Masala Paste: నాన్ వెజ్ వంటకాల కోసం మసాలా పేస్ట్ రెసిపీ, చికెన్, మటన్ ఏదైనా ఇది వేసి వండితే అదిరిపోతుంది
Masala Paste: నాన్ వెజ్ వంటకాల్లో మసాలాలదే ముఖ్య పాత్ర. కూరలను ఘుమఘుమలాడించేది మనం వేసే మసాలా పేస్ట్. దీన్ని ఎలా చేయాలో తెలుసుకోండి.
Masala Paste: చేపలు, రొయ్యలు, చికెన్, మటన్ ఏదైనా టేస్టీగా ఉండాలంటే సరిపడా మసాలాలు పడాల్సిందే. మసాలా పేస్ట్ ను సులువుగా ముందే తయారు చేసి పెట్టుకుంటే ఏ కూర అయినా వండడం ఈజీ అయిపోతుంది. ఇక్కడ మేము మసాలా పేస్ట్ రెసిపీ ఇచ్చాము. దీన్ని ముందుగా రెడీ చేసి పెట్టుకోండి. ఈ మసాలా పేస్ట్‌ని వేసి చికెన్, మటన్, రొయ్యలు వంటి కూరల్లో వండినా, ఏ నాన్ వెజ్ వంటకం వండినా రుచి మామూలుగా ఉండదు. ఈ మసాలా పేస్ట్ రెసిపీని గుర్తుపెట్టుకుంటే చాలు, నాన్ వెజ్ కర్రీలు వండడం ఎంతో సులువుగా అనిపిస్తుంది.
మసాలా పేస్ట్ రెసిపీకి కావలసిన పదార్థాలు
ధనియాలు - ఒక స్పూను
గస గసాలు - రెండు స్పూన్లు
జీలకర్ర - ఒక స్పూను
దాల్చిన చెక్క - చిన్న ముక్క
లవంగాలు - నాలుగు
పచ్చిమిర్చి - నాలుగు
అల్లం - చిన్న ముక్క
వెల్లుల్లి రెబ్బలు - పది
నీరు - తగినంత
మసాలా పేస్ట్ రెసిపీ
1. నాన్ వెజ్ వంటకాలు వండడం కష్టం అనుకుంటారు ఎంతోమంది. ఈ మసాలా పేస్ట్‌ను ముందుగానే రెడీ చేసుకుంటే చాలా సులువుగా చికెన్, మటన్, రొయ్యలు వంటివి వండవచ్చు.
2. ముందుగా మిక్సీ జార్లో గసగసాలు, అల్లం, వెల్లుల్లి, దాల్చిన చెక్క, లవంగాలు వేసి గ్రైండ్ చేసుకోవాలి.
3. తర్వాత పచ్చిమిర్చి కూడా వేసి గ్రైండ్ చేయాలి.
4. అవసరానికి సరిపడా నీటిని వేయాలి. ఇది మెత్తగా పేస్ట్ చేసుకున్నాక తీసి పక్కన పెట్టుకోవాలి.
5. అంతే మసాలా పేస్ట్ రెడీ అయిపోయినట్టే.
6. చికెన్, మటన్ వంటి ఏ కూరలు వండినా ఈ మసాలా పేస్ట్‌ను వేసి వండండి, ఘుమఘుమలాడిపోతుంది.
చాలామందికి ఈ మసాలా పేస్టు... కూర వండేటప్పుడు ఎప్పుడు వేయాలని ఆలోచిస్తూ ఉంటారు. స్టవ్ మీద కళాయి పెట్టాక నూనె, ఉల్లిపాయలు వేసి వేయించాక.. అప్పుడు ఈ మసాలా పేస్ట్ ను వేసి కాసేపు వేయించాలి. ఆ తర్వాత మటన్ ముక్కలు లేదా చికెన్ ముక్కలు వేసి వండుకోవచ్చు. ఒకవేళ మీరు నాటుకోడిని వండాలనుకుంటే స్టవ్ మీద కళాయి పెట్టి ఉల్లి ముద్ద, మసాలా పేస్టు, నాటుకోడి ముక్కలు అన్నీ ఒకసారి వేసి ఉడికించేయొచ్చు. నాటుకోడి ఉడకడానికి చాలా ఎక్కువ సమయం పడుతుంది కాబట్టి ఈ ఉల్లి ముద్ద, మసాలా పేస్ట్ కూడా బాగా ఉడుకుతాయి. అవి చికెన్ ముక్కలకు పట్టి మంచి సువాసనను అందిస్తాయి. రొయ్యలు వండేటప్పుడు మాత్రం ఉల్లి ముద్దను వేయించాక ఈ మసాలా పేస్ట్ ను వేయండి. ఆ తర్వాత రొయ్యలను వేసి కూరగా వండుకోండి. ఈ మసాలా పేస్ట్‌ను రుబ్బుతున్నప్పుడే మసాలా ఘమఘుమలాడిపోతుంది. ఒక్కసారి మేము చెప్పిన విధానంలో మసాలా పేస్ట్‌ను వేసి వండి చూడండి. దాని రుచి మీకే అర్థమవుతుంది.
టాపిక్