇప్పుడు సన్నగా తరిగిన అల్లం-వెల్లుల్లిని వేయాలి.
తరవాత టొమాటో గ్రైండ్ చేసుకోవాలి. పేస్ట్ వేసి 5 నిమిషాలు ఉడకబెట్టి, ఆపై ధనియాల పొడి, కారం వేసుకోవాలి. తర్వాత ఉప్పు వేసి కొంచెం నీరు పోసి మరిగించాలి.
అనంతరం కొంచెం పెరుగు వేసి కలపాలి. ఇప్పుడు మెంతిపొడి వేసుకోవాలి. చివరగా వేయించిన జీడిపప్పు వేస్తే టొమాటో జీడిపప్పు గ్రేవీ రెడీ.
మీరు దీని కోసం కాశ్మీరీ మిరప పొడిని ఉపయోగించాల్సిన అవసరం లేదు. కానీ దానిని జోడించడం వల్ల చూసేందుకు ఎర్రగా మారుతుంది. కొన్ని జీడిపప్పులను టమాటాతో మెత్తగా రుబ్బితే రుచిగా ఉంటుంది. ఇంట్లో అతిథి ఉన్నప్పుడు ఇలా చేస్తే ప్రత్యేక వంటకం అవుతుంది. నెయ్యితో ఇది చేస్తే చాలా రుచిగా ఉంటుంది. బటర్ నాన్, చపాతీకి కూడా మంచి కాంబినేషన్. అన్నంలో కలుపుకొంటే కూడా ఇది రుచికరంగా ఉంటుంది.