Saddula Batukamma Prasadam: సద్దుల బతుకమ్మ ప్రత్యేక నైవేద్యాలు మలీదా లడ్డులు, నువ్వుల సద్ది, వీటి రెసిపీలు ఇవిగో-saddula bathukamma special offerings malida laddu nuvvula saddi here are the recipes ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Saddula Batukamma Prasadam: సద్దుల బతుకమ్మ ప్రత్యేక నైవేద్యాలు మలీదా లడ్డులు, నువ్వుల సద్ది, వీటి రెసిపీలు ఇవిగో

Saddula Batukamma Prasadam: సద్దుల బతుకమ్మ ప్రత్యేక నైవేద్యాలు మలీదా లడ్డులు, నువ్వుల సద్ది, వీటి రెసిపీలు ఇవిగో

Haritha Chappa HT Telugu
Oct 09, 2024 05:30 PM IST

Saddula Batukamma Prasadam: సద్దుల బతుకమ్మ వచ్చిందంటే ఖచ్చితంగా మలీదా లడ్డూలు, నువ్వుల సద్ది నైవేద్యాలుగా ఉండాల్సిందే. ఈ రెండింటినీ చాలా సులువుగా చేసేయొచ్చు.

మలీదా లడ్డులు, నువ్వుల అన్నం రెసిపీలు
మలీదా లడ్డులు, నువ్వుల అన్నం రెసిపీలు

తెలంగాణలో వేడుకల సాగే అద్భుతమైన పండుగ బతుకమ్మ. ఆడపడుచులంతా ఈ బతుకమ్మకు కోసం ఒకచోట చేరుతారు. ఈ పూల పండుగ వీధులను, వాడలను, గ్రామాలనూ అందంగా మార్చేస్తుంది. ఆడపడుచులంతా తమ కుటుంబాన్ని, ప్రకృతిని చల్లగా చూడమని బతుకమ్మను కోరుతారు. తొమ్మిది రోజులు పాటు సాగే బతుకమ్మ పండగలో చివరి రోజున సద్దుల బతుకమ్మ ముఖ్యమైనది. ఆరోజు ఖచ్చితంగా మలీదా లడ్డులు, నువ్వుల సద్దిని నైవేద్యంగా సమర్పిస్తారు. ఈ రెండింటినీ చేయడం చాలా సులువు.

మలీదా లడ్డులు రెసిపీకి కావలసిన పదార్థాలు

బొంబాయి రవ్వ - అరకప్పు

గోధుమపిండి - ఒక కప్పు

జీడిపప్పు,బాదం, పిస్తా - అన్నీ కలిపి గుప్పెడు

పాలు - అరకప్పు

యాలకుల పొడి - ఒక స్పూను

సోంపు పొడి - అర స్పూను

ఉప్పు - రుచికి సరిపడా

బెల్లం తురుము - ఒక కప్పు

మలీదా లడ్డూ రెసిపీ

1. ఒక గిన్నెలో గోధుమపిండిని, రవ్వను వేసి బాగా కలపాలి.

2. అందులోనే కాచిన నెయ్యిని కూడా వేసి బాగా కలుపుకోవాలి.

3. ఇప్పుడు పాలు వేసి దాన్ని చపాతీ పిండిలా కలపాలి.

4. పైన మూత పెట్టి పావుగంట సేపు పక్కన పెట్టుకోవాలి.

5. తర్వాత వాటిని చిన్నచిన్న ఉండలుగా తీసి చపాతీల్లా ఒత్తుకోవాలి.

6. స్టవ్ మీద పెనం పెట్టి ఆ చపాతీలను రెండు వైపులా కాల్చి పక్కన పెట్టుకోవాలి.

7. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి నెయ్యి వేసి పిస్తాలు, బాదం, జీడిపప్పులు వేసే సన్నగా తరిగి పక్కన పెట్టుకోవాలి.

8. ఇప్పుడు చపాతీలను చిన్న చిన్న ముక్కలుగా చేసి మిక్సీలో వేసి కచ్చాపచ్చాగా రుబ్బాలి. నీళ్లు మాత్రం వేయకూడదు.

9. ఒక గిన్నెలో ఆ చపాతీ పొడిని, బెల్లం తురుమును వేసి బాగా కలపాలి.

10. అదే కాచిన నెయ్యిని బాదం, జీడిపప్పు, పిస్తా వంటి వాటిని తరిగి కలుపుకోవాలి.

11. యాలకుల పొడిని కూడా వేయాలి.

12. ఈ మొత్తం మిశ్రమాన్ని లడ్డూల్లా చుట్టి పక్కన పెట్టుకోవాలి.

13. అదే మలీదా లడ్డూ వీటిని సద్దుల బతుకమ్మకు నైవేద్యంగా సమర్పించుకోవాలి.

..........................................

నువ్వుల సద్ది రెసిపీకి కావాల్సిన పదార్థాలు

వండిన అన్నం - మూడు కప్పులు

ఎండుమిర్చి - నాలుగు

నువ్వులు - అరకప్పు

శెనగపప్పు - ఒక స్పూను

ఆవాలు - ఒక స్పూను

పసుపు - అర స్పూను

జీలకర్ర - ఒక స్పూను

నూనె - మూడు స్పూన్లు

ధనియాల - రెండు స్పూన్లు

మెంతి గింజలు - అర స్పూను

కరివేపాకులు - గుప్పెడు

నువ్వుల సద్ది రెసిపీ

1. స్టవ్ మీద కళాయి పెట్టి ధనియాలు, ఎండుమిర్చి, నువ్వులు, మెంతులు వేయించి పొడి చేసి పక్కన పెట్టుకోవాలి.

2. అన్నాన్ని ముందుగానే వండి ఆరబెట్టుకోవాలి.

3. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి నూనె వేయాలి.

4. ఆ నూనెలో ఎండు మిర్చి, కరివేపాకులు, ఆవాలు, జీలకర్ర, శెనగపప్పు వేసి చిటపటలాడించాలి.

5. తర్వాత పసుపు కూడా వేయాలి.

6. ఇప్పుడు ఆ అన్నం ఆ మిశ్రమంలో ముందుగా వండిన అన్నాన్ని రుచికి సరిపడా ఉప్పును వేసి కలుపుకోవాలి.

7. అలాగే ముందుగా పొడిచేసి పెట్టుకున్న నువ్వుల పొడి కూడా వేసి కలుపుకోవాలి.

8. అంతే నువ్వుల సద్ది రెడీ అయినట్టే. దీన్ని బతుకమ్మకు నైవేద్యంగా సమర్పించాలి.

బతుకమ్మ పండుగ చివర రోజైనా సద్దుల బతుకమ్మలో ముఖ్యమైన నైవేద్యాలు మలీదా లడ్డు, నువ్వుల సద్ది... ఈ రెండూ పెట్టకుండా సద్దుల బతుకమ్మ పూజ పూర్తి కాదు. వీటిని చేయడం చాలా సులువే.

Whats_app_banner