Crying Benefits : నవ్వడమే కాదు.. ఏడ్చినా శరీరానికి మంచిదే.. కన్నీటితో ఆరోగ్య ప్రయోజనాలు
Crying Benefits : నవ్వితే ఆరోగ్యానికి చాలా మంచిదని విన్నాం. కానీ ఏడ్చినా కూడా మీ ఆరోగ్యానికి చాలా ఉపయోగాలు ఉన్నాయి. వాటి గురించి తప్పకుండా తెలుసుకోవాలి.
ఏడుపు చెడ్డ అలవాటుగా పరిగణిస్తారు. పిల్లలు చిన్న చిన్న విషయాలకే చాలా ఏడుస్తుంటారు. అటువంటి పరిస్థితిలో వారు ఏడుపును చూసి తల్లిదండ్రులు చిరాకు పడతారు. పిల్లలు పెరిగేకొద్దీ పూర్తిగా ఏడ్చే అలవాటును అధిగమిస్తారు. ముఖ్యంగా అబ్బాయిలకు ఏడవకూడదని సలహా ఇవ్వడం అందరికీ తెలిసిందే. భావోద్వేగాలను నియంత్రించుకోకుండా బహిరంగంగా కన్నీళ్లు పెట్టుకోవడం మంచిదే అంటున్నారు నిపుణులు. ఏడుపు మానసిక, శారీరక ఆరోగ్యానికి మంచిది. కన్నీళ్లు పెట్టుకోవడం వల్ల కలిగే లాభాలు ఏంటో చూద్దాం..
ఏడుపు మనసుకు ప్రశాంతత కలిగిస్తుంది. భావోద్వేగాలను అదుపులో పెట్టుకోకుండా బహిరంగంగా ఏడవడం వల్ల మనసుకు ప్రశాంతత లభిస్తుంది. ఏడుపు మీకు మంచి అనుభూతిని కలిగిస్తుంది. మీరు ఏదైనా బాధలో ఉంటే బలంగా ఏడవండి. అందరూ చూస్తున్నారు అనుకుంటే ఎవరూ లేని ప్రదేశానికి వెళ్లి ఏడవండి. అప్పుడు మీ మనసుకు ప్రశాంతత లభిస్తుంది. మీకు వీలుకాకపోతే బాత్ రూమ్‌లో కూర్చొనైనా ఏడవండి.. ఏం పర్లేదు. మీ మనసులో ఉన్న భారం తగ్గిపోతుంది.
ఏడుపు నొప్పి నుండి ఉపశమనం పొందుతుందని చాలాసార్లు చూడవచ్చు. మీరు బాధపడ్డా లేదా మానసికంగా ఇబ్బందిపడ్డా.. ఏడ్వడం ద్వారా దాన్ని తగ్గించుకోవచ్చు. మీకు ఉన్న ఒత్తిడి తగ్గేందుకు ఏడుపు అనేది మంచి మెడిసిన్. మీలో ఉన్న బాధ అంతా కన్నీటి రూపంలో పోతుంది. ఇంతకుముందు కంటే ఇప్పుడు కాస్త ఫ్రీగా అవుతారు. అదే మీలోనే బాధను పెట్టుకుంటే అది ఒత్తిడికి దారితీస్తుంది.
ఏడుపు అనేది ఒత్తిడి హార్మోన్లు, ఇతర రసాయనాలను తగ్గిస్తుంది. కన్నీరు ఒత్తిడి స్థాయిలు తగ్గిస్తుంది. కన్నీళ్ల ద్వారా రసాయనాలు ప్రవహిస్తాయి. ఇది ఒత్తిడిని తగ్గిస్తుంది. అందుకే ఏడుపు అనేది చెడ్డది అనుకోవడం మీ పొరబాటు. కచ్చితంగా మీ కంటి నుంచి కన్నీరు రానివ్వండి. అప్పుడే మీ మనసు ప్రశాంతంగా పని చేస్తుంది.
ఏడుపు ద్వారా కళ్ల నుండి కన్నీళ్లు ప్రవహిస్తుంది. ఇది కళ్ళ నుండి హానికరమైన బ్యాక్టీరియాను తొలగిస్తుంది. ఇది కళ్ళు క్లియర్ చేయడానికి సహాయపడుతుంది. కన్నీళ్లు కారడం ద్వారా కళ్లు పొడిబారకుండా చేస్తుంది. ఏడిస్తే మీ కళ్లు బాగుపడతాయి. అప్పుడే మీ కంటి ఆరోగ్యం కూడా బాగుంటంది. అందుకే కంటనీరు రావడం అనేది మీకు మంచిదే.
మీరు నవ్వుతూ ఉన్నా.. వెనుక ఏదైనా బాధను దాచిపెడితే, మీరు చెడు మానసిక స్థితిలో ఉంటారు. మీరు విచారంగా ఉంటే, బహిరంగంగా ఏడుపు మీ మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది. ఏడుపు శరీర ఉష్ణోగ్రతను నియంత్రిస్తుంది. మనస్సును చల్లబరుస్తుంది. మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది. అందుకే ఏడవండి. ఏం పర్లేదు.