First Sex Experience | తొలిసారి శృంగారంలో పాల్గొనే అమ్మాయిలు ఈ విషయాలు తప్పక తెలుసుకోవాలి!
First Sex Experience: మొదటి సారి సెక్స్‌లో పాల్గొనాల్సిన సందర్భం వస్తే, సంభోగంపై సందేహాలు, లైంగికంగా సంక్రమించే అంటువ్యాధులు (STIలు), గర్భం గురించి విచారణలు ఉంటాయి, మీరు తెలుసుకోవాల్సిన విషయాలు ఇవీ..
First Sex Experience: ఇప్పటివరకు శృంగారంలో పాల్గొనని వారికి సెక్స్‌పై చాలా అభిప్రాయాలు, ఆసక్తులు, సందేహాలు ఉంటాయి. తొలి కలయిక గురించి ఎంతోకాలం నిరీక్షిస్తుంటారు. ముఖ్యంగా మన సమాజంలో స్త్రీలపై గౌరవం ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే వారు చాలా కట్టుబాట్లను కలిగి ఉంటారు, శృంగారం విషయంలో బిడియాన్ని ప్రదర్శిస్తుంటారు, మొదటిసారి సెక్స్‌లో పాల్గొనడంపై అనేక కలలను, కల్పనలను కలిగి ఉంటారు. అయితే శృంగారంపై అవగాహన తక్కువ ఉండి ఉండవచ్చు. ఏ అమ్మాయైనా మొదటి సారి సెక్స్‌లో పాల్గొనాల్సిన సందర్భం వస్తే, సంభోగంపై సందేహాలు, లైంగికంగా సంక్రమించే అంటువ్యాధులు (STIలు), గర్భం గురించి విచారణలు ఉండటం సహజం. అందువల్ల ఇలాంటి వారు తెలుసుకోవాల్సిన కొన్ని విషయాలు కొన్ని ఉన్నాయి, అవేమిటో ఇక్కడ చూడండి.
సమ్మతి అవససరం
సెక్స్ చేసేటపుడు మొట్టమొదటగా మీ 'సమ్మతి' అవసరం. మొదటి సారి అని కాకుండా ఎప్పుడు శృంగారంలో పాల్గొనాలన్నా మీ సమ్మతితోనే అది జరగాలి. మీరు సమ్మతించిన తర్వాత, కూడా మీకు అసౌకర్యంగా అనిపిస్తే అందుకు దూరంగా ఉండాలి.
కమ్యూనికేషన్ ఉండాలి
మీ భాగస్వామితో మీ మొదటి శృంగార అనుభవం చిరస్మరణీయంగా ఉండాలంటే, మీరు ప్రతి దశలో మీ అవసరాలు, కోరికలను వారికి తెలియజేయాలి. మీకు ఏదైనా నచ్చకపోతే నిర్మొహమాటంగా దానిని బయటకు చెప్పాలి.
సురక్షితమైన సెక్స్
మీరు పిల్లలు కనాలి అనే సందర్భంలో మినహా ఎప్పుడు శృంగారం చేయాల్సి వచ్చినా, లైంగికంగా సంక్రమించే ఇన్ఫెక్షన్ల నుండి రక్షించుకోవడానికి రక్షణ అవసరం. కండోమ్‌లు, డెంటల్ డ్యామ్‌లను కచ్చితంగా ఉపయోగించాలి, నివారణ పద్ధతులు విఫలమైతే, అత్యవసర గర్భనిరోధకం కూడా తీసుకోవచ్చు.
అంచనాలను తెలుసుకోండి
మొదటి లైంగిక అనుభవం మీరు విన్నట్లుగా లేదా సినిమాలు లేదా పోర్న్‌లలో చూసే విధంగా ఉండకపోవచ్చు. మొదటి అనుభం మీకు ఇబ్బందికరంగా లేదా అత్యంత సంతృప్తికరంగా ఉంటుంది. కాబట్టి ఏవో రకాల ఫాంటసీలకు లొంగిపోకూడదు.
అపరాధం ఉండరాదు
మీరు మొదటిసారి శృంగారం చేస్తున్నప్పుడు మీలో అపరాధ భావన అనేది ఉండకూడదు. భయాలను వీడి మధుర క్షణాలను అనుభవించండి, మొదటి కలయికను ఆస్వాదించండి.
తొలి కలయిక బాధించవచ్చు
మొదటిసారి సంభోగం చేయడం కొన్నిసార్లు బాధాకరమైన అనుభంగా ఉండవచ్చు. తగినంత ఫోర్ ప్లే, లూబ్రికెంట్ల వాడకం లేనపుడు కలయికలో నొప్పి ఉండవచ్చు. కాబట్టి రతిక్రీడ నెమ్మదిగా సాగాలి, నొప్పి భరించలేనట్లయితే, వెంటనే ఆపివేయడం మంచిది.
రక్తస్రావం
మీరు మొదటిసారి సెక్స్ చేసినప్పుడు రక్తస్రావం జరగవచ్చు లేదా కొన్నిసార్లు జరగకపోవచ్చు. ఒకవేళ మీకు రక్తస్రావం జరిగితే, అది అధికంగా ఉండి, నొప్పి తీవ్రమైతే వీలైనంత త్వరగా వైద్యులను సంప్రదించండి.
పరిశుభ్రత
మీ జననేంద్రియ మార్గం ద్వారా ప్రయాణించగల బ్యాక్టీరియా మీకు హాని కలిగించవచ్చు. సెక్స్‌కు ముందు, తర్వాత మూత్ర విసర్జన చేయాలని డాక్టర్లు సలహా ఇస్తారు. ఇది యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్లను నివారిస్తుంది.
స్నేహితుడితో మాట్లాడండి
మీరు మీ మొదటి సారి శృంగారంలో పాల్గొనాల్సి వచ్చినపుడు లేదా ఆ తర్వాత గానీ వివిధ భావోద్వేగాలను అనుభవించవచ్చు. కాబట్టి మీ మేలు కోరే మీ ఆప్త స్నేహితురాలి సలహాలు తీసుకోవడం మంచిది.
సంబంధిత కథనం
టాపిక్