వార ఫలాలు.. వీరికి ఈ వారం వృథా ఖర్చులు ఎక్కువ, గౌరవ మర్యాదలు పెరుగుతాయి-weekly horoscope in telugu may 19th to may 25th horoscope check zodiac signs result ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  వార ఫలాలు.. వీరికి ఈ వారం వృథా ఖర్చులు ఎక్కువ, గౌరవ మర్యాదలు పెరుగుతాయి

వార ఫలాలు.. వీరికి ఈ వారం వృథా ఖర్చులు ఎక్కువ, గౌరవ మర్యాదలు పెరుగుతాయి

HT Telugu Desk HT Telugu
May 19, 2024 02:00 AM IST

Weekly Horoscope Telugu : ఈ వారం రాశి ఫలాలు కింది విధంగా ఉన్నాయి. మే 19వ తేదీ నుంచిమే 25వ తేదీ వరకు రాశి ఫలాలు ఇక్కడ తెలుసుకోండి. జ్యోతిష శాస్త్ర నిపుణులు చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ వీటిని అందించారు.

వారఫలాలు మే 19 నుంచి మే 25వ తేదీ వరకు
వారఫలాలు మే 19 నుంచి మే 25వ తేదీ వరకు

రాశిఫలాలు (వార ఫలాలు) 19.05.2024 నుండి 25.05.2024 వరకు

సంవత్సరం : శ్రీ కోధి నామ, అయనం : ఉత్తరాయణం, మాసం : వైశాఖము

మేష రాశి

మేష రాశి వారికి ఈ వారం మీకు అనుకూల ఫలితాలున్నాయి. వృత్తి ఉద్యోగ, వ్యాపారపరంగా అనుకూల ఫలితాలున్నాయి. కుటుంబ సభ్యులతో ముఖ్యమైన విషయాలు చర్చిస్తారు. నూతన విషయాలను తెలుసుకుంటారు. మొండి బాకీలు వసూలవుతాయి. వివాహ, ఉద్యోగ ప్రయత్నాలు కలసివచ్చును. స్వల్ప అనారోగ్య సమస్యలుంటాయి. సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. విద్యార్థులు చదువులలో రాణిస్తారు. ప్రారంభించిన పనులు సకాలంలో పూర్తిచేస్తారు. సమాజంలో మంచి పేరు సంపాదిస్తారు. నలుగురికి ఉపయోగపడే పనులు చేస్తారు. మేష రాశి వాళ్ళు మరింత శుభఫలితాలు ఈవారం దక్షిణామూర్తిని పూజించడం మంచిది.

వృషభ రాశి

వృషభ రాశి వారికి ఈ వారం మీకు మధ్యస్థ ఫలితాలున్నాయి. స్నేహితులు, ఆత్మీయులతో పనులు పూర్తవుతాయి. పనిలో ఒత్తిళ్ళు, ఇబ్బందులు కలుగుతాయి. ప్రారంభించిన పనులు పూర్తిచేస్తారు. చిన్నపాటి మనస్పర్థలకు అవకాశముంది. మంచిపేరు సంపాదిస్తారు. ఉద్యోగస్తులకు ఆఫీసులో తోటివారి సహకారం, పై అధికారుల ఆదరణ లభిస్తాయి. ప్రయాణాలలో వృథా ఖర్చులుంటాయి. ఆరోగ్యపరంగా జాగ్రత్తలు వహించాలి. కనకధారా స్తోత్రం పఠించడం మంచిది. గురువారం రోజు దత్తాత్రేయుని పూజించండి.

మిథున రాశి

వార ఫలాల ప్రకారం మిథున రాశి వారికి ఈ వారం అనుకూలంగా లేదు. ఉద్యోగస్తులకు పని ఒత్తిళ్ళు ఉంటాయి. ఉన్నతాధికారుల సహకారానికి తగిన ప్రయత్నం అవసరం. స్నేహితులు, బంధువర్గంతో ఖర్చులు ఉంటాయి. ఆలస్యంగా తీసుకునే నిర్ణయాల వల్ల కొంత నష్టం జరగవచ్చు. విద్యార్థులు కష్టపడవలసిన సమయం. శుభకార్యాల నిర్వహణకు పెద్దల సహాయ సహకారాలు అవసరమవుతాయి. వృథా ఖర్చులుంటాయి. భార్యాపిల్లలతో ఆనందముగా గడిపెదరు. ఆరోగ్య నియమాలను పాటిస్తారు. నవగ్రహ పీడాహర స్తోత్రాన్ని పఠించడం మరింత శుభఫలితాలు కలుగుతాయి. శివాష్టకం పఠించడం మంచిది.

