Dosa History: ఆ రెండు రాష్ట్రాల్లో దోశె పుట్టినిల్లు ఏది? ఈ అల్పాహారాన్ని ఎప్పటినుంచి మనం తినడం ప్రారంభించాం?-which is the birthplace of dosa in those two states since when do we start eating this breakfast ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Dosa History: ఆ రెండు రాష్ట్రాల్లో దోశె పుట్టినిల్లు ఏది? ఈ అల్పాహారాన్ని ఎప్పటినుంచి మనం తినడం ప్రారంభించాం?

Dosa History: ఆ రెండు రాష్ట్రాల్లో దోశె పుట్టినిల్లు ఏది? ఈ అల్పాహారాన్ని ఎప్పటినుంచి మనం తినడం ప్రారంభించాం?

Haritha Chappa HT Telugu
Aug 30, 2024 08:37 AM IST

Dosa Histoదదోry: దోశ పేరు చెబితేనే కొందరికి నోరూరిపోతుంది. దోశలో ఎన్నో రకాలు ఉన్నాయి. ఏ దోశైనా కూడా తింటే చాలు సంతృప్తిగా ఉంటుంది. అయితే ఈ దోశను మాదంటే మాదని అంటున్నాయి రెండు రాష్ట్రాలు. ఇంతకీ దోశ ఏ రాష్ట్రానికి చెందినది?

దోశ ఎక్కడ పుట్టింది?
దోశ ఎక్కడ పుట్టింది? (Pixabay)

Dosa History: దోశల్లో ఎన్నో రకాలు.. కారం దోశ, ఎగ్ దోశ, మసాలా దోశ, చీజ్ దోశ, పన్నీర్ దోశ ఇలా చెప్పుకుంటూ పోతే దోశపై ఎన్నో ప్రయోగాలు జరిగాయి. ఏ ప్రయోగమూ ఇంతవరకు విఫలం కాలేదు. అన్నీ రుచిగానే ఉన్నాయి. అదే దోశ గొప్పతనం. ఇప్పుడు దక్షిణ భారత దేశంలో దోశ ఇష్టమైన అల్పాహారమే కాదు, ఒక ఎమోషన్‌గా మారిపోయింది. దోశను చూస్తే చాలు ఏదో ఆత్మీయురాలిని చూసినట్టు తనివి తీరిపోతుంది. అల్పాహారంలో దోశెను తింటే ఎంతో ఉత్సాహంగా, సంతృప్తిగా అనిపిస్తుంది. దక్షిణ భారతీయుల ఆహారంలో దోశ ఒక భాగం అయిపోయింది. ఇప్పుడు భారతదేశమంతటా, కొన్ని విదేశాల్లో కూడా దోశను తింటున్న వారి సంఖ్య అధికంగానే ఉంది.

దోశ ఏ రాష్ట్రానిది?

దోశ పుట్టుక గురించి ఇప్పటికి ఒక మాట మీదకి ఎవరూ రాలేకపోతున్నారు. కొందరు కర్ణాటకలో దోశ పుట్టిందని చెబితే, మరికొందరు తమిళనాడులో పుట్టిందని అంటారు. కర్ణాటకలోనే కొన్ని ప్రాంతాలను పాలించిన మూడో సోమేశ్వర రాజు 12వ శతాబ్దంలో దోశ గురించి తన సంస్కృత సాహిత్యంలో ప్రస్తావించినట్టు చెబుతారు. దీన్నిబట్టి 12వ శతాబ్దం నాటికే దోశను మనం తింటున్నామని అర్థం. మరికొందరు అంతకు పూర్వమే దోశ ఉండేదని అంటారు. అయితే తమిళ ప్రాంతంలో అప్పం అని పిలిచే దోశలాంటి వంటకం పూర్వం ఎప్పటినుంచో ఉందని చెప్పుకుంటారు. మధురై లో అప్పం, మెల్ అడాయి అని పిలిచే దోశలను పూర్వ సాహిత్యంలో కూడా ప్రస్తావించారని అంటారు. ఇప్పటికీ దోశ కర్ణాటక కు చెందిందో లేక తమిళనాడుకు చెందిందో తేలలేదు. ఇప్పుడు తేలాల్సిన అవసరం లేదు, అది దేశం మొత్తానికి నచ్చేసే బ్రేక్ ఫాస్ట్ గా మారిపోయింది.

ఆయుర్వేదంలో దోశె

బియ్యం, నల్ల మినుములు, మెంతులు వేసి బాగా నానబెట్టి, ఆ పిండిని రుబ్బి 8 గంటల పాటు పులియ బెట్టాలి. అప్పుడు దోశ పిండి రెడీ అయిపోతుంది. ఈ దోశ పిండిలో రుచికి సరిపడా ఉప్పును వేసుకొని దోశల్లా పోసుకుంటే చాలు. వేడివేడి క్రంచీ దోశ రెడీ అయిపోతుంది. ఈ పులిసిన పిండిలో మన శరీరానికి అవసరమైన ఎన్నో పోషకాలు ఉంటాయి. పూర్వం ఆయుర్వేద వైద్యంలో కూడా దోశను వినియోగించారని చెబుతారు. వైద్య పరిభాషలో దోశకా అని పిలుచుకునే వారని చెబుతారు.

ప్రస్తుతం అమెరికాలాంటి విదేశాల్లో కూడా దోశ స్టాల్స్ ఎక్కువైపోయాయి. దోశ భారతీయులకే కాదు విదేశీయులకు కూడా ఎంతో నచ్చేసింది. దాదాపు 70 రకాల దోసెలను ప్రస్తుతం వండుతున్నారు.

మనం దోశలను ఇప్పుడే కాదు గత రెండువేల ఏళ్లుగా తింటున్నామని అంటారు చరిత్రకారులు. మనిషి ఆహారంలో దోశ ఎప్పటినుంచో భాగం అయిపోయిందని, అందుకే ఇప్పుడు అది ఎంతోమందికి ఇష్టంగా ఎమోషన్‌గా మారిపోయిందని చెబుతారు. దోశలో ఇప్పుడంటే ఎన్నో రకాలు వచ్చాయి గాని అప్పుడు ఒకే రకంగా దోశను వేసుకుని తినేవారు. అప్పట్లో ఫ్రిడ్జ్ లాంటివి ఉండేవి కాదు. అందుకే దోసెలాంటి పులియబెట్టి చేసే వంటకం సిద్ధమైనట్టు చెబుతారు. ఈ దోశను ఎవరు కనిపెట్టారో తెలియదు కానీ వారికి మాత్రం మనం రుణపడి ఉండాల్సిందే, లేకుంటే ఇంత టేస్టీ వంటకాన్ని మనం తినేవాళ్లం కాదేమో.

టాపిక్