Joint Pains: కీళ్ల నొప్పులు మరింత పెంచే ఆహారాలివే, వీటికి దూరంగా ఉంటేనే నయం-never eat these foods with joint pains or arthritis ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Joint Pains: కీళ్ల నొప్పులు మరింత పెంచే ఆహారాలివే, వీటికి దూరంగా ఉంటేనే నయం

Joint Pains: కీళ్ల నొప్పులు మరింత పెంచే ఆహారాలివే, వీటికి దూరంగా ఉంటేనే నయం

Koutik Pranaya Sree HT Telugu
Oct 06, 2024 09:30 AM IST

Joint Pains: కీళ్లలో ఆర్థరైటిస్ సమస్య తలెత్తితే వెంటనే ఈ ఆహారాలను తినడం మానేయండి. ఇవి మీ సమస్యను మరింత తీవ్రతరం చేస్తాయి.

కీళ్ల నొప్పులు పెంచే ఆహారాలు
కీళ్ల నొప్పులు పెంచే ఆహారాలు (shutterstock)

ఆర్థరైటిస్ సమస్య చాలా తీవ్రంగా ఉంటుంది. వ్యక్తి దాన్నుంచి కోలుకున్నాక కూడా నడవాలంటే ఇబ్బందిగానే ఉంటుంది. సాధారణ భాషలో, ఆర్థరైటిస్ అంటే కీళ్ల నొప్పులు. శరీరంలో రెండు ఎముకలు కలిసే చోట ఏ భాగంలోనైనా సరే తీవ్రమైన నొప్పి ప్రారంభమవుతుంది. ముఖ్యంగా వాతావరణం చల్లగా, తేమగా ఉన్నప్పుడు ఈ నొప్పి మరింత పెరుగుతుంది. కాబట్టి చికిత్స కోసం మందులు తీసుకుంటూనే ఆహారం పట్ల జాగ్రత్త వహించడం చాలా ముఖ్యం. కీళ్ల నొప్పుల సమస్య పెరిగితే వెంటనే ఈ ఆహార పదార్థాలను మీ ఆహారంలో చేర్చుకోకండి.

తీపి ఆహార పానీయాలు:

2020 పరిశోధన ప్రకారం, ఎక్కువ తీపి పానీయాలు తాగేవారికి రూమటాయిడ్ ఆర్థరైటిస్ వచ్చే ప్రమాదం ఉంది. తీపి ఆహారాలు, తీపి పానీయాలలో చక్కెరలు ఉంటాయి. ఇది సైటోకిన్ల వల్ల శరీరంలో మంటను కలిగిస్తుంది. దీనివల్ల కీళ్లలో వాపు వచ్చి నొప్పి పెరుగుతుంది. అంతే కాదు షుగర్ వల్ల బరువు కూడా పెరుగుతారు.

ప్రాసెస్ చేసిన ఆహారాలు:

ప్రాసెస్ చేసిన మాంసాలు , ఎర్రటి మాంసాలు లేదా రెడ్ మీట్ అంటే.. మటన్ లాంటి మాంసాహారాలు కీళ్ల నొప్పులను మరింత పెంచుతాయి. వీటికి దూరంగా ఉండటం మంచిది.

ప్యూరిన్లు:

ప్యూరిన్లు ఉన్న ఆహారాలు కీళ్ల నొప్పులతో బాధపడుతున్న వ్యక్తులు తినకూడదని సలహా ఇస్తారు. ప్యూరిన్స్ యూరిక్ యాసిడ్ గా మారి శరీరంలోని కీళ్లలో చేరి వాపు, నొప్పి సమస్యలకు కారణమవుతాయి. జంతు అవయవాలు, కాలేయం, మూత్రపిండాలు, క్యాండీలు, డెజర్ట్, ఎండుద్రాక్ష, పండ్ల రసాలు, సంతృప్త కొవ్వులు వంటి ప్యూరిన్ అధికంగా ఉండే ఆహారాలు.. కాలీఫ్లవర్, పాలకూర, పుట్టగొడుగుల వంటి కొన్ని కూరగాయలలో కూడా ప్యూరిన్లు ఉంటాయి.

ఒమేగా 6 ఫ్యాటీ యాసిడ్లు:

ఒమేగా 6 ఫ్యాటీ యాసిడ్లు ఉండే నూనెలు కీళ్ల నొప్పులు లేదా ఆర్థరైటిస్ సమస్యను పెంచుతాయి. పొద్దుతిరుగుడు విత్తనాలు, వెజిటేబుల్ నూనె, మొక్కజొన్న నూనె లాంటివి ఈ సమస్యకు కారణం. అయితే, ఒమేగా 6 కొవ్వు ఆమ్లాలను తక్కువ పరిమాణంలో ఉపయోగించవచ్చు. కానీ ఎక్కువ మొత్తంలో తీసుకోవడం వల్ల మాత్రం ఆర్థరైటిస్ పెరుగుతుంది.

సంతృప్త కొవ్వులు:

వెన్న, జున్ను, మాంసం ఇవన్నీ సంతృప్త కొవ్వును కలిగి ఉంటాయి. ఇవి శరీరంలో ఊబకాయం, మంటను పెంచడంలో సహాయపడతాయి. ఇది కీళ్ల నొప్పులను పెంచుతుంది.

అధిక ఉప్పు:

ఉప్పు ఎక్కువగా ఉండే ఆహారాలు, చిప్స్, ప్యాకేజ్డ్ ఆహారాలు వంటివన్నీ ఎక్కువ ఉప్పును కలిగి ఉన్న ఆహారాలు. ఇలాంటి ఆహారాలకు దూరంగా ఉండాలి. అధిక సోడియం శరీరంలో రుమటాయిడ్ ఆర్థరైటిస్ ప్రమాదాన్ని పెంచుతుంది.

Whats_app_banner