Spicy Tomato Omelette: స్పైసీగా టమోటో ఆమ్లెట్ ఇలా చేసుకోండి, బెస్ట్ బ్రేక్ ఫాస్ట్ రెసిపీ ఇది
Spicy Tomato Omelette: ఆమ్లెట్ అంటేనే నోరూరిపోతుంది. ఇంకా అందులో స్పైసీగా అంటే చాలామందికి దీన్ని చదువుతుంటేనే తినేయాలనిపిస్తుంది. ఈ స్పైసీ టమోటో ఆమ్లెట్ ఎలా చేయాలో చూద్దాం.
Spicy Tomato Omelette: ఉదయం పూట ప్రోటీన్ నిండిన బ్రేక్ ఫాస్ట్‌ని తినమని చెబుతారు వైద్యులు. అలా ప్రోటీన్ ఆహారాన్ని తినడం వల్ల త్వరగా ఆకలి వేయదు. ఆ రోజంతా చురుకుగా, ఉత్సాహంగా ఉంటారు. బ్రేక్ ఫాస్ట్‌లో పోషకాలను నిండిప ఆహారం తింటే ఆరోగ్యానికి కూడా మంచిది. అంతేకాదు బ్రేక్ ఫాస్ట్ ఎంత గట్టిగా తింటే మధ్యాహ్నం, రాత్రి తినే ఆహారాలు తక్కువగా తినవచ్చు. స్పైసీ టమోటో ఆమ్లెట్ బెస్ట్ బ్రేక్ ఫాస్ట్ రెసిపీ అని చెప్పుకోవచ్చు. దీన్ని స్పైసీగా వండుకుంటే టేస్టీగా ఉంటుంది.
స్పైసీ టమోటో ఆమ్లెట్ రెసిపీకి కావలసిన పదార్థాలు
టమోటో - ఒకటి
ఉల్లిపాయ - ఒకటి
పచ్చిమిర్చి - ఒకటి
కొత్తిమీర తరుగు - ఒక స్పూను
పసుపు - చిటికెడు
మిరియాలపొడి - చిటికెడు
గరం మసాలా - చిటికెడు
ఉప్పు - రుచికి సరిపడా
నూనె - సరిపడినంత
గుడ్లు - రెండు
స్పైసీ టమాటో ఆమ్లెట్ రెసిపీ
1. ఒక గిన్నెలో గుడ్లను కొట్టి వేయాలి. వాటిని బాగా గిలక్కొట్టుకోవాలి.
2. తరువాత ఉల్లిపాయలు, టమోటో, కొత్తిమీర, పచ్చిమిర్చి చాలా సన్నగా తరిగి ఆ గుడ్లలో వేయాలి.
3. రుచికి సరిపడా ఉప్పును వేసుకోవాలి.
4. అలాగే పసుపు, గరం మసాలా, మిరియాల పొడి వేసి బాగా కలుపుకోవాలి.
5. ఇప్పుడు స్టవ్ మీద పెనం పెట్టి కాస్త ఆయిల్ రాయాలి.
6. ఈ మిశ్రమాన్ని ఆమ్లెట్ లాగా వేసుకోవాలి.
7. రెండు వైపులా బంగారు రంగు వచ్చేవరకు కాల్చుకోవాలి.
8. అంతే స్పైసీ టమోటో ఆమ్లెట్ రెడీ అయినట్టే.
9. రెండు గుడ్లు వేసుకుంటే చాలు.. పొట్ట నిండి పోతుంది.
10. కనీసం నాలుగైదు గంటల సేపు ఆకలి వేయకుండా ఉంటుంది.
11. పిల్లలకు కూడా ఇది బెస్ట్ బ్రేక్ ఫాస్ట్ రెసిపీ అని చెప్పుకోవచ్చు.
12. ముఖ్యంగా బరువు తగ్గాలనుకున్నవారు ఇలా స్పైసీ టమోటో ఆమ్లెట్లు తినడం వల్ల ఇతర ఆహారాలు తినకుండా ఉంటారు. దీనివల్ల బరువు తగ్గడం సులువుగా మారుతుంది.
టమోటోలు, ఉల్లిపాయలు, గుడ్లు... ఇవన్నీ మన ఆరోగ్యానికి మేలే చేస్తాయి. టమోటాలు తినడం వల్ల లైకోపీన్ శరీరానికి అందుతుంది. ఇది క్యాన్సర్ రాకుండా అడ్డుకుంటుంది. అలాగే ఉల్లిపాయ చేసే మేలు ఇంతా అంతా కాదు. కోడిగుడ్డుని సంపూర్ణ ఆహారంగా భావిస్తారు. దీనిలో మన శరీరానికి అవసరమైన అన్ని అమైనో ఆమ్లాలు ఉంటాయి. ముఖ్యంగా ప్రోటీన్ పుష్కలంగా ఉంటుంది. బ్రేక్ ఫాస్ట్‌లో గుడ్డుతో చేసిన ఆహారాలు తినడం చాలా ఆరోగ్యం. ఇది బెస్ట్ బ్రేక్ ఫాస్ట్ రెసిపీయే కాదు లంచ్ బాక్స్ లో కూడా దీన్ని పెట్టుకోవచ్చు.
బరువు తగ్గాలనుకుంటున్న వారు రాత్రిపూట... రాత్రి భోజనం మానేసి 7 గంటలకు ఈ ఆమ్లెట్ తినడం అలవాటు చేసుకోవాలి. ఈ ఆమ్లెట్ తిన్నాక... నిద్రపోవడానికి కనీసం రెండు మూడు గంటలు గ్యాప్ ఉండేలా చేసుకోవాలి. ఇలా అయితే బరువు తగ్గడం కూడా సులువుగా మారుతుంది.
టాపిక్