Reverse Period Pain : అమ్మాయిలు పీరియడ్స్ సమయంలో ఈ ఫుడ్ తినండి.. నొప్పి తగ్గుతుంది..-reverse period pain with these 5 foods items here is the details ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Reverse Period Pain : అమ్మాయిలు పీరియడ్స్ సమయంలో ఈ ఫుడ్ తినండి.. నొప్పి తగ్గుతుంది..

Reverse Period Pain : అమ్మాయిలు పీరియడ్స్ సమయంలో ఈ ఫుడ్ తినండి.. నొప్పి తగ్గుతుంది..

Geddam Vijaya Madhuri HT Telugu
Nov 29, 2022 11:52 AM IST

Reverse Period Pain with Food : పీరియడ్స్ సమయంలో వచ్చే నొప్పి అంతా ఇంతా కాదు. క్రాంప్స్, తిమ్మిర్లు, మెంటల్ హెల్త్.. ఇలాంటి చాలా సమస్యలు అమ్మాయిలను చుట్టుముట్టేస్తాయి. అయితే ఈ సమయంలో కొన్ని ఆహారాలు తింటే.. ఈ సమస్యలనుంచి కాస్త ఉపశమనం పొందవచ్చు అంటున్నారు వైద్యులు.

పీరియడ్స్ సమయంలో ఈ ఫుడ్ తినండి
పీరియడ్స్ సమయంలో ఈ ఫుడ్ తినండి

Reverse Period Pain with Food : చాలా మంది మహిళలు వారి ఋతు చక్రం సమయంలో.. అధిక ఋతు నొప్పిని అనుభవిస్తారు. ఈ పీరియడ్స్ నొప్పి శరీరాన్ని బాగా ప్రభావితం చేస్తుంది. అంతేకాకుండా ఇది మహిళల మానసిక స్థితిపైనే కాకుండా.. ఇతర అన్ని పనులపై ప్రభావం చూపిస్తుంది. దీనివల్ల సరిగ్గా పని చేయలేరు. రెస్ట్ తీసుకోలేరు.

పీరియడ్స్ సమయంలో వచ్చే తిమ్మిర్లు అనేక కారణాల వల్ల ప్రభావితమవుతాయని నిపుణులు వెల్లడించారు. వాటిలో ఆహారపు అలవాట్లు వాటిలో ఒకటి. కొన్ని ఆహారాలు తీసుకుంటే.. నొప్పి ఎలా ఎక్కువ అవుతుందో.. కొన్ని ఫుడ్స్ తీసుకుంటే.. నొప్పి నుంచి ఉపశమనం పొందవచ్చు అంటున్నారు నిపుణులు. అయితే పీరియడ్స్ సమయంలో మీరు తీసుకోవాల్సిన ఆహారాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

ఆకుపచ్చని కాయగూరలు

ఆకుపచ్చని కాయగూరలను పీరియడ్స్ సమయంలో ఆహారంలో కలిపి తీసుకుంటే మంచిది. బచ్చలికూర, కాలే, బ్రోకలీ, క్యాబేజీ, కాలీఫ్లవర్ వంటి వాటిని తీసుకోవడం వల్ల పీరియడ్స్ సమయంలో వచ్చే నొప్పుల నుంచి కాస్త ఉపశమనం పొందవచ్చు. వాటిలో కాల్షియం, మెగ్నీషియం పుష్కలంగా ఉంటాయి. ఈ రెండూ పీరియడ్స్ నొప్పి నుంచి మీకు కాస్త ఉపశమనం అందించడంలో సహాయపడతాయి.

చేప

మీరు నాన్​వెజ్ తినేవారు అయితే.. పీరియడ్స్ సమయంలో చేపలను మీ డైట్​లో చేర్చుకోండి. వాటిలో ఐరన్, ప్రొటీన్, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు మొదలైనవి పుష్కలంగా ఉంటాయి. వీటిని పీరియడ్స్ సమయంలో తినడం వల్ల నెలసరిలో వచ్చే నొప్పి నుంచి కాస్త ఉపశమనం లభిస్తుంది.

పసుపు

పసుపు ఒక గొప్ప వైద్యం శోథ నిరోధక మసాలా. తిమ్మిరి, ఇతర రుతుక్రమ లక్షణాలను తగ్గించడానికి పసుపు బాగా హెల్ప్ చేస్తుంది.

నీరు అధికంగా ఉండే ఆహారాలు

పీరియడ్స్ సమయంలో డీహైడ్రేషన్ వల్ల తలనొప్పి వస్తుంది. కాబట్టి శరీరాన్ని హైడ్రేట్​గా ఉంచుకోవడం చాలా ముఖ్యం. కీర దోసకాయలు, పుచ్చకాయలు వంటి మొదలైన ఆహార పదార్థాలు.. మీ శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచడంలో సహాయపడతాయి.

పెరుగు

పెరుగు అనేది ప్రోబయోటిక్స్‌లో సమృద్ధిగా ఉండే ఆహారం. ఇది మీ పీరియడ్స్ సమయంలో వచ్చే ఇన్ఫెక్షన్‌ల బారిన పడకుండా మీ యోనిని సంరక్షిస్తుంది. అంతేకాకుండా శరీరానికి మంచి పోషణనిస్తుందని పలు అధ్యయనాలు నిరూపించాయి.

Whats_app_banner

సంబంధిత కథనం