capsicum paneer curry: పనీర్ క్యాప్సికం గ్రేవీ కర్రీ.. చపాతీలోకి అదిరిపోతుంది..
capsicum paneer curry: పనీర్ క్యాప్సికం కర్రీ సులభంగా, రుచిగా ఎలా చేసుకోవాలో పక్కా కొలతలతో సహా చూసేయండి.
capsicum paneer recipe (bing)
మధ్యాహ్నం పూట చపాతీలోకి, అన్నంలోకి రుచిగా ఉండే పనీర్ క్యాప్సికం ఒకసారి ప్రయత్నించి చూడండి. 20 నిమిషాల్లో ఈ కర్రీ రెడీ అయిపోతుంది. పనీర్, క్యాప్సికం ఉంటే చాలు. మిగతా అన్ని పదార్థాలు దాదాపు ఇంట్లో ఉండేవే. ఈ కర్రీని బటర్ లేదా నూనె వాడి చేసుకోవచ్చు.
కావాల్సిన పదార్థాలు:
100 గ్రాముల పనీర్
2 క్యాప్సికం పెద్దవి
2 టమాటాలు
రెండు స్పూన్ల జీడిపప్పు
1 ఉల్లిపాయ పెద్దది
అర అంగుళం దాల్చిన చెక్క
2 లవంగాలు
2 యాలకులు
1 బిర్యానీ ఆకు
చిన్న అల్లం ముక్క
1 చెంచా గరం మసాలా పొడి
1 చెంచా కారం
1 చెంచా ధనియాల పొడి
1 చెంచా జీలకర్ర పొడి
కొద్దిగా కసూరీ మేతీ
సగం టీస్పూన్ పసుపు
3 టేబుల్ స్పూన్ల నూనె
కొద్దిగా కొత్తిమీర
తయారీ విధానం:
- ముందుగా మిక్సీలో టమాటా ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, బిర్యానీ ఆకు, యాలకులు, దాల్చిన చెక్క, లవంగాలు, అల్లం ముక్క, జీడిపప్పు వేసుకుని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి
- కడాయిలో నూనె వేసుకుని కొంచెం వేడి కాగానే కారం వేసుకోవాలి. నూనెలో కారం కలిసిపోయేలా కలిపి మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని వేసుకోవాలి.
- అయిదు నిమిషాల పాటు నూనె పైకి తేలే వరకు ఈ మిశ్రమాన్ని కలుపుతూ ఉండాలి. నూనె పైకి తేలితే పచ్చివాసన పోయినట్లే. ఇపుడు ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా, పసుపు, ఉప్పు వేసుకోవాలి. బాగా కలుపుకోవాలి.
- ఇందులో అరగ్లాసు నీళ్లు పోసుకుని బాగా కలుపుకోండి. రెండు నిమిషాలు ఉడికాక కాస్త పెద్దగా తరుగుకున్న పచ్చి క్యాప్సికం ముక్కల్ని వేసేసుకోండి.
- క్యాప్సికం ముక్కలు మగ్గిపోతాయి. దీంట్లో పనీర్ ముక్కలు కూడా వేసుకుని రెండు నిమిషాలయ్యాక కసూరీ మేతీ, కొత్తిమీర వేసుకుని దించుకుంటే చాలు. ఇది చపాతీల్లోకి, అన్నంలోకి కూడా తినొచ్చు.
టాపిక్