Crispy Chana Dosa: క్రిస్పీగా శెనగపప్పు దోశను ఇలా ప్రయత్నించండి, చాలా రుచిగా ఉంటుంది-crispy chana dosa recipe in telugu know how to make this breakfast ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Crispy Chana Dosa: క్రిస్పీగా శెనగపప్పు దోశను ఇలా ప్రయత్నించండి, చాలా రుచిగా ఉంటుంది

Crispy Chana Dosa: క్రిస్పీగా శెనగపప్పు దోశను ఇలా ప్రయత్నించండి, చాలా రుచిగా ఉంటుంది

Haritha Chappa HT Telugu
Sep 14, 2024 07:00 AM IST

Crispy Chana Dosa: దోశలు పేరు చెబితేనే నోరూరిపోతుంది. ఇక్కడ మేము కొత్తగా శెనగపప్పు దోశ రెసిపీ ఇచ్చాము. దీన్ని చేయడం చాలా సులువు. పిల్లలకు ఇవి బాగా నచ్చుతాయి.

శెనగపప్పు దోశె రెసిపీ
శెనగపప్పు దోశె రెసిపీ

Crispy Chana Dosa: మీకు దోశలంటే ఇష్టమా? ఎప్పుడూ ఒకేలాంటి దోశ తినే కన్నా ఓసారి కొత్తగా శెనగపప్పు దోశను ప్రయత్నించండి. ఇది క్రిస్పీగా, టేస్టీగా వస్తుంది. కొబ్బరి చట్నీతో తింటే రుచి అదిరిపోతుంది. ముఖ్యంగా పిల్లలకు ఇది బాగా నచ్చుతుంది. వీటిని చేయడం చాలా సులువు. మినప్పప్పు, పెసరపప్పు తోనే చేసిన దోశలను ఇప్పటికే తిని ఉంటారు. శెనగపప్పుతో కూడా ప్రయత్నించి చూడండి. రుచి మామూలుగా ఉండదు.

క్రిస్పీ శెనగపప్పు దోశకు కావలసిన పదార్థాలు

శెనగపప్పు - ఒక కప్పు

పచ్చిమిర్చి - నాలుగు

అల్లం - చిన్న ముక్క

జీలకర్ర - ఒక స్పూను

నీళ్లు - తగినన్ని

ఎండుమిర్చి - ఒకటి

కొత్తిమీర తరుగు - ఒక స్పూను

ఉప్పు - రుచికి సరిపడా

క్రిస్పీ శెనగపప్పు దోశ రెసిపీ

1. శెనగపప్పును నీటిలో వేసి నాలుగు గంటల పాటు నానబెట్టుకోవాలి.

2. ఆ తర్వాత ఆ శనగపప్పును మిక్సీ జార్లో వేసుకోవాలి.

3. అలాగే పచ్చిమిర్చి, అల్లం, నీళ్లు, తగినంత ఉప్పు కూడా వేసి రుబ్బుకోవాలి.

4. ఆ మొత్తం మిశ్రమాన్ని ఒక గిన్నెలో వేయాలి.

5. ఆ గిన్నెలోనే కొత్తిమీర తరుగు, జీలకర్ర, ఎండుమిర్చి పొడి, కొత్తిమీర తరుగు వేసి బాగా కలుపుకోవాలి.

6. క్రిస్పీగా కావాలనుకుంటే నీళ్లు ఎక్కువగా వేసుకోవాలి.

7. రవ్వ దోశకు ఎన్ని నీళ్లు పోసుకుంటారో, ఈ శెనగపప్పు దోశకి కూడా అలానే నీళ్ళు వేసుకోవాలి.

8. ఇప్పుడు స్టవ్ మీద లోతుగా ఉండే పెనం పెట్టి నూనె వేయాలి.

9. ఆ నూనెలో ఒక గరిటె దోశల పిండిని పలుచగా వేసుకొని కాల్చుకోవాలి.

10. అంతే టేస్టీ క్రిస్పీ శనగపప్పు దోశ రెడీ అయినట్టే.

11. దీన్ని కొబ్బరి చట్నీతో తింటే రుచి అదిరిపోతుంది. క్రిస్పీగా వస్తుంది. కాబట్టి పిల్లలకు కూడా బాగా నచ్చుతుంది.

దోశల్లో ఎన్నో రకాలు ఉన్నాయి. మినప్పప్పుతోను, పెసరపప్పుతోనో పల్చగా దోశలు వేస్తూ ఉంటారు. అలాగే ఓట్స్ తో కూడా ఎక్కువగానే వేస్తారు. బయట శనగపప్పుతో చేసే దోశలు దొరకవు. కాబట్టి మీరు ఇంట్లోనే దీన్ని ప్రయత్నించండి. ఈ దోశ రుచి కాస్త భిన్నంగా ఉంటుంది. ముఖ్యంగా కొబ్బరి చట్నీతో తింటే ఆ రెండింటి కాంబినేషన్ అదిరిపోతుంది. ఒకసారి ప్రయత్నం చేసి చూడండి.