Sleeping Mistakes : నిద్రపోతున్నప్పుడు చేసే తప్పులతో మెుటిమలు.. ఇలా చేయకండి!
Sleeping Mistakes : చాలా మంది మొటిమల సమస్యతో బాధపడుతున్నారు. నిద్రపోతున్నప్పుడు చేసే కొన్ని తప్పులతోనూ మెుటిమలు రావొచ్చు. అందుకే సరిగా నిద్రపోయే వాతావరణాన్ని సృష్టించుకోవాలి.
మొటిమలను నివారించడానికి మనం ఎంత ప్రయత్నించినా, ముఖంపై కనిపిస్తాయి. రాత్రంతా.. వాటిని అద్దంలో చూస్తూ.. ఓ యుద్ధమే జరుగుతుంది. మరుసటి రోజు మీకు ముఖ్యమైన రోజు అయినా లేదా మీరు పెద్ద ఈవెంట్‌కు హాజరు కావాల్సి ఉన్నా మొటిమలు(Acne) మీ మానసిక స్థితిని పూర్తిగా ప్రభావితం చేస్తాయి. ఒత్తిడి(Stress) నుండి అనారోగ్యకరమైన ఆహారం(Food) వరకు చర్మంపై ఉపయోగించే క్రీముల వరకు, మొటిమలకు అనేక కారణాలు ఉన్నాయి. అయితే నిద్రపోతున్నప్పుడు చేసే తప్పులు కూడా మెుటిమలకు కారణం అవుతాయి.
మనం నిద్రపోయే విధానం మన చర్మం(Skin) యొక్క స్థితిని ప్రభావితం చేస్తుంది. మొటిమలకు కారణమవుతుంది. మీ చర్మాన్ని జాగ్రత్తగా చూసుకోవడానికి రాత్రి ఉత్తమ సమయం. కొన్ని పొరపాట్లు మీ చర్మాన్ని పూర్తిగా దెబ్బతీస్తాయి. ఉదయాన్నే మొటిమలను కలిగిస్తాయి. ఈ కథనంలో మీరు నిద్రపోతున్నప్పుడు చేసే తప్పులు ఏమిటో తెలుసుకోండి.
దిండ్లను తరచుగా కడగడం, మార్చడం చాలా అవసరం. పిల్లోకేసులు మురికి, కాలుష్య కారకాలతో ఉంటాయి. సాధారణంగా దిండుపై ముఖాన్ని పెట్టుకుంటాం. ఫలితంగా, పిల్లో కేస్‌లో ఉండే బ్యాక్టీరియా(Bacteria) చర్మానికి వ్యాపించి మొటిమలను కలిగిస్తుంది. మొటిమలు రాకుండా ఉండాలంటే వారానికోసారి మీ పిల్లోకేస్‌ని మార్చుకోండి.
బయట తిరిగి తిరిగి వస్తాం. రాత్రిపూట పడుకునేందుకు సిద్ధం అవుతాం. కానీ అసలు విషయం మాత్రం మరిచిపోతాం. మేకప్(Make Up) తొలగించకుండా నిద్రపోతాం. ఇదే అసలు సమస్య.. చర్మానికి హాని కలుగుతుంది. రాత్రంతా మేకప్ అలానే ఉంటే.. రంధ్రాలు మూసుకుపోయి మొటిమలు ఏర్పడతాయి. మీరు ఎంత అలసిపోయినా మేకప్‌ను శుభ్రం చేసి పడుకోవాలి.
ఇది కాస్త వింతగా అనిపించవచ్చు.. కానీ బోర్లా పడుకోవడం వలన కూడా మొటిమలు వస్తాయి. ఈ స్థితిలో నిద్రిస్తున్నప్పుడు, మీ చర్మం(Skin) నేరుగా పిల్లోకేస్‌తో సంబంధం కలిగి ఉంటుంది. రాత్రంతా మీ చర్మం, పిల్లోకేస్ కు అతుక్కొనే ఉంటుంది. ఇది కూడా మెుటిమలకు కారణం అవుతుంది. మీరు మొటిమలను నివారించాలనుకుంటే, తేమతో కూడిన వాతావరణంలో నిద్రపోకండి.
ఇక కొంతమందికి రాత్రిపూట హెయిర్ ఆయిల్(hair oil) పెట్టుకుని పడుకోవటం అలవాటు. తెల్లారేసరికి జుట్టు మెరిసిపోతుందని అనుకుంటారు. అయితే మీ చర్మంపై దుష్ప్రభావాలను కలిగిస్తుంది. జిడ్డు చర్మం(Oily Skin) ఉన్నవారు రాత్రిపూట హెయిర్ ఆయిల్ రాసుకుని నిద్రపోకూడదు. రాత్రంతా నూనె ముఖం మీదకు వస్తుంది. అదనపు నూనె చర్మంపై మొటిమలను కలిగిస్తుంది.
కొంతమంది.. పడుకునే ముందు ఫేస్ వాష్(Face Wash) చేసుకుని వస్తారు. ఏదో ఒక టవల్ తో ముఖం మీద రుద్దుతారు. ఇది కూడా మెుటిమలకు కారణం అవుతుంది. మొటిమలు ఏర్పడకుండా ఉండటానికి తరచుగా టవల్ లేదా వాష్‌క్లాత్‌లను శుభ్రం చేయాలి. ఎందుకంటే వాటి మీద బ్యాక్టీరియా ఉంటుంది.