AC Room Side Effects : ఏసీ రూములో పగలు, రాత్రి ఉంటే తెలియకుండానే ప్రాణాంతక వ్యాధులు-staying day and night in ac room causes so many deadly diseases ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Ac Room Side Effects : ఏసీ రూములో పగలు, రాత్రి ఉంటే తెలియకుండానే ప్రాణాంతక వ్యాధులు

AC Room Side Effects : ఏసీ రూములో పగలు, రాత్రి ఉంటే తెలియకుండానే ప్రాణాంతక వ్యాధులు

Anand Sai HT Telugu
May 06, 2024 02:00 PM IST

AC Room Side Effects In Telugu : ఈ వేసవిలో ఎండ వేడికి చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది. దీనితో చాలా మంది ఏసీని ఆశ్రయిస్తారు. కానీ పగలు రాత్రి తేడా లేకుండా ఏసీ గదుల్లో ఉంటే సమస్యలు ఎదుర్కోవలసి వస్తుంది.

ఏసీ రూమ్ సైడ్ ఎఫెక్ట్స్
ఏసీ రూమ్ సైడ్ ఎఫెక్ట్స్

ఇప్పటికే వేడి వాతావరణంలో జనాలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. బయటకు వెళ్లగానే ఎండతో సూరీడు చుక్కలు చూపిస్తున్నాడు. ఎక్కువ మంది ప్రజలు తీవ్రమైన వేడి నుండి తప్పించుకోవడానికి వివిధ మార్గాలను చూస్తుంటారు. ప్రస్తుతం వేసవిలో అందరూ ఏసీలో ఉండాలని కోరుకుంటారు. ఇంట్లో ఏసీ ఉండడం ఇప్పుడు అదనపు ప్రయోజనం. అలాగే ఆఫీస్‌లోనూ ఏసీ ఉంటుంది. ఇలా ఇంట్లో, ఆఫీసులో పగలు, రాత్రి ఏసీలో ఉంటే మీరు అనేక ఆరోగ్య సమస్యలను ఎదుర్కోంటారు.

ఈ సౌకర్యం మీకు హానికరం అని తెలుసా? ఎక్కువ సేపు ఏసీలో ఉంటే అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయి. రోజంతా ఏసీలో ఉండడం వల్ల మన శరీరంపై దుష్ఫలితాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. దీర్ఘకాలం తీవ్రమైన వ్యాధికి కారణం కావచ్చు.

ఆధునిక జీవితంలో మన సౌకర్యానికి AC ప్రసిద్ధి చెందింది. ఈ రోజుల్లో ఏసీ లేని జీవితాన్ని ఊహించుకోవడం చాలా మందికి కొంత కష్టంగా ఉంటుంది. అయితే మీకు తెలియకుండానే ఈ ఏసీ వల్ల ఎన్ని ఆరోగ్య ప్రమాదాలు జరుగుతాయో తెలుసా? వేడి నుండి తప్పించుకోవడానికి రోజంతా AC గాలిలో గడిపే వారు తలనొప్పి, దగ్గు, వికారం, పొడి చర్మం వంటి అనేక ఇతర సమస్యలతో బాధపడవచ్చు. ఏసీ గాలికి ఎక్కువగా గురికావడం వల్ల ఎలాంటి ఆరోగ్య నష్టం కలుగుతుందో తెలుసుకుందాం..

డీహైడ్రేషన్

ఎక్కువసేపు AC గాలికి గురికావడం వల్ల వ్యక్తి డీహైడ్రేషన్‌కు గురవుతాడు. ఏసీ గాలిలో ఎక్కువ సేపు కూర్చుంటే దాహం తీరదు. దీని వల్ల శరీరంలో నీటి కొరత ఏర్పడవచ్చు. శరీరంలో నీరు లేకపోవడం వల్ల డీహైడ్రేషన్‌కు దారితీస్తుంది. ఇది తలనొప్పి, మైగ్రేన్‌లకు దారితీస్తుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి.

మెదడు సమస్యలు

AC ఉష్ణోగ్రత తగ్గినప్పుడు, మెదడు కణాలు తగ్గిపోతాయి. దీని కారణంగా మెదడు సామర్థ్యం, పనితీరు దెబ్బతింటుంది. ఇది మాత్రమే కాదు, మీరు తలనొప్పితో పాటు నిరంతరం మైకంతో బాధపడవచ్చు.

చర్మ సమస్యలు

ఎక్కువసేపు AC గాలికి గురికావడం వల్ల శరీరంలో ఉండే తేమ పోతుంది. దీని వల్ల చర్మం పొడిగా, పగుళ్లు ఏర్పడి ముడతలు పడతాయి. ముడతలు, సన్నని గీతలు కనిపిస్తాయి. వృద్ధాప్య ప్రక్రియ వేగవంతం అవుతుంది.

శ్వాసకోశ సమస్యలు

శ్వాసకోశ సమస్యలు ఉన్నవారు ఏసీలో ఉంటే జాగ్రత్త వహించాలి. ఎందుకంటే ఎక్కువ సేపు ఏసీలో ఉండడం వల్ల చాలా మందికి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది లేదా దగ్గు వస్తుంది. అలాగే గొంతు పొడిబారడం, కళ్లు పొడిబారడం వంటి సమస్యలు కూడా రావచ్చు. ముందుగా జాగ్రత్తగా ఉండండి.

కీళ్ల నొప్పులు

ఏసీ గాలిలో ఎక్కువ సేపు ఉండడం వల్ల బాడీ పెయిన్‌తో పాటు కీళ్ల నొప్పులు కూడా వస్తాయి. చల్లటి గాలి శరీర నొప్పులు, కీళ్ళు, వెన్ను నొప్పికి కారణమవుతుంది. ఒక అధ్యయనం ప్రకారం, కీళ్ల నొప్పులతో బాధపడేవారు ఎక్కువసేపు ఏసీలో ఉంటే నొప్పుల సమస్య పెరుగుతుంది.

అందుకే ఏ కాలంలో అయినా వేసవిలో ఎక్కువగా ఉండకూడదు. ఏసీ అనేది కేవలం కాసేపు చల్లదనాన్ని ఇచ్చేదిగా ఉండాలి. హాయిగా ఉంది కదా అని దానిలోనే ఉండకూడదు. అలా చేస్తే సమస్యలు వస్తాయి. వేసవిలో ఇంట్లో చల్లగా ఉండేందుకు సహజ మార్గాలను వెతకాలి. అప్పుడే మీ ఆరోగ్యం కూడా బాగుంటుంది.

WhatsApp channel