కర్కాటక రాశి

కర్కాటక రాశి వారికి ఈ వారం మీకు అనుకూలంగా ఉన్నది. సమాజంలో మంచి వ్యక్తులు పరిచయమవుతారు. భూములు, వ్యవసాయం, గృహ నిర్మాణ పనులు కలసివస్తాయి. వ్యాపార, ఉద్యోగ, వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. వృత్తిరీత్యా రావలసిన డబ్బు చేతికి అందుతుంది. తలపెట్టిన పనులు సకాలంలో పూర్తిచేస్తారు. బంధువుల సహకారం ఉంటుంది. క్రయవిక్రయాల వల్ల ఆదాయం పెరుగుతుంది. దశరథ ప్రోక్త శని స్తోత్రాన్ని పఠించండి. నవగ్రహ ఆలయ దర్శనం మంచిది.

సింహ రాశి

సింహ రాశి వారికి ఈవారం మీకు అనుకూలంగా ఉన్నది. మీరు ప్రారంభించిన పనులు సరైన సమయంలో పూర్తవుతాయి. బంధువుల, స్నేహితుల సహాయంతో పనులు పూర్తి చేస్తారు. తల్లిదండ్రులు, పెద్దల సహకారం లభిస్తుంది. సమాజంలో గౌరవ మర్యాదలు పొందుతారు. ఉద్యోగ ప్రయత్నాలు కలసి వస్తాయి. కొత్త ఉద్యోగంలో చేరతారు. ఉద్యోగంలో స్థిరత్వం కోసం ఆలోచించాలి. వివాదాలకు దూరంగా ఉండాలి. కొన్ని విషయాలలో భేదాభిప్రాయములు రావచ్చు కానీఈ పరిష్కరించుకుంటారు. ఆదిత్య హృదయం పఠించడం మంచిది. సూర్య నారాయణమూర్తిని పూజించండి.

కన్యా రాశి

కన్యా రాశి వారికి ఈ వారం మీకు అనుకూల ఫలితాలున్నాయి. నలుగురిలో గౌరవ మర్యాదలు పొందుతారు. ప్రారంభించిన పనులు పూర్తవుతాయి. బంధుమిత్రులతో ఆనందముగా గడిపెదరు. ఆరోగ్యం అనుకూలించును. విద్యార్థులకు అనుకూల సమయం. ఉద్యోగస్తులు తోటి ఉద్యోగులతో ఆచి తూచి వ్యవహరించాలి. నిర్మాణం, భూములు, వాహనాల విషయాల్లో కలసివస్తుంది. కొన్ని విషయాలలో ఆర్థిక సమస్యల వల్ల ఆలస్యం జరుగవచ్చు. విష్ణు సహస్రనామం పారాయణం, ఆదిత్య హృదయాన్ని పఠించడం మంచిది.

తులా రాశి

తులా రాశి వారికి ఈ వారం మీకు మధ్యస్థంగా ఉన్నది. వ్యాపారస్తులకు పెట్టుబడులకు ప్రతిఫలాలు అందుతాయి. ఆదాయం పెరిగినా సరిపడా ఖర్చులుంటాయి. రావలసిన డబ్బు వివాదాలతో చేతికి అందుతుంది. పనులు పూర్తవ్వడంలో ఆలస్యం. అతికష్టం మీద పనులు పూర్తి కావచ్చు. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. శుభకార్య ప్రయత్నాలలో పెద్దల సహకారం లభిస్తుంది. వృథా ఖర్చులుంటాయి. వస్త్ర, వస్తువులను కొంటారు. వాహనాల విషయంలో ఖర్చులుండవచ్చు. భూములు, ఆస్తుల గొడవలు కొంతవరకు పరిష్కారమవుతాయి. గొడవలకు దూరంగా ఉండాలని సూచన. మరింత శుభఫలితాలు పొందడం కోసం కృష్ణాష్టకాన్ని పఠించండి.

వృశ్చిక రాశి

వార ఫలాల ప్రకారం వృశ్చిక రాశి వారికి ఈ వారం అనుకూల ఫలితాలున్నాయి. వృత్తి, ఉద్యోగాలలో పై అధికారుల సహకారం ఉంటుంది. ఆస్తుల తగాదాలు పరిష్కారమవుతాయి. కొత్త పనులు ప్రారంభించడానికి పెద్దల సహకారం తీసుకుంటారు. ఖర్చులు పెరుగుతాయి. రావలసిన డబ్బు చేతికి అందుతుంది. బంధుమిత్రుల రాకతో ఆనందముగా ఉంటారు. చిన్న చిన్న గొడవలు రావచ్చు. కొత్త పెట్టుబడులకు అనుకూలమైన వారం. సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. మరింత శుభఫలితాలు కోసం శనికి తైలాభిషేకం చేసుకోవడం మంచిది. దశరథ ప్రోక్త శని స్తోత్రాన్ని పఠించండి.

