Sitting In Toilet : టాయిలెట్‌లో 10 నిమిషాల కంటే ఎక్కువ ఎందుకు కూర్చోకూడదు?-why should not sit more than 10 minutes in toilet you need to know ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Sitting In Toilet : టాయిలెట్‌లో 10 నిమిషాల కంటే ఎక్కువ ఎందుకు కూర్చోకూడదు?

Sitting In Toilet : టాయిలెట్‌లో 10 నిమిషాల కంటే ఎక్కువ ఎందుకు కూర్చోకూడదు?

HT Telugu Desk HT Telugu
Sep 26, 2023 11:00 AM IST

Sitting In Toilet : కొందరికి టాయిలెట్ ప్రశాంతమైన ప్లేసు. నిజానికి కొంతమందికి గొప్ప గొప్ప ఆలోచనలు అక్కడే వస్తాయి. అందుకే టాయిలెట్ వెళ్లిన కొందరు అస్సలు త్వరగా బయటకు రారు. ఇలా టాయిలెట్లో ఎక్కువసేపు కూర్చొంటే ఏమవుతుంది?

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం (unsplash)

కొందరు టాయిలెట్‌కు వెళ్లి అరగంట వరకు టాయిలెట్ నుండి బయటకు రారు. ఇక బయట ఉన్నవాళ్లకు మాత్రం వారు టాయిలెట్‌పై నిద్రిస్తున్నారా? అనే సందేహం వస్తుంది. సహజంగా అందరికీ ఇలాగే అనిపిస్తుంది. కొంతమందికి టాయిలెట్‌కి వెళ్లేటప్పుడు మొబైల్ తీసుకెళ్లే అలవాటు ఉంటుంది. అలాంటి వారు టాయిలెట్‌లో ఎక్కువ సేపు కూర్చుంటారు. మీకు అలాంటి అలవాటు ఉంటే ఈరోజే మానేయండి, లేకపోతే మీ ఆరోగ్యానికి చాలా ప్రమాదం.

కొంతమందేమో టాయిలెట్‌కు వెళ్లకూడదనుకోవడం చేస్తుంటారు. ఇలాంటి వారు టాయిలెట్‌ వెళ్లినప్పుడు ఎక్కువ సేపు కూర్చోంటారు. దీంతో మలవిసర్జన సమయంలో ఇబ్బంది పడడం వల్ల రక్తస్రావం జరుగుతుంది . ఇలా చేయడం వల్ల రక్తనాళాలు ఉబ్బి, పగిలి రక్తం కారుతుంది. మలవిసర్జన సమయంలో ఒత్తిడి చేయడం వల్ల ఫిలిస్ సమస్య వస్తుంది. మలవిసర్జన సమయంలో విపరీతమైన ఒత్తిడి కూడా హేమోరాయిడ్లకు ప్రధాన కారణం.

మీరు మలవిసర్జన చేయవలసి వచ్చినప్పుడు టాయిలెట్‌కు వెళ్లండి. మీకు అత్యవసరంగా అనిపించినప్పుడు టాయిలెట్‌కు వెళ్లాలి. ఎక్కువసేపు కూర్చోకుండా పని అయిపోయాక వచ్చేయాలి. రాకపోయినా మలవిసర్జనకు అనవసరంగా ఒత్తిడి చేయడం వల్ల ఆరోగ్య సమస్యలు వస్తాయి. అలాగే మలవిసర్జనకు వెళ్లేటప్పుడు ఫోన్‌ని తీసుకెళ్లకూడదు. ఫోన్ తీసుకోవడం ద్వారా కూడా ఎక్కువ సమయం తీసుకుంటారు. దీని కారణంగా మీరు టాయిలెట్‌లో ఎక్కువ సమయం గడుపుతారు.

10 నిమిషాలకంటే ఎక్కువ సేపు టాయిలెట్స్ లో కూర్చోంటే.. పైల్స్ సమస్యకు దారి తీస్తుంది. పాయువు లోపల రక్తనాళాలు ఎర్రబడి, ముద్దగా ఏర్పడినప్పుడు మూలశంక వ్యాధి వస్తుందని నిపుణులు చెబుతున్నారు. టాయిలెట్ మీద కూర్చొని న్యూస్ పేపర్ చదవడం, ఫోన్ చూడటం చేస్తే.. పురీషనాళంపై ప్రభావం పడుతుంది. ఎక్కువ సేపు అక్కడే కూర్చొంటే టాయిలెట్లలోని బ్యాక్టిరియా, సూక్ష్మక్రీములు మీ శరీరంపైకి ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది.

అత్యవసరమైనప్పుడు కచ్చితంగా టాయిలెట్‌కి వెళ్లండి.. ఆపుకోవద్దు. తద్వారా మీరు త్వరగా ముగించి టాయిలెట్ నుండి బయటపడవచ్చు. మలబద్ధకం వల్ల కూడా ఎక్కువ సేపు టాయిలెట్‌లో కూర్చోవాల్సి వస్తుంది. ఈ రకమైన సమస్యను నివారించడానికి, ఎక్కువ ఫైబర్ ఫుడ్ తినండి. నీళ్లు ఎక్కువగా తాగాలి.

Whats_app_banner