Manu Bhaker in saree: కేబీసీ కోసం చీరకట్టులో మెరిసిన మనుబాకర్, ఈ చీర ధర తెలుసా?-see stunning saree look of manu bhaker in kbc16 sets ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Manu Bhaker In Saree: కేబీసీ కోసం చీరకట్టులో మెరిసిన మనుబాకర్, ఈ చీర ధర తెలుసా?

Manu Bhaker in saree: కేబీసీ కోసం చీరకట్టులో మెరిసిన మనుబాకర్, ఈ చీర ధర తెలుసా?

Koutik Pranaya Sree HT Telugu
Aug 30, 2024 12:30 PM IST

Manu Bhaker in saree: 2024 పారిస్ ఒలింపిక్స్‌లో రెండు కాంస్య పతకాలు సాధించిన మను భాకర్ ఇటీవల కౌన్ బనేగా కరోడ్‌పతి సెట్స్ లో కనిపించారు. ఈ చీర ధర, లుక్ గురించి పూర్తి వివరాలు తెల్సుకోండి.

చీరకట్టులో మనుబాకర్
చీరకట్టులో మనుబాకర్ (HT photo/VarinderChawla)

కౌన్ బనేగా కరోడ్‌పతి సెట్స్‌లో మను భాకర్, అమన్ సెహ్రావత్ కనిపించారు. 2024 పారిస్ ఒలింపిక్స్లో రెండు కాంస్య పతకాలతో దేశం గర్వపడేలా చేసింది ఈ 22 ఏళ్ల అథ్లెట్ మను బాకర్. సాధారణంగా అథ్లెటిక్ లేదా క్యాజువల్ దుస్తుల్లో కనిపించే మను ఈ సందర్భంగా సంప్రదాయ చీరను ధరించి అందరినీ అబ్బురపరిచింది. ఆరు గజాల చీరలో ఆమె అందంగా కనిపించింది. చీరకట్టుతో తనలోని విభిన్న కోణాన్ని చూయించింది మను బాకర్. ఈ సొగసైన చీర లుక్‌ను డీకోడ్ చేద్దాం రండి.

మను భాకర్ చీర లుక్

మను చీర ఆకర్షణీయమైన క్రీం రంగులో ఉంది. దానిమీద ఫ్లోరల్ డిజైనింగ్ ఉంది. ఈ చీరను లేయర్డ్ ఫ్రిల్స్ తో డిజైన్ చేశారు. దాంతో సాధారణ చీరకట్టులోనే ట్రెండీగా కనిపించారామె. చీర అంచుకున్న ఎంబ్రాయిడరీ చీరకు మరింత మంచి లుక్ తీసుకొచ్చింది. సాంప్రదాయ చీరకట్టులాగా భుజం మీద పల్లు వేసుకున్నారు. జతగా క్లాసిక్ స్లీవ్ లెస్ బ్లవుజు వేసుకున్నారు. దీనిమీద ప్రింట్స్‌తో పాటూ, బంగారు వర్ణం వర్క్ డీటెలియింగ్ ఉంది. మొత్తం లుక్ అందం పెంచేసిందిది.

ఆమె చీర ధర ఎంత?

మీకు మను బాకర్ కట్టుకున్న చీర నచ్చే ఉంటుంది. దాని ధర వివరాలు తెల్సుకుని మీ బీరువాలో తెచ్చి పేట్టేసుకోవచ్చు. ఇది డిజైనర్ బ్రాండ్ గోపీ వైద్ డిజైన్ చేసిన చీర. దీని ధర రూ.58,500/-

మను బాకర్ చీర ధర
మను బాకర్ చీర ధర (www.elahe.in)

యాక్సెసరీలు:

యాక్సెసరీస్ కోసం మను బాకర్ డైమండ్ స్టడ్స్ ఎంచుకున్నారు. చీర లుక్ హైలెట్ అయ్యేలా తక్కువ ఆభరణాలు వేసుకున్నారామె. చేతికి బంగారు వాచీ పెట్టుకున్నారు. చాలా తక్కువ మేకప్ లుక్ తో న్యూడ్ ఐషాడో, మస్కారా వేసిన కనురెప్పలు, చాలా లైట్ గా బ్లష్ చేసిన బుగ్గలు, హైలైటర్, న్యూడ్ లిప్‌స్టిక్ తో ఆమె మేకప్ లుక్ పూర్తయ్యింది. సిగ లాగా జుట్టు కట్టుకుని హెయిర్ స్టైల్ పూర్తి చేశారు.

మను భాకర్ గురించి

మను భాకర్ ఒక భారతీయ స్పోర్ట్స్ షూటర్, ఒలింపిక్ పతక విజేత. ఆమె పారిస్‌లో జరిగిన 2024 ఒలింపిక్స్‌లో గొప్ప విజయాన్ని సాధించారు. మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్ లో ఒకటి కాక రెండు కాంస్య పతకాలు సాధించి, ఒలింపిక్ పతకం సాధించిన తొలి భారత మహిళా షూటర్ గా రికార్డు సృష్టించింది.