Happy krishnashtami: కృష్ణాష్టమి శుభాకాంక్షలు ఇలా చెప్పేయండి, మెసేజ్‌లు, ఫొటోలు, వాట్సాప్ స్టేటస్‌లు మీకోసం-sri krishnashtami festival wishes photos and whatsapp status messages ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Happy Krishnashtami: కృష్ణాష్టమి శుభాకాంక్షలు ఇలా చెప్పేయండి, మెసేజ్‌లు, ఫొటోలు, వాట్సాప్ స్టేటస్‌లు మీకోసం

Happy krishnashtami: కృష్ణాష్టమి శుభాకాంక్షలు ఇలా చెప్పేయండి, మెసేజ్‌లు, ఫొటోలు, వాట్సాప్ స్టేటస్‌లు మీకోసం

Koutik Pranaya Sree HT Telugu
Aug 25, 2024 04:30 PM IST

Happy Janmashtami 2024: కృష్ణ జన్మాష్టమి సందర్భంగా శుభాకాంక్షలు, చిత్రాలు, వాట్సాప్, ఫేస్బుక్ స్టేటస్, సందేశాలు.. మరెన్నో మీ స్నేహితులకు పంపండి. వాళ్ల పండగను ప్రత్యేకం చేయండి.

కృష్ణాష్టమి శుభాకాంక్షల మెసేజ్‌లు, ఫొటోలు
కృష్ణాష్టమి శుభాకాంక్షల మెసేజ్‌లు, ఫొటోలు (Freepik)

ఆగస్టు 26న కృష్ణ జన్మాష్టమి పర్వదినం. ఈ ఏడాది శ్రీకృష్ణుడి 5251వ జయంతిని పురస్కరించుకుని ఆయనకు భక్తులు బ్రహ్మరథం పట్టనున్నారు. ఈ ప్రత్యేక పర్వదినాన మీ స్నేహితులకు, కృష్ణ భక్తులకు, వారి కుటుంబాలకు శుభాకాంక్షలు తెలపండి. శ్రీకృష్ణుని చిత్రాలు, శుభాకాంక్షలు, ఎస్ఎంఎస్లు, వాట్సప్, ఫేస్బుక్ స్టేటస్ సందేశాల మెసేజీలను స్నేహితులతో పంచుకోండి.

ఆగస్టు 26 న శ్రీ కృష్ణ జన్మాష్టమి
ఆగస్టు 26 న శ్రీ కృష్ణ జన్మాష్టమి (Freepik)

కృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు:

ఈ జన్మాష్టమి స్ఫూర్తి మీ జీవితంలో ప్రేమ, ఆనందాల్ని తీసుకురావాలని కోరుకుంటున్నాను. మీకు, మీ కుటుంబ సభ్యులకు కృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు.

కృష్ణుని రూపం మన హృదయాల్లో కొలువై ఉన్నంత కాలం భయాందోళనలకు తావులేదు. ఆయన ఆశీస్సులు మీమీద ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ జన్మాష్టమి శుభాకాంక్షలు!

శ్రీకృష్ణుని ఆశీస్సులు మీకు, మీ కుటుంబానికి ఎల్లప్పుడూ ఉండాలి. కృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు.

శ్రీకృష్ణుని ధైర్య సాహసాలు ప్రతి సమస్యను ఎదుర్కోవడానికి మీకు ప్రేరణనివ్వాలి. జై శ్రీ కృష్ణ!

కృష్ణాష్టమినే గోకులష్టమి అంటారు
కృష్ణాష్టమినే గోకులష్టమి అంటారు (Freepik)

బాల గోపాలుడి కొంటె చేష్టలు మీ హృదయాన్ని నవ్వుతో నింపాలి. అతని అమాయకత్వం మీ జీవితాన్ని స్వచ్ఛతతో నింపాలి. కృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు.

శ్రీకృష్ణుని వేణుగాణం మీ జీవితంలోకి ప్రేమ మాధుర్యాన్ని ఆహ్వానించాలి. కృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు!

ఈ జన్మాష్టమి రోజున శ్రీకృష్ణుడు మీకు, మీ కుటుంబానికి శాంతి, సంతోషాలను ప్రసాదించాలని కోరుకుంటున్నాను. కృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు!

ఈ జన్మాష్టమి మీకు ప్రేమ, శాంతి, శ్రేయస్సును ప్రసాదించాలని కోరుకుంటున్నాను. మీకు, మీ కుటుంబానికి పవిత్రమైన జన్మాష్టమి శుభాకాంక్షలు!

శ్రీ కృష్ణుని బోధనలతో మీకు మనోధైర్యం లభించాలని, జీవితంలో ఎదురయ్యే సవాళ్లను అధిగమించే ధైర్యాన్ని పొందాలని ఆకాంక్షిస్తున్నాను.

హ్యాపీ కృష్ణాష్టమి 2024
హ్యాపీ కృష్ణాష్టమి 2024 (Freepik)

భగవద్గీతలోని రెండవ అధ్యాయంలో శ్రీకృష్ణ భగవానుడు సమతుల్య మానసిక స్థితి, మానసిక సంసిద్ధత గురించి మాట్లాడే సందేశం కనిపిస్తుంది. హరే కృష్ణ హరే కృష్ణ... కృష్ణ కృష్ణ హరే హరే.. మీకు కృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు.

తన అల్లరి చేష్టలతో అందరినీ మంత్రముగ్ధులను చేసే శ్రీకృష్ణుని జన్మదినాన్ని ఆనందంగా జరుపుకోండి. హ్యాపీ కృష్ణ జన్మాష్టమి!

జై శ్రీ కృష్ణ, జై శ్రీ రాధే. కృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు.

ఈ పవిత్రమైన జన్మాష్టమి సందర్భంగా భగవంతుని దివ్య కృప మీకు, మీ కుటుంబానికి ఉండాలని కోరుకుంటున్నాను. జన్మాష్టమి శుభాకాంక్షలు!

ఆ నీలమేఘశ్యాముడు ఎల్లప్పుడూ మీకు, మీ కుటుంబానికి ఆనందం, ఆరోగ్యం, శ్రేయస్సును ప్రసాదించాలని కోరుకుంటున్నాను.

శ్రీ కృష్ట జన్మాష్టమి మెసేజ్‌లు
శ్రీ కృష్ట జన్మాష్టమి మెసేజ్‌లు (Freepik)

హ్యాపీ కృష్ణ జన్మాష్టమి. కురుక్షేత్ర యుద్ధంలో అర్జునుడికి దారి చూపిన ఆ శ్రీకృష్ణుడు మీకూ సన్మార్గం చూపాలి.

"మీరు మీ లక్ష్యాన్ని సాధించడంలో విఫలమైతే, వ్యూహాన్ని మార్చండి, లక్ష్యాన్ని కాదు." - శ్రీకృష్ణుడు, భగవద్గీత.

"మీరు కృష్ణుడిని కృష్ణుడిగా కాదు, అతనిలోని ఆత్మను పూజించాలి." - స్వామి వివేకానంద.

శ్రీకృష్ణునిపై నమ్మకం మనల్ని చెడు భూమి నుండి చైతన్య భూమికి, అంతకు మించిన ఉత్తమ స్థితికి తీసుకెళుతుంది. కృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు.