Samala khichdi: సామల కిచిడి ఇలా చేసుకుంటే బ్రేక్‌ఫాస్ట్‌లో అదిరిపోతుంది, డయాబెటిస్ వారికి బెస్ట్ అల్పాహారం-samala khichdi recipe in telugu know how to make this breakfast ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Samala Khichdi: సామల కిచిడి ఇలా చేసుకుంటే బ్రేక్‌ఫాస్ట్‌లో అదిరిపోతుంది, డయాబెటిస్ వారికి బెస్ట్ అల్పాహారం

Samala khichdi: సామల కిచిడి ఇలా చేసుకుంటే బ్రేక్‌ఫాస్ట్‌లో అదిరిపోతుంది, డయాబెటిస్ వారికి బెస్ట్ అల్పాహారం

Haritha Chappa HT Telugu
Jun 21, 2024 06:00 AM IST

Sama khichdi: సామలతో చేసిన ఆహారం తింటే ఎంతో మంచిది. ముఖ్యంగా బ్రేక్‌ఫాస్ట్‌లో సామల కిచిడిని తిని చూడండి, ఆ రోజంతా శక్తివంతంగా పనిచేస్తారు.

సామల కిచిడీ రెసిపీ
సామల కిచిడీ రెసిపీ

Sama khichdi: చిరుధాన్యాల్లో ఒకటైన సామలు. ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. దీంతో ఎన్నో రకాల ఆహారాలు వండుకోవచ్చు. కానీ సామలను తినేవారి సంఖ్య తక్కువగానే ఉంది. ఇక్కడ మేము సామల కిచిడి రెసిపీ ఇచ్చాము. దీన్ని బ్రేక్‌ఫాస్ట్‌లో తినడం వల్ల డయాబెటిస్ రోగులకు ఎంతో మేలు జరుగుతుంది. అలాగే బరువు తగ్గాలనుకున్న వారు ఇలా అల్పాహారంలో సామల కిచిడి చేయడం వల్ల ఆ రోజంతా తక్కువ ఆహారాన్ని తింటారు. కాబట్టి ఆరోగ్యంగా బరువు తగ్గుతారు. ఇక డయాబెటిస్ ఉన్నవారు సామల కిచెన్ తింటే రక్తంలో చక్కెరస్థాయిలు ఆ రోజంతా నియంత్రణలో ఉంటాయి. ఈ సామల కిచిడీ చేయడం చాలా సులువు.

సామల కిచిడి రెసిపీకి కావలసిన పదార్థాలు

సామలు - ఒక కప్పు

జీలకర్ర - ఒక స్పూను

పచ్చిమిర్చి - రెండు

ఉప్పు - రుచికి సరిపడా

నిమ్మరసం - ఒక స్పూన్

క్యారెట్ ముక్కలు - పావు కప్పు

నూనె - సరిపడినంత

పల్లీలు - గుప్పెడు

బంగాళదుంపలు - రెండు

నీరు - సరిపడినంత

కొత్తిమీర తరుగు - రెండు స్పూన్లు

సామల కిచిడి రెసిపీ

1. సామలను ముందుగానే నీటిలో వేసి అయిదారు గంటలు నానబెట్టాలి.

2. ఆ తర్వాత నీటిని వడకట్టి సామలను పక్కన పెట్టుకోవాలి.

3. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి నూనె వేయాలి.

4. నూనె వేడెక్కాక జీలకర్ర వేసి వేయించాలి. తర్వాత పల్లీలు, పచ్చిమిర్చి తరుగు వేసి వేయించుకోవాలి.

5. ఉడికించిన బంగాళదుంప ముక్కలను వేసి వేయించాలి.

6. అలాగే సన్నగా తరిగిన క్యారెట్ ముక్కలు, ఉప్పు కూడా వేసి బాగా కలుపుకోవాలి.

7. ఇప్పుడు ఆ మిశ్రమంలో నానబెట్టుకున్న సామలను వేసి రెండు నిమిషాలు చిన్న మంట మీద ఉడికించాలి.

8. ఆ తర్వాత రెండు కప్పుల నీరు వేసి ఉడికించుకోవాలి.

9. పైన మూత పెట్టి 20 నిమిషాల పాటు ఉడికిస్తే కిచిడి దగ్గరగా అవుతుంది.

10. పైన కొత్తిమీరను చల్లుకుంటే సామల కిచిడి రెడీ అయినట్టే.

11. తినే ముందు నిమ్మరసాన్ని చల్లుకొని తింటే రుచి అదిరిపోతుంది.

12. సామలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. కాబట్టి అల్పాహారంగా అప్పుడప్పుడు తినడం చాలా అవసరం.

సామలు తినడం వల్ల ఎన్నో రకాల రోగాలు రాకుండా ఉంటాయి. ముఖ్యంగా గుండె జబ్బులు వచ్చే ప్రమాదాన్ని సామలు తగ్గిస్తాయి. దీనిలో ఫైబర్, మెగ్నీషియం, పొటాషియం అధికంగా ఉంటాయి. కాబట్టి హైబీపీ ఉన్నవారు సామాన్లను తింటే రక్తపోటు అదుపులో ఉంటుంది. డయాబెటిస్ ఉన్నవారు వారంలో నాలుగైదు సామలు తినడం అలవాటు చేసుకోవాలి. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుతుంది. కీళ్ల నొప్పులు, ఊబకాయం వంటి సమస్యలకు సామలు గొప్పగా పనిచేస్తాయి. మహిళలు తినాల్సిన వాటిల్లో సామలు ముఖ్యమైనవి. వారిలో పీసీఓడీ వంటి సమస్యలు రాకుండా అడ్డుకోవడంలో సామలు ముందుంటాయి.

Whats_app_banner