Morning Routine : ఉదయాన్నే బద్దకంగా ఉంటుందా? అయితే ఈ చిట్కాలతో యాక్టివ్ అయిపోండి-these tips will help you wake up fresh and active in the morning ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Morning Routine : ఉదయాన్నే బద్దకంగా ఉంటుందా? అయితే ఈ చిట్కాలతో యాక్టివ్ అయిపోండి

Morning Routine : ఉదయాన్నే బద్దకంగా ఉంటుందా? అయితే ఈ చిట్కాలతో యాక్టివ్ అయిపోండి

Geddam Vijaya Madhuri HT Telugu
Nov 01, 2022 09:00 PM IST

Healthiest Morning Routine : చలికాలంలో నిద్రలేవడం అనేది చాలా కష్టంతో కూడుకున్న పని. ఒకవేళ లేచినా.. నిద్రమత్తు అంత సులువుగా వదలదు. అయితే ఈ మత్తు మీ డేని కరాబ్ చేయకుండా ఉండాలంటే.. వీటిని ప్రాక్టీస్ చేయాలి అంటున్నారు నిపుణులు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

నిద్రలేచాక ఇలా యాక్టివ్ అయిపోండి..
నిద్రలేచాక ఇలా యాక్టివ్ అయిపోండి..

Healthiest Morning Routine : చాలామందికి నిద్రలేవగానే అలసటగా ఉంటుంది. ముఖ్యంగా చలికాలంలో ఈ సమస్యను చాలా మంది ఎదుర్కొంటారు. ఆ డేని స్టార్ట్ చేయడం కోసం బలవంతంగా లేస్తూ.. నిద్రమత్తులోనే రెడీ అవుతూ ఉంటారు. ఒక్కోసారి అలారాన్ని స్నూజ్ చేసి.. కొంచెం ఆలస్యంగా లేద్దాములే అనుకుంటూ పడుకుని పోతారు. ఆ నిద్రమత్తు అంత ఈజీగా మనల్ని వదిలిపోదు. మీరు కూడా ఈ సమస్యతో ఇబ్బంది పడుతుంటే.. కొన్ని చిట్కాలు పాటించాలి అంటున్నారు నిపుణులు. దీనివల్ల మీ ఉదయం అలసట పోయి.. నూతన ఉత్తేజంతో డేని ప్రారంభించవచ్చు అంటున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

అలారాన్ని స్నూజ్ చేయకండి..

మీ డే హ్యాపీగా స్టార్ట్ అవ్వాలంటే.. అలారం మోగిన వెంటనే నిద్రలేవండి. దానిని స్నూజ్ చేయడం ఆపివేయండి. కొంచెం ఎక్కువసేపు నిద్రించడానికి మీ అలారాన్ని తాత్కాలికంగా ఆపివేయవచ్చు. కానీ మీరు అలారంను మళ్లీ మళ్లీ స్నూజ్ చేయడం వల్ల మీరు మరింత అలసిపోయే అవకాశముంటుంది. 90 నిమిషాల స్లీప్ సైకిల్ హ్యాక్‌ని ప్రయత్నించండి. రెండు అలారాలను ఒకటి 90 నిమిషాల ముందు సెట్ చేయండి. మీరు నిజంగా మేల్కొనవలసి వచ్చినప్పుడు మరొకటి సెట్ చేయండి. దీనివల్ల మరింత ఎక్కువ నిద్రపోయిన ఫీలింగ్​ని అనుభవిస్తారు.

గ్లాసు నీటితో రోజును ప్రారంభించండి

నిర్జలీకరణం అలసటకు దారితీస్తుంది. నిద్రలేమి, మానసిక స్థితి అంతరాయాలు, అభిజ్ఞా సామర్థ్యంలో మార్పులను ప్రేరేపిస్తుంది. హైడ్రేటెడ్ గా ఉండటానికి, మీ ఉదయం బద్ధకాన్ని దూరం చేయడానికి మీరు ఉదయం నిద్రలేచిన వెంటనే ఒక గ్లాసు నీరు తాగి ఫ్రెష్ అప్ అవ్వండి. ఈ నీరు శరీరంలోని టాక్సిన్స్‌ను కూడా బయటకు పంపుతుంది. కాబట్టి రోజంతా తగినంత నీరు తాగుతూ ఉండండి.

వ్యాయామం చేయండి

కొంచెం సూర్యకాంతిని పొందడం చాలా ముఖ్యం. మీరు వాకింగ్ కోసం.. కాసేపు ఎండలో నడవ వచ్చు. ఉదయాన్నే సూర్యరశ్మికి గురికావడం వల్ల మీ మెదడులో సెరోటోనిన్‌ని పెంచి.. మిమ్మల్ని మరింత శక్తివంతంగా, ఏకాగ్రతతో ఉంచుతుంది. వాకింగ్ చేయడం కుదరకపోతే.. కిటికీ లేదా బాల్కనీ ద్వారా సూర్యరశ్మి వచ్చే ప్లేస్​లో కాసేపు కుర్చోండి. మీ కండరాలను, శక్తి స్థాయిని, మెదడు పనితీరును పెంచడానికి ఉదయం సూర్య నమస్కారాలు లేదా స్ట్రెచింగ్ వ్యాయామాలు సుమారు 25 నిమిషాలు చేయండి.

చల్లని నీటితో స్నానం..

చలికాలంలో చల్లని నీటితో స్నానం అంటే సాహసం అనే చెప్పాలి. అయినా సరే మీ ముఖాన్ని చల్లని నీటితో కడగండి. లేదా.. చన్నీటితో స్నానం చేయండి. నివేదికల ప్రకారం.. ఇలా చన్నీటితో స్నానం చేయడం వల్ల ఒత్తిడి, కండరాల నొప్పులు, అలసట తగ్గుతాయి. మీ శరీరంలో ఉష్ణోగ్రత మార్పును సూచించడానికి మీరు మీ ముఖంపై కొంచెం చల్లటి నీటిని కూడా చల్లుకోవచ్చు.

బెడ్ కాఫీకి నో చెప్పండి

కాఫీని మానుకోండి. దానికి బదులు మంచిగా అల్పాహారం తీసుకోండి. ఉదయాన్నే ఎక్కువగా కాఫీ తాగడం వల్ల రోజులో అలసట ఎక్కువగా ఉంటుందని అధ్యయనాలు చెప్తున్నాయి. మీరు దానిని మానలేకపోతే, కాఫీ తీసుకునే మోతాదును తగ్గించడానికి ప్రయత్నించండి. మీ మానసిక స్థితి, జ్ఞానాన్ని మెరుగుపరచడానికి తక్కువ కార్బ్స్ అధికంగా ఉండే అల్పాహారాన్ని తినండి. మీరు ఓట్స్, గుడ్లు, తక్కువ చక్కెర కలిగిన పండ్లు, గింజలు లేదా తృణధాన్యాలు తీసుకోవచ్చు.

Whats_app_banner

సంబంధిత కథనం