Pudina Chutney : వేడి వేడి అన్నంలోకి పుదీనా-శనగల చట్నీ.. కమ్మటి రుచి.. తింటే ఆహా.. అంటారు-pudina chutney recipe how to prepare mint chutney with chickpeas ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Pudina Chutney : వేడి వేడి అన్నంలోకి పుదీనా-శనగల చట్నీ.. కమ్మటి రుచి.. తింటే ఆహా.. అంటారు

Pudina Chutney : వేడి వేడి అన్నంలోకి పుదీనా-శనగల చట్నీ.. కమ్మటి రుచి.. తింటే ఆహా.. అంటారు

Anand Sai HT Telugu
Jun 03, 2024 11:00 AM IST

Pudina Chutney Recipe In Telugu : పుదీనా ఆరోగ్యానికి మంచిది. దీనితో చట్నీ చేసుకుని తింటే అన్నంలోకి బాగుంటుంది.

పుదీనా శనగల చట్నీ
పుదీనా శనగల చట్నీ

అన్నం కోసం మనం రకరకాల చట్నీలు చేస్తుంటాం. వాటిని కలుపుకొని తింటే అన్నంలోకి చాలా టేస్టీగా ఉంటుంది. అయితే ఎప్పుడైనా పుదీనా చట్నీ ఇంట్లో తయారు చేశారా? అందులో శనగలు వేసి చేశారా? ఈ రెసిపీ చూసేందుకు, తినేందుకు, వాసన చూసేందుకు చాలా బాగుంటుంది. ఒక్కసారి తింటే మళ్లీ కావాలి అంటారు. అంతటి రుచి ఉంటుంది. ఈ పుదీనా చట్నీ కేవలం అన్నంలోకే కాదు.. స్నాక్స్‌లోకి కూడా వాడుకోవచ్చు. కమ్మని రుచిని ఇస్తుంది.

పుదీనాను సాధారణంగా చట్నీలు, కొన్ని మసాలా దినుసులలో సువాసన కోసం ఉపయోగిస్తారు. పుదీనా ఆకులు రుచికే కాదు.. అనేక ఔషధ గుణాలు కూడా పుష్కలంగా ఉన్నాయి. ఈ ఆకుల్లో కేలరీలు చాలా తక్కువ. ఇందులో కరగని ఫైబర్ కూడా ఎక్కువగా ఉంటుంది.

పుదీనా ఆకులు జీర్ణక్రియలో బాగా సహాయపడతాయి. కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో సహాయపడతాయి. కడుపులో ఎసిడిటీని నివారిస్తుంది. కడుపు ఉబ్బరం, మలబద్ధకం, గుండెల్లో మంట మొదలైన సమస్యల నుండి రక్షిస్తుంది. ఈ లక్షణాలతో పాటు బరువు తగ్గడంలో కూడా పుదీనా సహాయపడుతుంది.

చాలా మంది పుదీనా చట్నీని ఇష్టపడతారు. మనం అన్నం లేదా అల్పాహారం కోసం పుదీనా చట్నీని ఎలా తయారు చేయవచ్చు? పుదీనా చట్నీ చేయడానికి కావలసిన పదార్థాలు ఏమిటి? ఎలా చెయ్యాలి చట్నీ చేయడానికి ఎంత సమయం పడుతుందో తెలుసుకుందాం

పుదీనా-శనగల చట్నీకి కావాల్సిన పదార్థాలు

పుదీనా ఆకులు - 2 కప్పులు, కొత్తిమీర - 1/2 కప్పు, శనగలు - 3/4 కప్పు, కొబ్బరి - 1/2 కప్పు, జీలకర్ర - 1 tsp, వెల్లుల్లి - 8, పచ్చిమిర్చి - 5, ఎర్ర మిర్చి - 2, చింతపండు-1/4 tsp, వంట నునె కొద్దిగా, రుచికి ఉప్పు

పుదీనా-శనగల చట్నీ ఎలా చేయాలి?

ముందుగా శనగలు ఒక పాత్రలో వేసి వేయించాలి. పక్కన పెట్టుకోవాలి. అదే గిన్నెలో నూనె వేయండి. తర్వాత జీలకర్ర, వెల్లుల్లి, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర తరుగు వేసి రెండు నిమిషాలు వేయించాలి.

దీని తర్వాత చింతపండు రసం, కొబ్బరి వేసి వేయించాలి. 1 నిమిషం వేయించడానికి సరిపోతుంది. దీని తరువాత ఈ మసాలా తీసుకొని మిక్సింగ్ జార్ లో వేసి, ఉప్పు వేసి, వేయించిన శనగలు వేసి, కొంచెం నీరు పోసి గ్రైండ్ చేయాలి. సన్నటి చట్నీకి కావలసినన్ని నీళ్లు పోసి మెత్తగా రుబ్బుకోవాలి.

అంతే మీరు తినాలి అనుకునే.. రుచికరమైన పుదీనా-శనగల చట్నీ సిద్ధంగా ఉంది. చపాతీ, ఇడ్లీ, దోసెలతో కూడా దీనిని తినవచ్చు. వేడి వేడి అన్నంలోకి కూడా బాగుంటుంది.

పుదీనా ఆకుల్లో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. రోజువారీ సలాడ్‌లో కొన్ని తాజా పుదీనా ఆకులను మిక్స్ చేసి పచ్చిగా తినండి. ఇది కడుపు ఉబ్బరాన్ని నివారించడమే కాకుండా, బరువు తగ్గడానికి కూడా సహాయపడుతుంది. పుదీనా ఆరోగ్యానికి ఎంతో మంచి చేస్తుంది. రోజూవారీ ఆహారంలో చేర్చుకోవడం వలన కూడా ఉపయోగం ఉంటుంది.

Whats_app_banner