ఇంట్లో ఏ స్వీట్‌ చేసినా అందులో జీడిపప్పు వేస్తే రుచిగా ఉంటుంది. కొందరు జీడిపప్పును ఇష్టంగా తింటారు.

Unsplash

By Anand Sai
May 03, 2024

Hindustan Times
Telugu

రోజూ నాలుగైదు జీడిపప్పులు తింటే ఆరోగ్యానికి రకరకాల ప్రయోజనాలు ఉంటాయి. జీడిపప్పు వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల తెలుసుకుందాం..

Unsplash

జీడిపప్పులో విటమిన్ ఇ పుష్కలంగా ఉంటుంది. ఇది చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. అందాన్ని పెంచుతుంది.

Unsplash

జీడిపప్పులో క్యాల్షియం పుష్కలంగా ఉంటుంది. రోజూ తీసుకుంటే ఎముకలు దృఢంగా తయారవుతాయి.

Unsplash

జీడిపప్పు మెదడు ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది. ఇందులో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉండటం వల్ల మెదడు సజావుగా పనిచేస్తుంది.

Unsplash

జీడిపప్పులో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది రక్తంలో చక్కెర శోషణను తగ్గిస్తుంది. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది.

Unsplash

జీడిపప్పులో పీచు, ప్రొటీన్లు ఎక్కువగా ఉంటాయి. ఇవి కడుపు నింపడమే కాకుండా బరువు తగ్గడానికి కూడా సహాయపడతాయి.

Unsplash

జీడిపప్పులో ఉండే లుటిన్, జియాక్సంథిన్ అనే యాంటీ ఆక్సిడెంట్లు కంటి సమస్యలను నివారిస్తుంది. కంటి ఆరోగ్యాన్ని కాపాడుతుంది.

Unsplash

శరీరంలో ఈ సంకేతాలు కనిపిస్తే డీహైడ్రేషన్ అయినట్టే! జాగ్రత్త పడండి

Photo: Pexels