Telugu News  /  Lifestyle  /  These Are The Possible Reasons For Morning Fatigue, Know How To Overcome
Morning Fatigue
Morning Fatigue (Unsplash)

Morning Fatigue। ఎల్లప్పుడూ నిద్రమబ్బుతో ఉండటానికి కారణాలివే, పరిష్కారాలు ఇవిగో!

19 October 2022, 23:12 ISTHT Telugu Desk
19 October 2022, 23:12 IST

Morning Fatigue: కొందరికి ఎప్పుడూ రెండే ఇష్టం ఒకటి తిండి, రెండోది నిద్ర. ఈ రెండూ ఎక్కువైతే సమస్యలే. ముఖ్యంగా ఉదయం వేళ నిద్రమబ్బు, పగటివేళ నిద్ర, ఎల్లప్పుడూ నిద్రమబ్బుతో ఉంటున్నారంటే అందుకు కారణాలు ఉన్నాయి. ఈ స్టోరీ చదవండి.

Morning Fatigue: ఉదయం నిద్ర లేచిన తర్వాత కూడా చాలా మందికి ఇంకా మబ్బుగా ఉంటుంది, మళ్లీ నిద్ర రావడం మామూలే. అయితే వెంటనే షవర్ కింద స్నానం లేదా ఒక కప్పు కాఫీతో నిద్రమబ్బు అనేది పోతుంది. అయినా కూడా మీకు తరచుగా ఉదయం వేళల్లో నిద్రమబ్బుగా, నీరసంగా అనిపిస్తే, దాని వెనుక ఉన్న కారణాన్ని మీరు తప్పక తెలుసుకోవాలి. ఉదయం పూట నిద్ర రావటం అనేది చాలా కాలం పాటు కొనసాగితే, అది మీ ఆరోగ్యంపై ప్రతికూలంగా ప్రభావితం చేస్తుంది. ఇలా ఎందుకు జరుగుతుందో ఆరోగ్య నిపుణులు కొన్ని ఉదాహారణలు పేర్కొన్నారు.

ట్రెండింగ్ వార్తలు

వేళకు నిద్రపోక పోవడం

కొంతమంది త్వరగా నిద్రపోవడానికి ఇష్టపడతారు, మరికొందరు రాత్రంతా మెలకువగా ఉండటానికి ఇష్టపడతారు. రాత్రంతా మెలకువగా ఉన్నప్పుడు ఉదయం నిద్ర రావటం మామూలే. నీరసంగా కూడా ఉంటుంది. కాబట్టి మీరు ఈ అలవాటుని మార్చుకోవాలి.

చాలా సేపు మంచం మీద ఉండడం

కొంతమంది ఉదయన్నే నిద్రలేస్తారు. కానీ నిద్రలేచిన తర్వాత మంచం నుంచి దిగటానికి మాత్రం బద్ధకిస్తారు. ఉదయం 7 గంటలకు నిద్ర లేచిన వారు, సమయం 10 గంటలు అయినా మంచ దిగరు. ఇది కచ్చితంగా తప్పు. దీనివల్ల మీకు ఉదయం నిద్ర ఎక్కువ వస్తుంది, మీ ఉత్పాదకత కూడా దెబ్బతింటుంది.

పడకగది వాతావరణం

మీ పడకగదిలో మీ నిద్రను ప్రభావితం చేసే అనేక విభిన్న అంశాలు ఉన్నాయి. మీ నిద్ర నాణ్యతకు గది ఉష్ణోగ్రత చాలా అవసరం కాబట్టి, సౌకర్యవంతమైన నిద్ర కోసం AC కూలింగ్ ను సర్దుబాటు చేయండి. పడకగదిలో నీలంరంగు బల్పును ఉపయోగించాలి. ఎందుకంటే నీలి కాంతి మెలటోనిన్ ఉత్పత్తిని అడ్డుకుంటుంది, ఇది మంచి విశ్రాంతిని కలిగిస్తుంది. తద్వారా ఉదయం హుషారుగా ఉండవచ్చు.

ఆహారం, ఆల్కహాల్

రాత్రివేళ ఎక్కువగా తినడం, ఆల్కాహాల్ సేవించడం లేదా కెఫిన్ కలిగిన పానీయాలు తీసుకోవడం వలన నాణ్యమైన నిద్ర ఉండదు, ఫలితంగా ఉదయం నిద్ర లేవాలనిపించదు, నీరసంగా ఉంటుంది. మధ్యాహ్నం 2 గంటల తర్వాత కెఫీన్ పానీయాలు సేవించవద్దు, నిద్రవేళకు 3 గంటల ముందు మద్యం సేవించడం మానేయండి.

నిద్రలేమి సమస్యలు

కొంతమందికి నిద్రలేమి సమస్యలు ఉంటాయి. ఇవి నిద్రను, నిద్ర నాణ్యతను ప్రభావితం చేస్తాయి. స్లీప్ అప్నియా, నార్కోలెప్సీ, నిద్రలేమి , రెస్ట్‌లెస్ లెగ్స్ సిండ్రోమ్ సమస్యలు ఉన్నవారు వైద్యులను సంప్రదించి చికిత్స తీసుకోవాలి.