Insomnia: రాత్రి పూట నిద్ర పట్టడం లేదా? అయితే ఈ ఆహారాలకు దూరంగా ఉండండి!-how diet may lead to insomnia follow this tips that help you sleep better ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Insomnia: రాత్రి పూట నిద్ర పట్టడం లేదా? అయితే ఈ ఆహారాలకు దూరంగా ఉండండి!

Insomnia: రాత్రి పూట నిద్ర పట్టడం లేదా? అయితే ఈ ఆహారాలకు దూరంగా ఉండండి!

HT Telugu Desk HT Telugu
Sep 05, 2022 05:16 PM IST

Reasons for Insomnia: చాలా మందికి రాత్రిపూట నిద్రపట్టక ఇబ్బంది పడుతుంటారు, దీనివల్ల ఏ పని చేసిన తొందరగా అలసిపోతుంటారు. ఆహారపు అలవాట్ల కారణంగానే రాత్రిపూట నిద్రకు ఆటంకం కలుగుతుందని పోషకాహార నిపుణులు తెలిపారు.

Insomnia
Insomnia

ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతి రోజు 7-8 గంటల నిద్ర అవసరం. తగినంత లేకపోతే బద్ధకం, అలసట, తలనొప్పి వంటి అనేక సమస్యలు కలుగుతాయి. ప్రస్తుతం జీవనశైలిలోచేడు ఆహారపు అలవాట్లు కారణంగా చాలా మంది నిద్రలేమి సమస్యను ఎదుర్కొంటున్నారు. కావున రాత్రిపూట సరైన నిద్ర లేక ఇబ్బంది పడుతున్నవారు క్రింద పేర్కొన్న విషయాలపై ఖచ్చితంగా శ్రద్ధ వహించండి. ఈ విషయాలే ఎక్కువగా నిద్రకు ఆటంకం కలిగిస్తాయి.

1. పిండి పదార్థాలు తిసుకోవడం తగ్గించండి

ఆధునిక జీవనశైలిలో చాలా మంది కార్బోహైడ్రేట్లతో కూడిన ఆహారాలను తీసుకుంటున్నారు. శరీరానికి ఎక్కువగా శక్తిని అందించే ప్రధాన వనరు కార్బోహైడ్రేట్లు. అయితే రోజువారిగా తీసుకునే ఆహారం వాటి పరిణామం తక్కువగా ఉండాలి. దీని కోసం బ్రౌన్ పాస్తా, క్వినోవా, బ్రౌన్ రైస్, హోల్‌మీల్ బ్రెడ్ వంటి ఆహారాలను తీసుకోవాలి. వీటిలో మితంగా కార్బోహైడ్రేట్‌లు ఉంటాయి. అలాగే వాటిలో ఎక్కువగా ఫైబర్, పోషకాలు ఉంటాయి. ఇది రక్తంలో చక్కెరను స్థాయిలు స్థిరంగా ఉంచుతాయి. శరీరానికి కావాల్పిన శక్తిని ఇస్తాయి. బీన్స్, పప్పులు, పండ్లు, కూరగాయలు, గింజలు అధిక ఫైబర్ ఉన్న ఆహారాలు.

2. కాఫీ,టీలు తీసుకోవడం తగ్గించాలి

చాలామంది కాఫీ,టీలను ఎక్కువగా తీసుకుంటారు. దాని వల్ల నిద్రకు ఆటంకం కలుగుతుంది. కాఫీలో ఎక్కువగా కెఫిన్ ఉంటుంది. ఇది నిద్రకు భంగం కలిగిస్తుంది. సాధారణంగా, పెద్దలకు రోజుకు 400 mg కెఫిన్ (4 కప్పుల కాఫీ) సురక్షితంగా పరిగణించబడుతుంది. ఎక్కువ కాఫీ తాగడం వల్ల అలసట, నిద్రలేమి కలుగుతుంది.

3. ఆచరణాత్మకంగా లేని డైట్ విధానం

నేటి కాలంలో, చాలా మంది బరువు తగ్గడానికి లేదా ఇతర కారణాల వల్ల ఆహారం తక్కువగా తీసుకుంటుంటారు. అయితే ఇలా చేయడం వల్ల రాత్రి నిద్రకు ఇబ్బంది కలుగుతుంది. అల్పాహారం లేదా భోజనం మానడం వల్ల రక్తంలో ఉండాల్సిన సాధారణ చక్కెర స్థాయిలు తగ్గుతాయి. దీంతో శరీరం కోల్పోయేలా చేస్తుంది. కాబట్టి ఆకలితో ఉన్నప్పుడు ఆహారం తీసుకుంటే చాలా మంచిది. తీసుకునే ఆహారంలో ఆహారంలో ప్రోటీన్, ఫైబర్ ఎక్కువగా ఉండాలి, పెరుగు, పండ్లు, కూరగాయలు రక్తంలో చక్కెర స్థాయి సాధారణ స్థాయిలో ఉండేలా సహయం చేస్తాయి.

4. మధ్యాహ్న భోజనం ఎక్కువగా తీసుకోవడం

చాలా మంది మధ్యాహ్న భోజనంలో ఎక్కువ ఆహారం తీసుకుంటారు. ఈ కారణంగా ఎక్కువగా అలసిపోతారు. సమతుల్య ఆహారం తీసుకోకపోతే, రక్తంలో చక్కెర వేగంగా పెరుగుతుంది. కాబట్టి ఎక్కువగా ఆహారాన్ని తీసుకోవడం తగ్గించండి. వైట్, ప్రాసెస్ చేయబడిన కార్బోహైడ్రేట్లకు బదులుగా కార్బోహైడ్రేట్లు మితంగా ఉండే ఆహారాలను ఎంచుకోండి. తీసుకునే ఆహారంలో కూరగాయలు, ప్రోటీన్లను ఎక్కువగా చేర్చండి.

5. తగినంత నీరు త్రాగకపోవడం

తగినంత నీరు తీసుకోవడం ద్వారా శరీరం సక్రమంగా పనిచేయడానికి సహాయపడుతుంది. ప్రతి ఒక్కరూ రోజుకు కనీసం 8-10 గ్లాసుల నీరు తాగాలని నిపుణులు సూచిస్తున్నారు. జీవక్రియలు సజావుగా జరగడానికి తగినంత నీరు తీసుకోవడం చాలా అవసరం. నీరు త్రాగకపోతే శరీరం డీహైడ్రేట్ అవుతుంది. కాబట్టి రోజులో ఎక్కువగా ద్రవ పానీయాలు తీసుకోవాలి. కానీ ఆల్కహాల్, మితిమీరిన కాఫీ, తీపి పానీయాలు తాగడం మానుకోండి. దీనికి బదులు నీరు, పాలు, కొబ్బరి నీరు, రసం త్రాగవచ్చు.

WhatsApp channel

సంబంధిత కథనం

టాపిక్