Hair oil at Night: రాత్రి పూట తలకు నూనె రాసి నిద్రపోతున్నారా? మొటిమలు వచ్చేస్తాయి జాగ్రత్త-sleeping with oil on your head at night beware of pimples ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Hair Oil At Night: రాత్రి పూట తలకు నూనె రాసి నిద్రపోతున్నారా? మొటిమలు వచ్చేస్తాయి జాగ్రత్త

Hair oil at Night: రాత్రి పూట తలకు నూనె రాసి నిద్రపోతున్నారా? మొటిమలు వచ్చేస్తాయి జాగ్రత్త

Haritha Chappa HT Telugu

Hair oil at Night: జుట్టుకు నూనె వల్ల నెత్తిమీద రక్తప్రసరణ పెరుగుతుంది. దీని వల్ల జుట్టు ఆరోగ్యంగా పెరుగుతుంది. హెయిర్ ఆయిల్ వల్ల ఎన్నో లాభాలు ఉన్నప్పటికీ… రాత్రిపూట జుట్టుకు నూనె పెట్టడం మాత్రం మంచిదికాదు. మొటిమలు వచ్చే సమస్యను పెంచేస్తుంది.

తలకు రాత్రిపూట నూనె ఎందుకు పెట్టకూడదు? (shutterstock)

జీవితంలో పెరుగుతున్న ఒత్తిడి, పోషకాహార లోపం జుట్టు రాలిపోవడానికి కారణమవుతున్నాయి. అటువంటి పరిస్థితిలో, జుట్టును సంరక్షించుకోవాల్సిన అవసరం ఉంది. ఇందుకోసం రెగ్యులర్‌ గా తలకు నూనెను పట్టిస్తారు. జుట్టుకు నూనె రాసుకోవడం మంచిదే కానీ దానికి సరైన సమయం ఉంది. కానీ జుట్టుకు నూనె రాసుకునే విధానం సరిగా లేకపోతే అది జుట్టుకు ప్రయోజనం చేకూర్చడానికి బదులు దెబ్బతీయడం ప్రారంభిస్తుంది.

జుట్టుకు నూనె రాసుకోవడం వల్ల జరిగే మేలు కూడా ఎక్కువే. జుట్టుకు పోషణనిచ్చి మెరిసేలా చేస్తుంది. అంతే కాదు, హెయిర్ ఆయిల్ నెత్తిమీద రక్త ప్రసరణను పెంచుతుంది. ఇది మంచి జుట్టు పెరుగుదలకు ప్రోత్సహిస్తుంది. హెయిర్ ఆయిల్ వల్ల ఎన్ని ప్రయోజనాలు ఉన్నప్పటికీ రాత్రిపూట జుట్టుకు నూనెను రాయడం వల్ల మాత్రం కొన్ని నష్టాలు ఉన్నాయి. జుట్టుతో పాటూ చర్మం కూడా డ్యామేజ్ అవ్వడం మొదలవుతుంది.

నెత్తి మీద మురికి చేరి…

రాత్రంతా జుట్టుకు నూనెతో పడుకోవడం వల్ల తల ఉపరితల రంధ్రాలు మూసుకుపోతాయి. ఈ కారణంగా వ్యక్తికి మూసుకుపోయిన రంధ్రాలతో సమస్యలు ప్రారంభమవుతాయి. తలపై వేలితో తేలికగా గీరడం, తలపై పేరుకుపోయిన మురికి గోళ్లలో కనిపించడం ప్రారంభమైతే, అది మూసుకుపోయిన రంధ్రాల ఫలితంగా ఏర్పడుతుందని అర్థం చేసుకోవాలి. ఈ సమస్యను నివారించడానికి రాత్రిపూట జుట్టుకు నూనెను రాయకూడదు.

చుండ్రు సమస్య పెరుగుతుంది

మీకు చుండ్రు సమస్యలు ఉంటే, రాత్రిపూట హెయిర్ ఆయిల్ అప్లై చేయకూడదు. ఇలా చేస్తే ఆయిల్ వల్ల చుండ్రుతో పాటు నెత్తిమీద ఎక్కువ మురికి పేరుకుపోతుంది, ఇది చుండ్రు సమస్యను కూడా పెంచుతుంది. ఈ సమస్య రాకుండా ఉండాలంటే జుట్టుకు హైడ్రేటింగ్ హెయిర్ మాస్క్ అప్లై చేయాలి.

జుట్టు రాలడం

మీ జుట్టు ఇప్పటికే రాలిపోతుంటే, రాత్రిపూట నూనె రాసుకోవడం వంటివి చేయవద్దు. వాస్తవానికి, జుట్టుకు నూనెను 12 గంటలకు మించి ఉంచడం వల్ల నెత్తిమీద మురికి పేరుకుపోతుంది. ఇది తలపై ఉన్న సహజ నూనెతో కలిపినప్పుడు జుట్టు మురిగికా మారుతుంది. నూనెను జుట్టుకు అప్లై చేయడం వల్ల దిండులు, పరుపులు మురికి పడతాయి. అలాంటప్పుడు హెయిర్ వాష్ కు అరగంట ముందు నూనె రాసుకుంటే జుట్టు రాలే సమస్య రాకుండా ఉంటుంది.

మొటిమలు

రాత్రిపూట జుట్టుకు నూనె రాయడం వల్ల చర్మ రంధ్రాలు మూసుకుపోతాయి. ఇలా మూసుకుపోవడం వల్ల మొటిమలు వచ్చే అవకావం ఉంది. ఇలాంటి మొటిమలను పోమేడ్ పింపుల్స్ అంటారు. కాబట్టి జుట్టుకు రాత్రిపూట నూనె పెట్టడం వల్ల చర్మం మొటిమలు వచ్చే అవకాశం పెరుగుతుంది. ఆ జిడ్డు ముఖానికి కూడా అంటుకుని చర్మ రంధ్రాలు మూసుకుపోయి మొటిమలు ఎక్కువ వస్తాయి.

తలకు నూనెను ఎక్కువ సేపు వదిలేయడం వల్ల జుట్టు రంగు మారడంతో పాటు చుండ్రు సమస్య పెరుగుతుంది. దీన్ని నివారించడానికి, జుట్టుకు నూనె రాసిన గంటలోపు తలస్నానం చేయాలి.

నిపుణుల అభిప్రాయం ప్రకారం, రాత్రిపూట జుట్టుకు నూనె వేయడానికి బదులుగా స్నానానికి అరగంట ముందు హెయిర్ ఆయిల్ వేసుకోవడం మంచిది. ఇలా చేయడం వల్ల జుట్టుకు పోషణ అందడంతో పాటు వెంట్రుకలు బాగా శుభ్రం అవుతాయి.