Festive saree drapes: పండగరోజు చీర ఇలా కట్టారంటే అందరి కళ్లు మీమీదే, ఈ ట్రెండీ టిప్స్‌తో మెరిసిపోవడం ఖాయం-how to drape saree in trendy way for ganesh chathurthi ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Festive Saree Drapes: పండగరోజు చీర ఇలా కట్టారంటే అందరి కళ్లు మీమీదే, ఈ ట్రెండీ టిప్స్‌తో మెరిసిపోవడం ఖాయం

Festive saree drapes: పండగరోజు చీర ఇలా కట్టారంటే అందరి కళ్లు మీమీదే, ఈ ట్రెండీ టిప్స్‌తో మెరిసిపోవడం ఖాయం

Koutik Pranaya Sree HT Telugu
Aug 25, 2024 06:30 AM IST

Festive saree drapes: పండగంటే ముస్తాబు అవ్వడానికి ముందుంటాం అమ్మాయిలం. వినాయక చవితి వచ్చేస్తోంది. ఈ రోజు మీకంటూ ప్రత్యేక లుక్ అటు ట్రెండీగా, సాంప్రదాయంగా ఉండేలనుకుంటే కొన్ని సారీ డ్రేపింగ్ ఐడియాలు తెల్సుకోండి. వాటిలో మీరు కొత్తగానూ, మరింత అందంగానూ మెరిసిపోతారు.

చీరకట్టు కొత్తగా చేసే టిప్స్
చీరకట్టు కొత్తగా చేసే టిప్స్

ఇటీవల నటి తాప్సీ తన రకరకాల చీరకట్టులతో పారిస్ లో అందరి దృష్టిని ఆకర్షించింది. సాదా చీరల్లోనే అయినా తన స్టైలింగ్‌తో ఎంత భిన్నంగా కనిపించిందో ఆమె. అటు ట్రెండీగానూ, ఇటు సాంప్రదాయంగానూ అనిపించాయి తాప్సి లుక్స్. పండగ సమయాల్లోనూ అమ్మాయిలు ఇలా డిఫరెంట్ సారీ లుక్స్ ట్రై చేయొచ్చు. ఇప్పుడు అనేక రకాల ట్రెండీ చీరకట్లు వచ్చేశాయ్.

చీరకట్టుకోవడం రాదా?

చీరకట్టడం రానివాళ్లకి వన్ మినట్ సారీలు ఎప్పటినుంచో ఉన్నాయి. ఇప్పుడవి మరింత అందుబాటులోకి వచ్చాయి. ఈ మధ్య సారీ డ్రెస్సులూ వచ్చేశాయి. మెడ నుంచి పాదాల దాకా ఉండే ఒక మ్యాక్సీ కుర్తా వేసుకుని దానికి జతగా వచ్చే దుపట్టా వేసుకుంటే అచ్చం చీర కట్టులాగే కనిపిస్తారు. అవసరం లేనప్పుడు దుపట్టా తీసేస్తే డ్రెస్ లాగా ఉంటాయవి. రెడీమేడ్ సారీ డ్రెస్సుల్లోనూ రకరకాల ఎంబ్రాయిడరీలున్న బ్లవులజుతో ట్రెండీ సారీలూ దొరుకుతున్నాయి. ఇవి ప్రయత్నించొచ్చు.

ట్రెండీ సారీ లుక్స్‌లో తాప్సీ
ట్రెండీ సారీ లుక్స్‌లో తాప్సీ (instagram)

చీర ఇలా ఎంచుకోండి:

కేవలం ట్రెండ్ విషయంలో మాత్రమే జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం లేదు. దీనితో పాటు కొన్ని విషయాలూ తెలియాలి. ఉదాహరణకు, మీకు ఏ రంగు సరిపోతుంది, ఏ చీర ఫ్యాబ్రిక్ మీకు నప్పుతుందో మీకు తెలియాలి. ఎరుపు, ఆకుపచ్చ, మజెంటా రంగులు ఎప్పుడూ ట్రెండ్ లో ఉంటాయి. ట్రెండీగా కనిపించాలనుకుంటే పేస్టెల్స్ రంగులు ఎంచుకోవచ్చు. సిల్క్, టస్సర్, వెల్వెట్, షిఫాన్, జార్జెట్ చీరలు చాలా ట్రెండీ లుక్ ఇస్తాయి. మీరు కాస్త లావుగా ఉంటే కాటన్, ఆర్గాంజా చీరలు పర్ఫెక్ట్ ఎంపికలు.

చీరకట్టు రకాలు

కాస్త భిన్నంగా ఉండాలంటే సంప్రదాయ పద్ధతుల్లోనే మహారాష్ట్ర వస్త్రధారణ, గుజరాతీ వస్త్రధారణ, బెంగాలీ చీరకట్టు రకాలుంటాయి. ఆధునిక పద్ధతుల్లో మెర్మైడ్, ముంతాజ్, బెల్టెడ్, కేప్ స్టైల్, బటర్ ఫ్లై లుక్ వంటి చీరలు ట్రెండ్ లో ఉన్నాయి. వాటిని ఆన్లైన్లో ఎలా కట్టాలో చెప్పే వీడియోలు కూడా దొరుకుతాయి.

స్టైలింగ్

చీరకు కొత్త స్టైల్ ఇవ్వడానికి డిఫరెంట్ బ్లౌజులు, యాక్ససరీలను వాడాలి. బోట్ నెక్, కాలర్, క్రాప్ టాప్ ఉన్న బ్లౌజులు చాలా స్టైలిష్ గా కనిపిస్తాయి. మీరు సన్నగా ఉంటే చీరతో పాటూ బెల్టు పెట్టుకుంటే చక్కగా కనిపిస్తారు. ఇవే కాకుండా సాధారణ బ్లౌజ్ కు డిఫరెంట్ లుక్ ఇచ్చేందుకు లేసులు, ముత్యాలు తదితర యాక్సెసరీలు కూడా జత చేశారంటే కొత్త లుక్ మీ ముందుంటుంది. చీర కట్టులోనే ఆధునికంగా, సాంప్రదాయంగానూ కనిపించొచ్చు.