ధనూ రాశి

ధనూ రాశి వారికి ఈ వారం మీకు అనుకూలంగా ఉన్నది. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. పెద్దల సహకారం లభిస్తుంది. నలుగురిలో గౌరవ మర్యాదలు పొందుతారు. ఇతరులపై ఆధారపడకుండా స్వంతగా నిర్ణయాలు తీసుకుంటూ పనులు పూర్తిచేసుకుంటారు. డబ్బు విషయంలో జాగ్రత్త అవసరం. వృథా ఖర్చులుంటాయి. ఉద్యోగస్తులకు విధినిర్వహణలో పైఅధికారుల సహకారముంటుంది. బంధువర్గంతో సత్సంబంధా లుంటాయి. పనులను పట్టుదలతో పూర్తిచేస్తారు. మరింత శుభ ఫలితాల పొందడం కోసం సుబ్రహ్మణ్యుడిని, దుర్గాదేవిని పూజించడం మంచిది.

మకర రాశి

మకర రాశి వారికి ఈ వారం మీకు అంత అనుకూలంగా లేదు. వ్యాపారస్తులకు లాభదాయకం. ప్రారంభించిన పనులు పూర్తిచేస్తారు. శుభకార్య ప్రయత్నాలలో పెద్దల సహకారం లభిస్తుంది. ఆఫీసులో తోటి ఉద్యోగుల సహాయం ఆనందాన్నిస్తుంది. వివాదాలను నేర్పుతో పరిష్మ్కరించుకుంటారు. అభిప్రాయభేదములు ఏర్పడవచ్చు. ఆరోగ్య సమస్యలు పరిష్కారమవుతాయి. వాహనాల వల్ల ఖర్చులు పెరుగుతాయి. అనవసర ఖర్చులు వల్ల ఇబ్బంది పడతారు. మరింత శుభఫలితాలు పొందడం కోసం శనికి తైలాభిషేకం చేసుకోవడం మంచిది. దశరథ ప్రోక్త శని స్తోత్రాన్ని పఠించండి.

కుంభ రాశి

కుంభ రాశి వారికి ఈ వారం మీకు మధ్యస్థ ఫలితాలున్నాయి. కుటుంబసభ్యులతో ఆనందముగా గడిపెదరు. నిర్మాణరంగం, వ్యాపారాలలో జాగ్రత్త అవసరం. వ్యాపారస్తులు ఒప్పందాలలో కొంత జాగ్రత్త పడాలి. ఆగిపోయిన పనులలో కదలిక వస్తుంది. శుభకార్య ప్రయత్నాలు పెద్దల సహకారంతో ముందుకు సాగుతాయి. డబ్బు ఆలస్యంగా అందుతుంది. బంధువుల రాకపోకలుంటాయి. నూతన పరిచయాలతో పనులు నెరవేరతాయి. కొన్ని ఖర్చులు ముందుకు వస్తాయి. నలుగురికి సహాయపడే కార్యక్రమాలపై మనసు నిలుపుతారు. మరింత శుభఫలితాలు పొందడం కోసం శనికి తైలాభిషేకం చేసుకోవాలి. నవగ్రహ పీడాహర స్తోత్రాన్ని పఠించండి. దశరథప్రోక్త శని స్తోత్రాన్ని పఠించండి.

మీన రాశి

మీన రాశి వారికి ఈ వారం మీకు అనుకూల ఫలితాలున్నాయి. చేతిలో ఉన్న పనులు సకాలంలో పూర్తిచేస్తారు. వ్యాపారస్తులకు అనుకూలం. పనులు కలసివస్తాయి. ఆస్తుల విషయంలో గొడవలు పరిష్కారమవుతాయి. స్థిర, చరాస్తులు కొనుగోలు చేస్తారు. ఇంటికి కావలసిన వస్తువులను కొంటారు. అన్నదమ్ములు, బంధువర్గంతో ఉన్న గత అభిప్రాయభేదములు తొలగుతాయి. వ్యాపార విస్తరణకు ఒప్పందాలు చేసుకుంటారు. పెద్ద మొత్తంలో పెట్టుబడులకు అనుకూలమైన వారం. మరింత శుభఫలితాలు పొందడం కోసం గురు దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించండి. ఆదిత్య హృదయ పారాయణం చేయడం మంచిది. శనికి తైలాభిషేకం చేసుకోవడం మంచిది.

బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ

మొబైల్‌ : 9494981000

ఆధ్యాత్మిక వేత్త పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ
ఆధ్యాత్మిక వేత్త పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ
WhatsApp channel