Salt Effects: అన్నం తినేటప్పుడు ఉప్పు డబ్బాను పక్కన పెట్టుకోవడం మానేయండి, హైబీపీ బారిన త్వరగా పడతారు-salt effects avoid keeping a can of salt aside while eating rice you will suffer from high bp sooner ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Salt Effects: అన్నం తినేటప్పుడు ఉప్పు డబ్బాను పక్కన పెట్టుకోవడం మానేయండి, హైబీపీ బారిన త్వరగా పడతారు

Salt Effects: అన్నం తినేటప్పుడు ఉప్పు డబ్బాను పక్కన పెట్టుకోవడం మానేయండి, హైబీపీ బారిన త్వరగా పడతారు

Haritha Chappa HT Telugu
Feb 25, 2024 09:00 AM IST

Salt Effects: ఎంతోమందికి ఉన్న అలవాటు అన్నం తినేటప్పుడు ఉప్పు డబ్బాను తెచ్చి పెట్టుకుంటారు. ఏమాత్రం ఉప్పు తక్కువైనా వెంటనే తీసి కలుపుకొని తినేస్తారు. దీనివల్లే ఎక్కువ మంది హైబీపీ బారిన పడుతున్నారు.

పచ్చివ ఉప్పును తినడం మానేయండి
పచ్చివ ఉప్పును తినడం మానేయండి (pixabay)

Salt Effects: ప్రపంచంలో అధిక రక్తపోటుతో బాధపడుతున్న వారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. చాలామంది తమకు హైబీపీ లేదు కదా అని... ఉప్పు నచ్చినంత వేసుకొని తినేస్తూ ఉంటారు. అలా చేస్తే మీరు త్వరగా హైబీపీ బారిన పడతారు. అన్నం తినేటప్పుడు డైనింగ్ టేబుల్ పై ఉప్పు డబ్బా లేకుండా చూసుకోండి. ఉప్పు డబ్బా చేతికందేంత దూరంలో ఉంటే కూరలో ఏమాత్రం ఉప్పు తక్కువైనా వెంటనే ఓ అర స్పూను తీసి వేసుకుంటారు. ఇలా పచ్చి ఉప్పును తినడం వల్లే ఎక్కువ మంది అధిక రక్తపోటు బారిన పడుతున్నారు.

ఉప్పు అధికంగా తీసుకునే వారిలో గుండె, మెదడు సమస్యలు ఎక్కువగా వస్తాయి. గుండెపోటు, పక్షవాతం వచ్చే అవకాశం పెరుగుతుంది. ఉప్పు తగ్గినా పర్వాలేదు. ఆరోగ్యం కోసం ఆ చక్కటి కూరలని తినేయండి. హైబీపీ బారిన పడితే పూర్తిగా ఉప్పుని మానేయాల్సి వస్తుంది. రక్త పోటు లేదు కదా అని చెప్పి ఉప్పు వేసుకొని తింటే అతి తక్కువ కాలంలోనే మీరు హైబీపీ బారిన పడతారు.

ఉప్పు తినడం వల్ల హై బీపీ రావడానికి ముందే శరీరంలోనే రక్తనాళాలు దెబ్బతింటాయి. రక్తనాళాల్లో అడ్డంకులు, పూడికలు ఏర్పడతాయి. దీనివల్ల గుండెపోటు వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే మెదడు స్ట్రోక్ కూడా రావచ్చు.

రోజూ మీరు తినే ఉప్పులో ఇకపై సగానికి పైగా కట్ చేసుకోండి. మరీ చప్పగా కాకుండా, అలా అని ఉప్పగా కాకుండా మధ్యస్థంగా తినండి. ఒకేసారి ఉప్పు రుచిని మారడం కష్టమే. కాబట్టి రోజు రోజుకు ఉప్పును తగ్గిస్తూ ఉండండి. ఉప్పు ఎంతగా తగ్గిస్తే మీరు అంతకాలం ఆరోగ్యంగా జీవిస్తారు. కూరల్లో ఉప్పు సరిపోకపోయినా అలానే తినేయండి. కూరలు వండుతున్నప్పుడు వేసిన ఉప్పుతోనే సరిపెట్టుకుంటే అన్ని విధాలా ఆరోగ్యం. ఉప్పు వేశాక కూరను పావుగంట పాటు ఉడికించండి. దీనివల్ల ఉప్పు చేసే చెడు కాస్తయినా తగ్గుతుంది. కానీ పచ్చి ఉప్పు తింటే మాత్రం చాలా ప్రమాదం. కాబట్టి పెరుగన్నంలో లేదా సలాడ్లపైన ఉప్పుని చల్లుకోవడం పూర్తిగా మానేయండి. చప్పగా అనిపిస్తే కాస్త నిమ్మ రసాన్ని జల్లుకొని తినండి. లేదా సలాడ్లు, పండ్ల ముక్కలపై తేనె చల్లుకొని తినండి. పచ్చి ఉప్పును మాత్రం దూరంగా పెట్టండి. ముఖ్యంగా మీకు అన్నం తినేటప్పుడు మీ కంటికి కనిపించేంత దూరంలో, చేతికి అందేంత దగ్గరలో మాత్రం ఉప్పు డబ్బాను ఉంచుకోకండి.

Whats_app_banner