Ragi Chapati : రాగి చపాతీ చేసి.. ఆలూ గ్రేవీతో తింటే మామూలుగా ఉండదు టేస్ట్-ragi chapati with potato gravy know how to make this recipe in telugu ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Ragi Chapati : రాగి చపాతీ చేసి.. ఆలూ గ్రేవీతో తింటే మామూలుగా ఉండదు టేస్ట్

Ragi Chapati : రాగి చపాతీ చేసి.. ఆలూ గ్రేవీతో తింటే మామూలుగా ఉండదు టేస్ట్

Anand Sai HT Telugu

Ragi Chapati and Potato Gravy Recipe In Telugu : రాగులు ఆరోగ్యానికి మంచివి. వాటితో చపాతీ చేసి తింటే అనేక ప్రయోజనాలు పొందుతారు. ఇందులోకి ఆలూ గ్రేవీ అద్భుతంగా ఉంటుంది.

రాగి చపాతీ

ఎప్పుడూ ఉదయాన్నే ఇడ్లీ, దోసెలను తయారు చేయడానికి బదులుగా ఇంట్లో రాగి పిండి ఉంటే, దానితో చపాతీ తయారు చేయండి. దాని కోసం హోటల్ స్టైల్ పొటాటో గ్రేవీని చేసుకోండి. ఈ కాంబినేషన్ మీ ఇంట్లో ప్రతి ఒక్కరికీ తప్పకుండా నచ్చుతుంది. కొత్తగా బ్రేక్ ఫాస్ట్‌లోకి ఏం చేయాలో ఆలోచిస్తున్నట్లయితే, ఈ రెసిపీ ట్రై చేయండి. దీన్ని తయారు చేయడం చాలా సులభం, రుచిగా ఉంటుంది.

రాగి చపాతీకి హోటల్ స్టైల్ పొటాటో గ్రేవీ ఎలా చేయాలో తెలుసుకోవాలనుకుంటున్నారా? రాగి చపాతీ, హోటల్ స్టైల్ పొటాటో గ్రేవీని తయారు చేసే విధానం కింద ఉంది. ఎలా చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం..

రాగి చపాతీకి కావాల్సిన పదార్థాలు

నీళ్లు - 1 కప్పు, ఉప్పు - 1/2 టీస్పూన్, నూనె - 1 టీస్పూన్, రాగి పిండి - 1 కప్పు

బంగాళదుంప గ్రేవీ కోసం

నూనె - 2 టేబుల్ స్పూన్లు, బిర్యానీ ఆకులు - 1, దాల్చిన చెక్క - 1 ముక్క, లవంగాలు - 2, జీలకర్ర - 1/2 tsp, సోంపు - 1/2 tsp, కరివేపాకు - 1 కట్ట, ఉల్లిపాయ - 1 (సన్నగా తరిగినవి), అల్లం వెల్లుల్లి పేస్ట్ - 1 tsp, పసుపు పొడి - 1/4 tsp, కారం పొడి - 1 1/2 tsp, ధనియాల పొడి - 1 tsp, గరం మసాలా - 1/2 tsp, పెరుగు - 1/4 కప్పు, పెద్ద బంగాళదుంపలు - 2, నీరు - గ్రేవీకి కావలసినంత, కొత్తిమీర - కొద్దిగా

రాగి చపాతీ తయారీ విధానం

ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టి అందులో 1 కప్పు నీళ్లు పోసి అందులో 1/2 టీస్పూన్ ఉప్పు, 1 టీస్పూన్ నూనె వేసి నీళ్లు బాగా మరిగేటప్పుడు అందులో రాగుల పిండి వేసి బాగా కలపాలి. తర్వాత కాసేపు నానబెట్టండి. ఇలా నానబెట్టినప్పుడు ఆ వేడిలో పిండి బాగా ఉడికి చపాతీ మెత్తగా ఉంటుంది.

తర్వాత నానబెట్టిన రాగుల పిండిని మీ చేతులతో బాగా మెత్తగా చేయాలి. ఇప్పుడు మెత్తగా అయిన పిండిలో కొంత భాగాన్ని తీసుకుని రోల్ చేసి రాగి పిండిని చపాతీలా చేసుకోవాలి.

చపాతీలా చేస్తున్నప్పుడు పైన రాగుల పిండిని చల్లి చేయాలి. ఇది చేస్తే సులభంగా అవుతుంది. గుండ్రంగా తయారు చేయాలి.

చివరగా గ్యాస్ మీద పెనం పెట్టి రాగి చపాతీని అందులో వేసి కాల్చాలి. తర్వాత చపాతీ తిప్పి కొంచెం నూనె రాసుకుని చేసుకోవాలి. ఇలాగే మొత్తం పిండిని చపాతీలుగా చేసుకుంటే రుచికరమైన రాగి చపాతీలు రెడీ.

పొటాటో గ్రేవీ చేసే విధానం

పొయ్యిమీద కడాయి పెట్టి అందులో 2 టేబుల్ స్పూన్ల నూనె పోసి వేడి అయ్యాక దాల్చిన చెక్క, లవంగాలు, బిర్యానీ ఆకులు, ఇంగువ, జీలకర్ర, కరివేపాకు వేయాలి.

తర్వాత ఉల్లిపాయలు వేసి వేగించండి, అల్లం, వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయే వరకు వేయించాలి.

అనంతరం ధనియాల పొడి, పసుపు, కారం, గరం మసాలా వేసి 2 నిమిషాలు బాగా కలపాలి.

పెరుగు బాగా కలిపి.. తర్వాత అందులో వేసి కలుపుతూ 2 నిమిషాలు ఉడకనివ్వాలి.

తర్వాత ఉడకబెట్టిన బంగాళదుంపలను వేసి కలపాలి.

ఈ గ్రేవీలో కావల్సినంత నీళ్లు పోసి రుచికి సరిపడా ఉప్పు వేసి 5 నిమిషాలు బాగా మరిగించి పైన కొత్తిమీర చల్లితే రుచికరమైన హోటల్ స్టైల్ పొటాటో గ్రేవీ రెడీ.