Bacteria With Smart Watch : స్మార్ట్ వాచ్ వాడుతున్నారా? శరీరంలోకి ప్రమాదకరమైన బ్యాక్టీరియా
Smart Watches Disadvantages : ఈ కాలంలో చేతులకు స్మార్ట్ వాచ్ పెట్టుకోవడం ఓ ట్రెండ్. రోజులో ఎన్ని అడుగులు వేశామో.. కూడా అందులోనే లెక్కించుకుంటారు. ఇది పెట్టుకుంటే వచ్చే ఇబ్బందుల గురించి ఎప్పుడైనా ఆలోచించారా?
రోజూ దాదాపు పదివేల బ్యాక్టీరియాలు మన శరీరంలోకి ప్రవేశిస్తాయి. ఏదో ఒకటి ముట్టుకుంటాం, ఏదో తింటాం.. ఇలా ఏ వైపు నుండి అయినా బ్యాక్టీరియాతో సంబంధం కలిగి ఉంటాం. తద్వారా మన శరీరంలో బ్యాక్టీరియా పేరుకుపోతుంది. మన శరీరంలో ఉండే రోగనిరోధక శక్తి, మంచి బ్యాక్టీరియా అటువంటి బ్యాక్టీరియాతో పోరాడుతుంది.
అన్ని బాక్టీరియాలు మన శరీరాన్ని అనారోగ్యానికి గురిచేయవు. కానీ కొన్ని బాక్టీరియా మనకు అనేక రకాల హాని కలిగిస్తాయి. మనం ధరించే స్మార్ట్ వాచ్, మొబైల్ ఫోన్ వల్ల బ్యాక్టీరియాలు మన శరీరంలో చేరుతున్నాయని అధ్యయనాలు చెబుతున్నాయి.
మన శరీరం ట్రిలియన్ల కొద్దీ బ్యాక్టీరియాలకు నిలయం. శరీరంలో మంచి, చెడు బాక్టీరియా రెండింటినీ మనం కలిగి ఉంటాం. మన శరీర రోగనిరోధక వ్యవస్థ కారణంగా మంచి బ్యాక్టీరియా చెడు కంటే ఎక్కువగా ఉంటుంది. రోగనిరోధక వ్యవస్థ హానికరమైన వైరస్, బాక్టీరియా, ఇతర సూక్ష్మజీవుల నుండి మనలను రక్షిస్తుంది. రోగనిరోధక వ్యవస్థ తగ్గింతే.. అనేక రకాల అనారోగ్యాలు, వ్యాధులకు కారణం కావచ్చు.
ఫ్లోరిడాలో ఇటీవల జరిగిన ఒక అధ్యయనం ప్రకారం మొబైల్ ఫోన్‌లు, స్మార్ట్‌వాచ్‌లలో హానికరమైన బ్యాక్టీరియా ఉంటుందని తేలింది. అవి మనకు తెలియకుండానే మన శరీరంలోకి ప్రవేశిస్తున్నాయి. ఫిట్‌నెస్ పేరుతో ప్రపంచవ్యాప్తంగా స్మార్ట్‌వాచ్‌లను ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. వాటి ఉపయోగం కూడా విస్తృతంగా ఉంది. ఈ స్మార్ట్‌వాచ్‌ల నుంచి బ్యాక్టీరియా మన శరీరంలోకి చేరుతోంది.
మనలో చాలా మంది సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు స్మార్ట్ వాచ్ ధరిస్తారు. ఈ వాచీలు ఎండ, దుమ్ము, వానలను తట్టుకుని ఉంటాయి. మనం పబ్లిక్ టాయిలెట్‌కి వెళ్లినా, ఇంట్లో బాత్‌రూమ్‌కి వెళ్లినా, అవి చేతికే ఉంటాయి. ఇది మనకు తెలియకుండానే బ్యాక్టీరియాకు ఆవాసంగా మారుతుంది. మనం స్మార్ట్ వాచ్ కడిగేందుకు కూడా పెద్దగా ఇంట్రస్ట్ చూపించం. అందుకే వీటి ద్వారా ముప్పు పెరుగుతూనే ఉంది.
స్మార్ట్‌వాచ్‌లు సాల్మొనెల్లా,, స్టెఫిలోకాకస్, సూడోమోనాస్, ఎస్చెరిచియా కోలి వంటి వ్యాధికారక బాక్టీరియాలకు సంతానోత్పత్తి ప్రదేశంగా మారాయి. ఈ పరికరాల్లో కనిపించే బ్యాక్టీరియా సంఖ్య ఉపయోగించే రిస్ట్‌బ్యాండ్‌ల రకాన్ని బట్టి ఉంటుందని అధ్యయనం మరింత స్పష్టం చేసింది. రబ్బరు, ప్లాస్టిక్ బ్యాండ్లు ఎక్కువ బ్యాక్టీరియాను కలిగి ఉంటాయి. వీటి ద్వారా వివిధ వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. రోగనిరోధక శక్తి ఉన్నవారు జాగ్రత్తగా ఉండాలి. స్మార్ట్‌వాచ్ వినియోగదారులకే కాదు.. వారి ద్వారా ఈ బ్యాక్టీరియా ఇతరులకు వ్యాప్తి చేయవచ్చు.
అందుకే మెటాలిక్ రిస్ట్‌బ్యాండ్‌తో వచ్చే వాచీలను ఎంచుకోండి. రబ్బరు, ప్లాస్టిక్ బ్యాండ్లకు దూరంగా ఉండటం మంచిది. సాధారణ స్మార్ట్‌వాచ్ ధరిస్తే వాటిని ప్రతి మూడు నెలలకు మార్చండి. వాష్‌రూమ్‌కి వెళ్లేటప్పుడు, మీ స్మార్ట్‌వాచ్‌ని తీసివేయడం మంచిది. వాచ్ తీసి మీ చేతులను మణికట్టు దగ్గర కూడా శుభ్రం చేసుకోవాలి.