Ambani's fashion: వజ్రాలే బటన్స్‌‌గా అనంత్ అంబానీ కుర్తా, లగ్జరీ నగల్లో అత్తాకోడళ్లు.. వినాయక చవితి లుక్ వివరాలివే-see diamond jewels of ananth ambani neetha radhika looks on ganesh chathurthi ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Ambani's Fashion: వజ్రాలే బటన్స్‌‌గా అనంత్ అంబానీ కుర్తా, లగ్జరీ నగల్లో అత్తాకోడళ్లు.. వినాయక చవితి లుక్ వివరాలివే

Ambani's fashion: వజ్రాలే బటన్స్‌‌గా అనంత్ అంబానీ కుర్తా, లగ్జరీ నగల్లో అత్తాకోడళ్లు.. వినాయక చవితి లుక్ వివరాలివే

Koutik Pranaya Sree HT Telugu
Sep 08, 2024 05:00 PM IST

Ambani's fashion: అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ లతో కలిసి నీతా అంబానీ గణేశ్ ఉత్సవాలలో మీడియా కోసం ఫొటోలు దిగారు. వారి డైమండ్ యాక్సెసరీలు, ఎథ్నిక్ లుక్స్ గురించి తప్పకుండా తెల్సుకోవాల్సిందే.

గణేష్ వేడుకలలో అంబానీ కుటుంబం
గణేష్ వేడుకలలో అంబానీ కుటుంబం (Instagram)

అంబానీ కుటుంబం నిన్న రాత్రి అంటిలియాలో గణేష్ చతుర్థి వేడుకలను ఘనంగా నిర్వహించింది. రాధికా మర్చంట్, అనంత్ అంబానీలతో కలిసి నీతా అంబానీ మీడియాకు శుభాకాంక్షలు తెలుపుతున్న వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. నీతా, రాధికలు సొగసైన చీరలు ధరించగా, అనంత్ కుర్తా, పైజామా సెట్ లో అలరించారు.

వినాయక వేడుకలు:

రాధికా మర్చంట్, నీతా అంబానీ, అనంత్ అంబానీ గతరాత్రి గణేష్ ఉత్సవాల సందర్భంగా ఆంటిలియా నుంచి బయటకు వచ్చి శుభాకాంక్షలు తెలిపారు. ఆ వీడియోల్లో వారు మీడియాను పలకరించడం, కలిసి ఫొటోలకు ఫోజులివ్వడం కనిపిస్తుంది. వారి మెరిసే డైమండ్ యాక్సెసరీలు, స్టైలిష్ ఎథ్నిక్ దుస్తులు అందరి మనసు దోచుకున్నాయి.

డైమండ్ నగలు

గణేష్ చతుర్థి వేడుకలకు తమ ఎథ్నిక్ దుస్తులను స్టైల్ చేయడానికి నీతా అంబానీ, రాధికా మర్చంట్, అనంత్ అంబానీ మెరిసే డైమండ్ యాక్సెసరీలను ఎంచుకున్నారు. నీతా చెవిపోగులు, భారీ ఉంగరం, డైమండ్ హెయిర్ పిన్, మల్టీ స్ట్రింగ్ ముత్యాల నెక్లెస్ ధరించగా, రాధిక చోకర్ నెక్లెస్, మ్యాచింగ్ చెవిపోగులు, సింగిల్ వరస మంగళసూత్రం, వజ్రాలు పొదిగిన గాజులను ధరించింది.

డైమండ్ బటన్స్:

ఇదిలా ఉంటే లగ్జరీ దుస్తులు ధరించి తన దుస్తులతో ఫేమస్ అయిన అనంత్ గణేశోత్సవ వేడుకలో మరో థీమ్ బ్రూచ్ ను ఎంచుకున్నాడు. అతను తన దుస్తులపై ఒక భారీ గణపతి బ్రూచ్ పెట్టుకున్నాడు. అతని జాకెట్‌పై ఉన్న డైమండ్ బటన్లు కూడా అందరి దృష్టిని ఆకర్షించాయి. లగ్జరీ దుస్తులకు, విభిన్నమైన బ్రూచ్ లతో అనంత్ అంబానీ ఫ్యాషన్ ప్రియులను ఆకర్షిస్తున్నారు.

లుక్ వివరాలు:

కొత్తగా పెళ్లైన రాధికా మర్చంట్ జర్దోసి ఎంబ్రాయిడరీ గోల్డ్ బోర్డర్, మల్టీ కలర్ ప్రింట్, హెవీ ఎంబ్రాయిడరీతో తయారు చేసిన పట్టుచీరను ఎంచుకుంది. అందుకు సరిపోయే గోల్డ్ బ్యాక్ లెస్ బ్లౌజ్ తో ఆమె చీర లుక్ పూర్తి చేసింది. చివరగా, జుట్టును మధ్య భాగంలో పాపిట తీసి సిగలా కట్టుకుంది. ఫెదర్డ్ ఐబ్రో, మెరిసే బొట్టు, మెరిసే చర్మం, బుగ్గలు, గులాబీ పెదవులు గ్లామర్ మరింత పెంచాయి.

ఇదిలా ఉంటే నీతా అంబానీ పర్పుల్ కలర్ ఎంబ్రాయిడరీ చీర, రాణీ పింక్ బ్లౌజ్ లో తన చిన్న కోడలికి పోటీగా నిలిచింది. సైడ్ పాపిట తీసి సిగకట్టుతో హెయిర్ స్టైల్ ఎంచుకున్నారు. పింక్ లిప్ షేడ్, బొట్టు, బ్లాక్ ఐబ్రో తో ఉన్న ఆమె ఎథ్నిక్ లుక్ అదిరిపోయింది.

టాపిక్